Konda Surekha Flexi Controversy: ధర్మ విజయ యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కు చేరుకున్నారు శృంగేరి పీఠాధిపతి విధుశేఖర మహాస్వామి. ఈ నేపథ్యంలో భక్తులు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ ఆర్చకులు వేదమంత్రాలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగినా, అక్కడ ఫ్లెక్సీ వివాదం మాత్రం సంచలనంగా మారింది.
వేములవాడ పట్టణం మొత్తం స్వామీజీ యాత్రకు స్వాగత ఫ్లెక్సీలతో కళకళలాడింది. అయితే ఈ ఫ్లెక్సీల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫోటోలు స్పష్టంగా ఉండగా, దేవదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ ఫోటో మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
సురేఖ ఫోటో లేకపోవడానికి కారణం.. ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలేనని ప్రచారం కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం మంత్రి సురేఖ తన కూతురు సంధ్య రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ కార్యకర్తల్లో అసంతృప్తిని రేపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వేములవాడలో పార్టీ కార్యకర్తలు స్వయంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఆమె ఫోటో పెట్టలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వివాదాల మధ్యన కూడా కార్యక్రమం ఆధ్యాత్మికంగా సాగింది. వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో శృంగేరి పీఠాధిపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మ రక్షణ, సంస్కృతి పరిరక్షణపై స్వామీజీ ప్రసంగించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ పాల్గొన్నారు. స్వామీజీకి పూర్ణకుంభ స్వాగతం పలికి, పట్టు వస్త్రాలు సమర్పించారు.
కాగా కొండా సురేఖ ఫోటో లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ఫోటోలు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సురేఖ పేరు లేకపోవడం వల్ల కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మళ్లీ బహిర్గతమయ్యాయి. అయితే పార్టీ వర్గాలు మాత్రం దీనిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇది స్థానిక స్థాయిలో ఏర్పాటైన ఫ్లెక్సీ వ్యవహారం మాత్రమే అని వివరణ ఇచ్చాయి.
Also Read: కానిస్టేబుల్‌ని చంపిన రియాజ్ ఖతం
ఆధ్యాత్మికంగా జరగాల్సిన శృంగేరి పీఠాధిపతి యాత్ర, ఒక రాజకీయ వివాదానికి కారణమైంది. కొండా సురేఖ ఫొటో ఫ్లెక్సీల్లో లేకపోవడం.. రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
ఫ్లెక్సీల్లో కనిపించని మంత్రి కొండ సురేఖ ఫోటో..
శృంగేరి పీఠాధిపతి విదుశేఖర మహా స్వామి ఆధ్వర్యంలో వేములవాడలో నిర్వహించిన ధర్మ విజయ యాత్ర
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కనిపించని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఫోటో
కేవలం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్,… pic.twitter.com/49yVSIEWzW
— BIG TV Breaking News (@bigtvtelugu) October 20, 2025