Jeevan Reddy: జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి హల్‌చల్ చేశారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై, తమ ప్రభుత్వం తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ మంత్రి లక్ష్మణ్ కుమార్ ఎదుట తన గోడు వెళ్ళబోసుకున్నారు.
పార్టీ వలసవాదులకు అడ్డాగా మారిందని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లుగా జెండా మోసిన తమకు సొంత ప్రభుత్వం అధికారంలో ఉన్నా న్యాయం జరగడం లేదన్నారు. ‘అభివృద్ధి అంటే పొట్ట నింపుకోవడమే అని మాకు తెలియదు సారూ’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
‘కౌలు రైతులం కాదు, కాంగ్రెస్‌లో పట్టాదారులం’ అంటూ పాత నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని పునరుద్ఘాటించారు. బీర్ పూర్ తో సహా నియోజకవర్గంలోని పలు ఆలయ కమిటీల్లో తన మార్క్ లేకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి చెందారు.
ALSO READ: SEBI: రూ.1,26,000 జీతంతో సెబీలో ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు, ఉద్యోగం మీదే బ్రో
మంత్రి లక్ష్మణ్ కుమార్ ను ఉద్దేశించి ‘హలాల్ కాదు సార్, మమ్మల్ని జట్కా కొట్టండి’ అంటూ పాత నాయకులను పక్కన పెట్టడంపై ఆక్రోశం వ్యక్తం చేశారు. పార్టీలో వలసవాదుల ప్రాబల్యం పెరిగిందంటూ, వారికి ‘జట్కా కొట్టి తీరుతామని’ జీవన్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు.
పదేళ్లు పార్టీ కోసం పనిచేసిన తమకు న్యాయం జరగడం లేదనేది ఆయన ఉక్రోషానికి ప్రధాన కారణం. తన సహచరులు, పార్టీ శ్రేణుల తరపున ఆయన మంత్రి ఎదుట నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితిపై మొర పెట్టుకోవడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృప్తికి అద్దం పడుతోంది.
ALSO READ: Nara Lokesh: ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం.. ఆస్ట్రేలియాలో పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటి