BigTV English

Redmi 14C Launched: దూకుడు పెంచిన రెడ్‌మి.. రూ.11000 లకే కొత్త 5జీ ఫోన్.. ఫీచర్లు దుమ్ము దులిపేశాయ్..!

Redmi 14C Launched: దూకుడు పెంచిన రెడ్‌మి.. రూ.11000 లకే కొత్త 5జీ ఫోన్.. ఫీచర్లు దుమ్ము దులిపేశాయ్..!

Redmi 14C Launched: స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ రెడ్‌మి పలు ఫోన్లను లాంచ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. రకరకాల మోడళ్లను తీసుకొస్తూ ఫోన్ ప్రియుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి 4జీ ఫోన్ల డిమాండ్ తగ్గిపోయింది. నెట్‌వర్క్ స్పీడ్‌కోసం ఇప్పుడు మార్కెట్‌లో 5జీ హవా నడుస్తోంది. అందువల్లనే ప్రముఖ కంపెనీలు సైతం 5జీ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే రెడ్‌మి కూడా 5జీ నెట్‌వర్క్‌తో పలు ఫోన్లను రిలీజ్ చేస్తూ ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా తక్కువ ధరలో కూడా 5జీ ఫోన్లను లాంచ్ చేస్తూ అట్రాక్ట్ చేస్తుంది. తాజాగా కంపెనీ ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి పరిచయం చేసింది.


అతి తక్కువ ధరలో Redmi 14C స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది గరిష్టంగా 8 GB RAM + గరిష్టంగా 256 GB స్టోరేజ్‌తో వచ్చింది. అంతేకాకుండా కంపెనీ ఇందులో భారీ బ్యాటరీ అందించింది. ఏకంగా ఈ ఫోన్ 5160mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది మాత్రమే కాదు.. ఇందులో ప్రాసెసింగ్ కోసం MediaTek Helio G81 చిప్‌సెట్ అందించారు. ఇది 50MP ప్రధాన కెమెరా ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన పెద్ద 6.88 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ధర, స్పెసిఫికేషన్లు, ఇతర విషయాల గురించి పూర్తిగా తెలుసుకందాం.

Redmi 14c Specifications


Also Read: 50MP సెల్ఫీ కెమెరా, 108MP మెయిన్ కెమెరాతో క్లాసిక్ ఫోన్లు లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!

Redmi 14C ఫోన్ IPS LCD ప్యానెల్‌తో 6.88 అంగుళాల భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో మార్కెట్‌లోకి వచ్చింది. అంతేకాకుండా 600 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. కంపెనీ దీనికి 18W ఛార్జింగ్ ఫీచర్‌ను సపోర్ట్‌తో 5160mAh పెద్ద బ్యాటరీని అందులోబాటులోకి తీసుకొచ్చింది. అలాగే ఫోన్‌లో MediaTek Helio G81 చిప్‌సెట్ అందించబడింది. ఇది గరిష్టంగా 8 GB RAM + గరిష్టంగా 256 GB స్టోరేజ్‌తో తీసుకొచ్చింది.

అదే సమయంలో స్టోరేజ్‌ని పెంచుకోవడానికి మైక్రో SD కార్డ్‌కి సపోర్ట్ కూడా ఫోన్‌లో అందించబడుతుంది. గ్రాఫిక్స్ కోసం ఇందులో Mali-G52 MC2 GPU అందుబాటులో ఉంది. ఇక కెమెరా విషయానికొస్తే.. ఇది వెనుక వైపు 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంది. దీనితో పాటు LED ఫ్లాష్‌కు మద్దతు కూడా అందించబడింది. ఫోన్ ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాలింగ్‌ల కోసం 13-మెగాపిక్సెల్ కెమెరాను కంపెనీ అందించింది. ఇది కాకుండా ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది.

Redmi 14C Price

Redmi 14C స్మార్ట్‌ఫోన్ మొత్తం రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో బేస్ 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ PLN 2,999 (దాదాపు రూ. 11,000) నుండి ప్రారంభమవుతుంది. అలాగే దీని టాప్ 8 GB RAM + 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర PLN 3,699 (సుమారు రూ. 13,500)గా కంపెనీ నిర్ణయింది. కాగా కంపెనీ దీనిని మిడ్‌నైట్ బ్లాక్, సేజ్ గ్రీన్, డ్రీమీ పర్పుల్, స్టార్రీ బ్లూ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఈ ఫోన్‌ కంపెనీ గ్లోబల్ వెబ్‌సైట్‌లో కూడా లిస్ట్ చేయబడింది.

Related News

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Big Stories

×