Sitara Ghattamaneni: సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తనయ సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా సెలబ్రిటీల పిల్లలు ఎవరైనా పెద్దయ్యాకా ఫ్యాన్స్ ను సంపాదించుకుంటారు. కానీ, సీతూ పాప మాత్రం పుట్టినప్పటినుంచే సెలబ్రిటీగా మారిపోయింది. ఆమెకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది. మహేష్ కొడుకు గౌతమ్ చాలా సైలెంట్ తో పాటు సోషల్ మీడియాకు అతను చాలా దూరంగా పెరుగుతున్నాడు.
కానీ, సీతూ పాప అలా కాదు. ఏడాది వయస్సు ఉన్నప్పటి నుంచే తండ్రితో సెట్స్ కు రావడం, ముద్దు ముద్దు మాటలు చెప్తూ తండ్రికి అలసట లేకుండా చేయడం చేస్తూ వచ్చింది. ఇక ఈ తండ్రీకూతుళ్ల వీడియోలను నమ్రత ఫోటోలు , వీడియో లు తీసి అభిమానులతో పంచుకుంటూ ఉండేది. అలా సితార ఏడాది వయస్సు నుంచే తనకంటూ అభిమానులను సంపాదించుకుంది. అతి చిన్న వయస్సులోనే యూట్యూబ్ లో వీడియోలు చేయడం, డ్యాన్స్ వీడియోలు చేయడం చేసి షాక్ ఇచ్చింది.
Nabha Natesh: బ్లాక్ శారీలో నభా నటేష్ గుబులు
సొంతగా ఒక యూట్యూబ్ ను క్రియేట్ చేసి.. తాను నచ్చిన అభిప్రాయాలను తన ఫ్రెండ్స్ తో కలిసి షేర్ చేసుకునేది. చిన్నప్పటి నుంచి సితారను అభిమానులకు దగ్గరగా ఉంచడంతో ఆమె ఒక యువరాణిగా మారిపోయింది. ఇక పదేళ్లు వచ్చేసరికి సితార ఒక బ్రాండ్ కు అంబాసిడర్ గా కూడా మారింది. ఇంటర్నేషనల్ ఆభరణాల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన విషయం తెల్సిందే. ఇంటర్నేషనల్ ఆభరణాల కంపెనీ అయిన PMJ జ్యూవెలరీకి సితార బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతోంది.
గతేడాది.. PMJ జ్యూవెలరీకి సంబంధించిన యాడ్స్.. న్యూయార్క్ లోనే టైమ్ స్క్వేర్ పై సితార ఫొటోలతో స్క్రీనింగ్ అయ్యాయి. అప్పట్లో ఆ ఫోటోలు ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ ఏడాది రెండో సారి సితార ఫోటోలు అదే టైమ్ స్క్వేర్ పై వచ్చాయి. ఇది అరుదైన విషయమని చెప్పాలి. మొదటసారి చేసిన యాడ్ కోసం సీతూ పాప లక్షల్లో పారితోషికం అందుకుంది. అయితే మొదటి పారితోషికాన్ని ఆమె పేద ప్రజలకు అందించింది.
Jr NTR : హామీ ఇచ్చి మాట తప్పిన ఎన్టీఆర్… అభిమాని తల్లి ఆవేదన
తన తండ్రి మహేష్ లానే గొప్ప మనసు ఉన్న సీతూ పాప.. తన మొదటి జీతంలో ఒక్క రూపాయిని కూడా ముట్టుకోకుండా ఛారిటీకి దానం చేసి సూపర్ స్టార్ కూతురు అనిపించుకుంది. ఇక ఇప్పుడు సితార రెమ్యూనరేషన్ డబుల్ అయ్యిందని టాక్ నడుస్తోంది. అయితే గతేడాదిలా సితార తన రెమ్యూనరేషన్ ను ఛారిటీకి ఇస్తుందా.. ? లేక తన వద్దనే ఉంచుకుంటుందో తెలియాల్సి ఉంది.
ఇదంతా పక్కన పెడితే.. సితార భవిష్యత్ లో హీరోయిన్ గా మారతానని చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే. అమ్మ, నాన్న, అన్న నుంచి ఏదైనా నేర్చుకోవాలి అంటే.. తల్లి నమ్రత దగ్గరనుంచి ఫ్యాషన్ సెన్స్, తండ్రి మహేష్ నుంచి యాక్టింగ్, అన్న నుంచి ఓపిక నేర్చుకుంటానని ఒక ఇంటర్వ్యూలో సితార తెలిపింది. మరి సూపర్ స్టార్ నట వారసురాలు ఎప్పుడు ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తుందో చూడాలి.