Athadu: ప్రిన్స్ మహేష్ బాబు ( Mahesh Babu )నటించిన అతడు సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా రాగా మహేష్ బాబు అలాగే త్రిష హీరో, హీరోయిన్లుగా చేశారు. అయితే ఇందులో ఉన్న డైలాగ్స్ ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో ఆడు మగాడ్రా బుజ్జి అనే డైలాగ్ ను ఎక్కడపడితే అక్కడ వాడేసుకుంటున్నారు. తాజాగా మాజీ ఫుట్ బాల్ ప్లేయర్ యాయా టౌరే ( Yaya Touray ) కోసం వాడేసారు. అతడు సినిమాలో విలన్స్ ను మహేష్ బాబు కొట్టినట్లుగానే… చాలా పద్ధతిగా గోల్స్ సాధిస్తాడు యాయా టౌరే. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ, అతడు సినిమాలో తనికెళ్ల భరణి చెప్పే ఆడు మగాడ్రా బుజ్జి ( Aadu Magaadra Bujji ) డైలాగ్ వాడేసారు మీమర్స్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read: INDW vs ENGW: స్మృతి , హర్మన్ పోరాటం వృధా…సెమీస్ కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్..టీమిండియాకు ఇంకా ఛాన్స్
మాజీ ఫుట్ బాల్ ప్లేయర్ యాయా టౌరే ( Yaya Touray ) గురించి తెలియని వారుండరు. ఐవరీకోస్టు లో జన్మించిన యాయా టౌరే చాలా రోజులపాటు ఫుట్ బాల్ ప్లేయర్ గా కొనసాగాడు. గొప్ప ఆఫ్రికన్ ప్లేయర్స్ లో ఒకడైన యాయా టౌరే.. దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఆఫ్రికన్ ఫుట్ బాల్ ఆఫ్ ద ఇయర్ గా ఎన్నికయ్యాడు. 2011 నుంచి 2014 వరకు అంటే నాలుగు సంవత్సరాల పాటు ఆఫ్రికన్ ఫుట్ బాల్ ఆఫ్ ద ఇయర్ గా ఎన్నిక కావడం గమనార్హం. 18 సంవత్సరాల వయసులోనే ఫుట్ బాల్ ప్రారంభించిన యాయా టౌరే…. గోల్స్ చేయడంలో దిట్ట. ప్రత్యర్థిని తికమక పెట్టి… బంతిని నేరుగా గోల్ వద్దకు తీసుకువెళ్తాడు. అలా ప్రత్యర్థులకు చుక్కలు చూపించి మ్యాచ్ గెలిపిస్తాడు.
ఈ నేపథ్యంలోనే యాయా టౌరే గురించి అతడు సినిమాలో తనికెళ్ల భరణి చెప్పే డైలాగ్ ను వాడుకుని.. మీమర్స్ రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యాయా టౌరే కోసం వాడిన అతడు డైలాగ్ వైరల్ గా మారింది. ఇది చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్ దీన్ని అరుదైన గౌరవంగా పీల్ అవుతున్నారు. జై మహేష్ బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా, మహేష్ బాబు హీరోగా చేసిన అతడు సినిమా 2005 సంవత్సరంలో రిలీజ్ అయి, బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా టీవీలో వస్తే, చూసే వాళ్లు చాలానే ఉన్నారు. ఇటీవలే రీ-రిలీజ్ అయితే, కూడా ఎగబడి చూశారు ఫ్యాన్స్. మొన్న మహేష్ బాబు ( athadu movie) పుట్టిన రోజు సందర్భంగానే రీ-రిలీజ్ అయింది.
Also Read: Sara Tendulkar: 28 ఏళ్ల సారా ఇంత అందంగా ఉండటం వెనుక సీక్రెట్ ఇదే.. రాత్రి అయితే అవే పనులు ?
Athadu Video Elevating International Football Legend
The crossover video of Tanikella Bharani from Athadu elevating #YayaTouré went viral on social media in no time.
Mahesh Babu fans are super surprised and elated to see such a tribute using their favourite hero’s film clip.… pic.twitter.com/0U0ChK20mO
— Tupaki (@tupaki_official) October 20, 2025