BigTV English
Advertisement

New Smartphone: మ మ మాస్ ఫోన్ లాంచ్.. పేరు కొత్తదైతేనేమ్, ఫీచర్లు మాత్రం పిచ్చెక్కించాయ్!

New Smartphone: మ మ మాస్ ఫోన్ లాంచ్.. పేరు కొత్తదైతేనేమ్, ఫీచర్లు మాత్రం పిచ్చెక్కించాయ్!

Wiko Hi Enjoy 70 5G: ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల హవా పెరిగిపోయింది. అందులోనూ భారత దేశంలో స్మార్ట్‌ఫోన్లు వాడే వారు అధికం అయిపోయారు. మార్కెట్‌లోకి కొత్త ఫోన్ వచ్చిందంటే ఎగబడి కొనేస్తున్నారు. అందువల్లనే డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలో దేశీయ మార్కెట్‌లోకి రోజుకో కొత్త రకం కంపెనీ పుట్టుకొస్తుంది. బ్రాండెడ్ కంపెనీ ఫోన్లకు సైతం చిన్న చిన్న కంపెనీలు గట్టి పోటీనిస్తున్నాయి.


అంతేకాకుండా మరికొన్ని స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు సామాన్యులను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లుగల ఫోన్లను తీసుకొచ్చి ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే చాలా మొబైల్స్ అలా వచ్చినవే మార్కెట్‌లో బాగా క్లిక్ అయ్యాయి. తాజాగా మరో కంపెనీ తన లైనప్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో పరిచయం చేసింది. ప్రముఖ Huawei ఎకోసిస్టమ్ బ్రాండ్ Wiko చైనా మార్కెట్లో ‘Wiko Hi Enjoy 70 5G’ సరసమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.

అయితే ఈ పేరు కొత్తగా ఉన్నప్పటికీ ధర, స్పెసిఫికేషన్లు మాత్రం అద్భుతంగా ఉన్నాయనే చెప్పాలి.  Wiko Hi Enjoy 70 5G బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 6.75 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో 13 మెగాపిక్సెల్ AI పవర్డ్ కెమెరా ఉంది. వీటితో పాటు మరెన్నో ఉన్నాయి. ఇప్పుడు Wiko Hi Enjoy 70 5Gకి సంబంధించిన ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు, ధర మొదలైన వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.


Wiko Hi Enjoy 70 5G Price

Also Read: దూకుడు పెంచిన రెడ్‌మి.. రూ.11000 లకే కొత్త 5జీ ఫోన్.. ఫీచర్లు దుమ్ము దులిపేశాయ్..!

Wiko Hi Enjoy 70 5G ధర విషయానికొస్తే.. Wiko Hi Enjoy 70 మొత్తం మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో 6GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర 999 Yuan (సుమారు. రూ. 11,743)గా ఉంది. అదే సమయంలో మిడ్ రేంజ్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర 1199 Yuan (సుమారు రూ. 14,175), అలాగే టాప్ అండ్ హై 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 99 యువాన్ (సుమారు రూ. 16,524)గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 6న ఉదయం 10:08 గంటలకు ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంటుంది.

Wiko Hi Enjoy 70 5G Specifications

Wiko Hi Enjoy 70 5G స్మార్ట్‌ఫోన్ 720×1600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.75-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. వికో హాయ్ ఎంజాయ్ 70 స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6GB + 128GB, 8GB + 128GB, 8GB + 256GB స్టోరేజ్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ HarmonyOSలో పని చేస్తుంది. HarmonyOS కనెక్ట్ సర్టిఫికేషన్‌తో వస్తుంది. కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వెనుక భాగంలో 13-మెగాపిక్సెల్ AI పవర్డ్ కెమెరా ఉంది. ఇది సూపర్ నైట్ మోడ్, AI బ్యూటీ, AI స్నాప్‌షాట్‌కు మద్దతు ఇస్తుంది. ఇది 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ బ్యాటరీ 13 గంటల ఆన్‌లైన్ మూవీని, 11 గంటల చిన్న వీడియో బ్రౌజింగ్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఐస్ క్రిస్టల్ బ్లూ, స్నో వైట్, మిడ్‌నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.

Related News

Motorola Mobile Offer: ఫ్లిప్‌కార్ట్‌లో హాట్‌ డీల్‌.. రూ.19వేల మోటరోలా ఫోన్‌ ఇప్పుడు కేవలం రూ.15వేల లోపే..

Oneplus Nord 2T Ultra 5G: వన్‌ప్లస్‌ నోర్డ్‌ 2టీ అల్ట్రా 5జీ.. ఫ్లాగ్‌షిప్‌ ఫీచర్లతో వచ్చిన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌

AI Hospital Bill Error: ఆస్పత్రిలో రూ.1.6 కోటి బిల్లు చూసి షాకైన యువకుడు.. అసలు బిల్లు రూ.29 లక్షలే.. మోసం ఎలా కనిపెట్టాడంటే

Instagram vs YouTube Earnings: ఇన్‌స్టాగ్రామ్ vs యూట్యూబ్.. కంటెంట్ క్రియేటర్లకు అధిక సంపాదన ఇచ్చే ప్లాట్‌ఫామ్ ఏది?

Motorola Edge 50 Ultra: రూ.10వేల తగ్గింపుతో మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా.. ప్రీమియం ఫోన్‌ బడ్జెట్‌ ధరలో..

Email Assistant: సరికొత్త ఏఐ టూల్.. మీకొచ్చే ఇ-మెయిల్స్‌‌కు మీ స్టైల్లోనే రిప్లై!

iQOO 15 Mobile: లుక్‌, స్పీడ్‌, కెమెరా మూడు కలిసిన మాస్టర్‌పీస్‌ ఐక్యూ 15.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Phone Fake charger: ఛార్జర్లతో డ్యామేజ్ అవుతున్న ఫోన్లు.. నకిలీ ఛార్జర్లను ఇలా గుర్తించండి

Big Stories

×