BigTV English

Bigg Boss 9 Promo: తనూజ దెబ్బకు పచ్చళ్ళ పాప సైలెంట్.. గట్టిగా ఇచ్చిందిగా!

Bigg Boss 9 Promo: తనూజ దెబ్బకు పచ్చళ్ళ పాప సైలెంట్.. గట్టిగా ఇచ్చిందిగా!
Advertisement

Bigg Boss 9 Promo: బిగ్ బాస్.. తెలుగు 9వ సీజన్లో ఏడవ వారం మొదలైంది. ఈ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా నామినేషన్ ప్రక్రియను బిగ్ బాస్ మొదలుపెట్టారు. అటు వైల్డ్ కార్డ్స్, ఇటు హౌస్ మేట్స్ మధ్య నామినేషన్స్ ప్రక్రియ చాలా వాడి వేడిగా సాగుతోంది
ముఖ్యంగా ఒకరిని మించి మరొకరు ఇతరులను టార్గెట్ చేస్తూ వ్యాలీడ్ లేని పాయింట్స్ తో తికమక పెట్టిస్తున్నారు అంటూ కొంతమంది కామెంట్లు చేయగా.. మరికొంతమంది అసలైన నామినేషన్ ఫైర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఎవరికి వారు కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే . ఇది ఇలా ఉండగా తాజాగా 43వ రోజుకు సంబంధించిన రెండవ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో నామినేషన్స్ ప్రక్రియ చాలా గట్టిగానే మొదలైంది. ముఖ్యంగా తనూజా దెబ్బకు పచ్చళ్ళ పాప సైలెంట్ అయిపోయిందని చెప్పవచ్చు. మరి ఈ ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.


దివ్య వల్లే భరణి ఎలిమినేట్ అయ్యారా?

తాజాగా విడుదల చేసిన ప్రోమోలో.. దివ్యా నిఖిత సాయిని నామినేట్ చేస్తూ ఆయన ముఖాన ఫోమ్ రాసింది. మీ ఒపీనియన్ రైట్ అనే థాట్ లో మీరు ఉంటారు అంటూ దివ్య నిఖిత చెప్పగా.. ఒక్క రీజన్ చెప్పండి అని సాయి అడుగుతాడు. దాంతో దివ్య నేను చెప్పను సాయి అంటూ చెప్పేసరికి మీలాగా ఫ్యామిలీ డ్రామాలు నేను ఆడటం లేదు. అందలంలో ఉన్న వ్యక్తి అనవసరంగా బయటకి వెళ్ళిపోయారు అంటూ దివ్యని టార్గెట్ చేస్తూ సాయి చేసిన కామెంట్లకు ఆమె మండిపడింది.. ఎవరైనా నీతో చెప్పారా దివ్య వల్లే భరణి ఎలిమినేట్ అయ్యారు అంటూ ఆమె చెబుతుండగానే మీరు చెప్పే పాయింట్ వ్యాలిడిటీలో లేదు అంటూ సాయి గట్టిగా అరి చేశారు.

రెచ్చిపోయిన రాము రాథోడ్..

తర్వాత రాము రాథోడ్ ని రీతు చౌదరి నామినేట్ చేస్తూ తన పాయింట్ చెప్పుకొచ్చింది. దీంతో రాము రాథోడ్ ఆ నామినేషన్ ని తట్టుకోలేకపోయాడు. రీతూ చౌదరి పై విరుచుకుపడ్డాడు. రీతు చౌదరి కూడా నా సపోర్ట్ వల్లే నువ్వు కెప్టెన్ అయ్యావు అని చెప్పేసరికి ఆయన వెటకారంగా మిమ్మల్ని ఎవరైనా నన్ను సహాయం చేయమని అడిగానా అంటూ తోటి వాళ్లను అడిగి మరీ తెగ రచ్చ చేసేసారు.


పచ్చళ్ళ పాప నోరు మూయించిన తనూజ.

ఆఖరిలో పచ్చళ్ళ పాప రమ్య తనూజాను నామినేట్ చేస్తూ.. నువ్వు ముసుగులో ఉన్నావు. అక్కడి నుంచి బయటకు రా.. పెద్ద డ్రామా క్వీన్ నువ్వు.. నటిస్తున్నావు.. నువ్వు ఫేక్ అంటూ ఊహించని కామెంట్లు చేసింది. దీంతో మండి పడిపోయిన తనూజ నువ్వు క్వీన్ అనుకుంటావా.. సూపర్ క్వీన్ అనుకుంటావా.. నీ ఇష్టం.. నా గేమ్ ఇది. నన్ను పాయింట్ అవుట్ చేయడానికి నువ్వు ఎవరు. నీ ఏజ్ కి తగ్గట్టుగా నువ్వు బిహేవ్ చెయ్యి అంటూ మండిపడింది తనూజ. అక్కడితో రమ్య మోక్ష ఆగకుండా నువ్వు మనిషివి ఎదిగావు కానీ బుర్ర ఎదగలేదు.. మనుషులను పంపించడానికి వచ్చిన దేవతవి అంటూ రమ్య మోక్ష కామెంట్ చేసింది. దీంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన తనూజ.. అయితే రా వచ్చి దర్శనం చేసుకో.. వెళ్ళవమ్మా అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. మొత్తానికి అయితే తనుజా ఇచ్చిన రిప్లై కి మరో మాట మాట్లాడకుండా పచ్చళ్ళ పాప సైలెంట్ గా అక్కడినుంచి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారుతోంది.

ALSO READ:SIR Movie: ఏంటీ.. సార్ మూవీ ఫస్ట్ ఛాయిస్ ధనుష్ కాదా.. డైరెక్టర్ క్లారిటీ!

Related News

Thanuja: కన్నింగ్ కు కేర్ అఫ్ అడ్రస్, మరి ఇంతలా నటించాలా?

Bigg Boss 9 Winner: విన్నర్ ఎవరో చెప్పేసిన హైపర్ ఆది.. ఈసారి టైటిల్ ఆమెదే, టాప్ 5లో రీతూ పక్కా!

Bigg Boss 9 Promo: ఆయేషా వర్సెస్ రీతూ.. మరీ ఇంత ఆటిట్యూడ్ అయితే ఎలా?

Thanuja: సిగ్గు లేదా తనుజా.. క్యారెక్టర్ తక్కువ చేసినా కూడా మళ్లీ మాట్లాడుతున్నావ్

Bigg Boss 9: ఫ్యామిలీ మెసేజ్, టెన్షన్ పడ్డ సంజన, ఆది కామెంట్స్ కి మొహం మాడ్చిన ఆయేషా

Bigg Boss Buzz: మనకి బంధాల అవసరమా, భరణికి మరోసారి క్లాస్ పీకిన శివాజీ

Emmanuel: నమ్మించి మోసం చేసిన ఇమ్మానుయేల్, నెగెటివిటీ స్టార్ట్ అయ్యే అవకాశం

Big Stories

×