Mrunal Thakur : హీరోయిన్లు చూడడానికి సన్నజాజి తీగల్లా అందంగా కనిపిస్తారు. వాళ్ళను ఆదర్శంగా తీసుకుని, ఎంతోమంది అలా మారడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ హెల్త్ ఇష్యూస్ అనేవి సామాన్యుల్లాగే వాళ్లకు కూడా ఉంటాయి. కానీ చాలామంది తమకున్న హెల్త్ ఇష్యూస్ ని బయట పెట్టుకోవడానికి ఇష్టపడరు. అయితే తాజాగా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) మాత్రం షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ఆమె తన జుట్టు రాలడం సమస్య గురించి బయట పెట్టిన వీడియో అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది.
హీరోయిన్ కి హెయిర్ ఫాల్ ఇష్యూ
సీతారామం, హాయ్ నాన్న వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది మృణాల్ ఠాకూర్. చివరగా ఆమె ‘ఫ్యామిలీ స్టార్’ మూవీతో టాలీవుడ్ ఆడియన్స్ ని పలకరించింది. అయితే చూడడానికి ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఆమె హెయిర్ కు ఫిదా కావాల్సిందే. కానీ ఈ బ్యూటీ గత ఏడాది డెంగ్యూ బారిన పడిందట. ఆ తర్వాత నుంచి ఎక్కువగా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయ్యిందని చెప్పి, షాక్ ఇచ్చింది. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటే ఎమోషనల్ గా ఛాలెంజింగ్ గా అనిపిస్తుందని మృణాల్ ఆ వీడియోలో చెప్పుకొచ్చింది.
అయితే సరైన ట్రీట్మెంట్, అవసరమైన విటమిన్లు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడచ్చని వెల్లడించింది. ఈ మేరకు మృణాల్ ఠాకూర్ తన జుట్టు ఊడిపోయిందని ఆవేదనను వ్యక్తం చేస్తూ, మరోవైపు పెరుగుతున్న బేబీ హెయిర్ ని చూపించి హెయిర్ ఫాల్ నుంచి కోలుకోవడం సాధ్యమేనని తన అభిమానులకు భరోసా ఇచ్చింది. అయితే హెయిర్ విషయంలో కఠినంగా ఉండకూడదని, ముందుగా హెయిర్ ఫాల్ కి కారణం ఏంటో గుర్తించి, ఆ తర్వాత జెంటిల్ హెయిర్ కేర్ ని ఫాలో అవ్వాలని సలహా ఇచ్చింది. స్ట్రెస్ ని తగ్గించడం, నుంచి రెగ్యులర్ గా మసాజ్ వంటివి చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా జుట్టు పెరగడం తిరిగి మొదలవుతుంది అంటూ తన ఇన్స్పిరేషనల్ జర్నీని వివరించింది. తన హెయిర్ ఫాల్ సమస్య గురించి మృణాల్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మృణాల్ ఠాకూర్ పాన్ ఇండియా ఎంట్రీ
గత ఏడాది ‘ఫ్యామిలీ స్టార్’ మూవీతో హ్యాట్రిక్ హిట్ రికార్డును మిస్ చేసుకుంది మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘డెకాయిట్’ (Dacoit) అనే భారీ బడ్జెట్ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఇందులో ఆమె అడవి శేష్ తో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇంటెన్స్ క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ టాలీవుడ్ లోనే మోస్ట్ అవైటింగ్ మూవీ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా గనుక హిట్ అయితే మృణాల్ పాన్ ఇండియా హీరోయిన్ రేస్ లోకి దూసుకెళ్లడం ఖాయం.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">