Xiaomi 15: మీరు అదిరిపోయే ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే షియోమీ నుంచి క్రేజీ పీచర్లు ఉన్న సరికొత్త మొబైల్స్ భారత మార్కెట్లోకి రానున్నాయి. ఈ క్రమంలోనే Xiaomi సరికొత్తగా 15 సిరీస్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ సిరీస్‌లో Xiaomi 15, Xiaomi 15 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. Xiaomi 15 Ultra ఇప్పటివరకు అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. దీనిలో శక్తివంతమైన ప్రాసెసర్, బ్యాటరీ, మంచి కెమెరా వంటి అనేక ఫీచర్లు ఉన్నాయన్నారు. ఈ ఫోన్ సాధారణ పరికరంలా ఉన్నప్పటికీ, మీరు దీనితోపాటు ఫోటోగ్రఫీ కిట్‌ను కొనుగోలు చేయడం ద్వారా DSLR లాగా పనిచేస్తుందన్నారు.
డిస్ప్లే పరంగా, Xiaomi 15 Ultra 6.72-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 3200 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ డిస్ప్లే 2670 × 1200 పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగి ఉంది LTPO AMOLED టెక్నాలజీతో వస్తుంది. ఇది కాకుండా దీనికి ఇన్ -డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సెఫ్టీ కూడా లభిస్తుంది.
కెమెరా గురించి చెప్పుకుంటే Xiaomi 15 Ultra 200MP+50MP+50MP+50MP క్వాడ్ రియర్ కెమెరాను కలిగి ఉంది. దీని మెయిన్ కెమెరా 50-మెగాపిక్సెల్ సోనీ LYT900 సెన్సార్, దీనికి OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) కూడా ఉంది. ఇది కాకుండా, దీనికి 200MP Samsung HP9 లెన్స్, 50MP టెలిఫోటో లెన్స్, 50MP పెరిస్కోప్ లెన్స్ ఉన్నాయి. వెనుక కెమెరా సెటప్ 100mm ఫోకల్ లెంన్త్, 115 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూకు సపోర్ట్ చేస్తుంది. అదే సమయంలో 32MP ఫ్రంట్ కెమెరా ద్వారా సెల్ఫీ, వీడియో కాలింగ్ కూడా చేసుకోవచ్చు.
Read Also: Samsung: క్రేజీ ఏఐ ఫీచర్లతో మార్కెట్లోకి మూడు కొత్త స్మార్ట్ ఫోన్స్..
Xiaomi 15 Ultra 5,410mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 90W వైర్డ్ ఛార్జింగ్, 80W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీంతో మీరు వైర్డు లేదా వైర్‌లెస్‌గా ఛార్జ్ చేసినా, దీన్ని చాలా త్వరగా ఛార్జ్ చేసుకోవచ్చు. బ్యాటరీ హెల్త్ కాపాడుకునేందుకు ఇది సర్జ్ G1 బ్యాటరీ మేనేజ్‌మెంట్ చిప్‌ను కూడా కలిగి ఉంది.
ఈ నేపథ్యంలో Xiaomi 15, 15 అల్ట్రా మార్చి 11న భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని ప్రకటించారు. ఇవి Amazon India, Xiaomi అధికారిక వెబ్‌సైట్, ఇతర రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి. ఈ మోడల్స్ మూడు రంగుల్లో అందుబాటులోకి రానున్నాయి. వాటిలో నలుపు, ఆకుపచ్చ, సిల్వర్ క్రోమ్ ఉన్నాయి. ఇక దీని ధర విషయానికి వస్తే 1,499.99 యూరోలు. భారత కరెన్సీ ప్రకారం ఇది దాదాపు రూ.1,36,000. ఈ ఫోన్ భారతదేశంలో ఇంకా తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది. దీని ఖచ్చితమైన ధర మార్చి 11న తెలియనుంది.
Xiaomi 15 Ultra క్వాల్కమ్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3తో వస్తుంది. ఈ ప్రాసెసర్ ఆన్ డివైస్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మల్టీ-మోడల్ AI సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది.ఇది ఫోన్‌ను మరింత స్మార్ట్‌గా పనిచేసేలా చేస్తుంది.