Best Tech Gifts For Christmas-New Year : క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. ఇప్పటికే ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్ పై అదిరిపోయే ఆఫర్స్ ను అందిస్తున్నాయి టాప్ ఈ కామర్స్ సంస్థలన్నీ. ఇక అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి బిజీ ప్లాట్ ఫామ్స్ లో సేల్స్ స్పీడ్ గా నడుస్తున్నాయి. ఇక మీకు ఇష్టమైన వారికి బెస్ట్ టెక్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్. ఇక ఇంకెందుకు ఆలస్యం.. లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు ఉన్న బెస్ట్ గిఫ్ట్స్ ఏంటో ఓ లుక్కేసేద్దాం.
ఫెస్టివల్ కు బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే టెక్ ఆప్షన్స్ ఎన్నో ఉన్నాయి. వీటిలో మొబైల్స్ నుంచి ఇయర్ బర్డ్స్, స్మార్ట్ వాచెస్, ఐఫోన్స్, టాప్ బ్రాండ్ గాడ్జెట్స్ ఉన్నాయి. వీటిలో స్మార్ట్ వాచెస్, స్మార్ట్ టీవీలు సైతం ఉన్నాయి. ఇవన్నీ అతి తక్కువ ధర నుంచే టాప్ ఫ్లాట్ఫామ్స్ లో అందుబాటులో ఉన్నాయి.
Budget-Friendly Tech Gifts –
లో బడ్జెట్ లో ఇవ్వగలిగే బెస్ట్ టెక్ గిఫ్ట్స్ లో ఇయర్ బర్డ్స్, స్మార్ట్ వాచెస్, పోర్టబుల్ స్పీకర్స్, స్మార్ట్ హోమ్ డివైసెస్ ఎప్పుడూ ముందుంటాయి. ఇక ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్లో ఈ ఆఫర్స్ అద్భుతంగా ఉన్నాయి. బోట్, బౌల్ట్, వన్ ప్లస్, ఒప్పో వంటి టాప్ బ్రాండ్ కంపెనీల ప్రొడక్ట్స్ పై బెస్ట్ సేల్ నడుస్తుంది. బ్లూటూత్ స్పీకర్స్, యాంటీనాయిస్ క్యాన్సిలేషన్ బ్లూటూత్, వైర్లెస్ ఇయర్ బర్డ్స్ వంటి టాప్ ఆప్షన్స్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో అందుబాటులో ఉన్నాయి.
Mid-Range Tech Options –
మిడ్ రేంజ్ టెక్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కచ్చితంగా టాబ్లెట్స్, హై ఎండ్ స్మార్ట్ ఫోన్స్ ఇచ్చేయొచ్చు. తాజాగా లాంఛ్ అయిన రియల్ మీ, జియో, రెడ్ మీ మొబైల్స్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ గా మార్కెట్లోకి వచ్చేసాయి. ఇక హై క్వాలిటీ హ్యాండ్ సెట్స్, ఇయర్ ఫోన్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. సోనీ, సామ్ సాంగ్, వన్ ప్లస్ కంపెనీలకు చెందిన బెస్ట్ గాడ్జెట్స్ కొనుగోలు చేసేయొచ్చు. ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్స్ డీల్ లో రూ. 5000 లోపే బెస్ట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువ ధరకే స్మార్ట్ టీవీలు సైతం అందుబాటులో ఉన్నాయి. వీటిని కూడా ఈజీగా ట్రై చేసేయెుచ్చు.
High-End Tech Options –
హై ఎండ్ టెక్ గిఫ్ట్స్ కూడా ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఇక ఇష్టమైన వారికి ఎంత ఇచ్చినా తక్కువే అనుకుంటే బెస్ట్ ఆఫ్షన్స్ ఉన్నాయి. హై ఎండ్ టెక్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకునే వారు తాజాగా లాంఛ్ అయిన ఐఫోన్ బెస్ట్ ఆప్షన్. ఐ ఫోన్ 16 సిరీస్ మొబైల్స్ తో పాటు ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మొబైల్స్ రూ. 60 వేలలోపే అందుబాటులో ఉన్నాయి. ఇక గ్యాలక్సీ ఫోల్డబుల్ మొబైల్స్, మోటోరోలా ఎడ్జ్ 15 నియో వంటి బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ హై రేంజ్ లో ఇవ్వగలిగే బెస్ట్ ఆప్షన్స్ గా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీకు కావాల్సిన వారికి బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడే ఆర్డర్ చేసేయండి.
ALSO READ : 2024లో బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ మెుబైల్స్ ఇవే! ధర తక్కువ.. ఫీచర్స్ ఎక్కువ