Big Stories

Omicron:- ఒమిక్రాన్ వల్ల ప్రాణహాని.. షాకింగ్ విషయాలు బయటికి..

Omicron:- కోవిడ్ అనేది పూర్తిగా అంతరించిపోలేదని శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఎన్నో వేరియంట్ల రూపంలో మనుషులను ఇబ్బందులు పెట్టింది. కానీ వాటిలో కొన్ని వేరియంట్లు మాత్రం మనిషిని అంత ప్రభావితం చేయడం లేదని వారు ముందుగానే చెప్పారు. కానీ ఒమిక్రాన్‌పై తాజాగా చేసిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలకు మరో కొత్త విషయం తెలిసింది.

- Advertisement -

కోవిడ్ నుండి ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ బయటపడిన తర్వాత అది వ్యాప్తి విషయంలో వేగంగా ఉంది కానీ.. దాని వల్ల పేషెంట్ ఆరోగ్యానికి ఎక్కువగా ప్రమాదం లేదని తేల్చారు. దీని వల్ల చాలామంది ఒమిక్రాన్ సోకినా కూడా అధైర్య పడకుండా ఉన్నారు. కానీ ఇప్పుడు ఇతర సీజనల్ వ్యాధులతో పోలిస్తే.. ఒమిక్రాన్ అనేది పేషెంట్లపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని, మృత్యువుకు దారితీస్తుందని అన్నారు. ఒకప్పుడు దీని వల్ల ప్రమాదం లేదు అన్న శాస్త్రవేత్తలు సైతం ఈ పరిస్థితి చూసి ఆశ్చర్యపోతున్నారు.

- Advertisement -

2021 నుండి 2022 మధ్యలో 18 కంటే వయసు ఎక్కువ ఉన్నవారిలో 55 శాతం మంది ఇతర సీజనల్ వ్యాధులకంటే ఒమిక్రాన్ వేరియంట్ వల్లే ఎక్కువగా మృత్యువాత పడ్డారని తెలుస్తోంది. అది కూడా వైరస్ సోకిన 30 రోజుల్లోనే వీరు మరణించడం గమనార్హం. ముఖ్యంగా సీజనల్ వ్యాధి అయిన ఇన్ఫ్‌ల్యూయెన్జాను కోవిడ్ 19తో పోల్చారు. ఈ రెండు వ్యాధులు ముందుగా ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపిస్తాయి. అంతే కాకుండా ఒకే విధంగా వ్యాపిస్తాయి కూడా.

ఒమిక్రాన్ సోకిన పేషెంట్లను, ఇన్ఫ్‌ల్యూయెన్జా సోకిన పేషెంట్లను శాస్త్రవేత్తలు పరీక్షించి చూశారు. 30 రోజుల్లో ఇన్‌ఫ్లూయెన్జాతో అడ్మిట్ అయిన పేషెంట్లలో 19 మంది, ఒమిక్రాన్‌ వల్ల అడ్మిట్ అయిన పేషెంట్లలో 44 మంది చనిపోయినట్టు వారు తేల్చారు. ఇన్‌ఫ్లూయెన్జా కంటే ఒమిక్రాన్ అనేది పేషెంట్ల ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, అందుకే వారు తొందరగా మృత్యువాత పడుతున్నారని అన్నారు. పైగా కోవిడ్ 19 వ్యాక్సిన్ కూడా ఒమిక్రాన్‌పై ఎక్కువగా ప్రభావం చూపించలేదని వారు షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. అందుకే ప్రజలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News