E-Paper
Advertisement

షావోమీ మైండ్ బ్లోయింగ్ ఏసీ లాంచ్.. మనుషులు ఎక్కడ ఉన్నారో.. గుర్తించి మరీ కూలింగ్!

షావోమీ మైండ్ బ్లోయింగ్ ఏసీ లాంచ్.. మనుషులు ఎక్కడ ఉన్నారో.. గుర్తించి మరీ కూలింగ్!

Xiaomi Smart AC: ప్రముఖ చైనీస్ టెక్ బ్రాండ్ షావోమీ.. సమ్మర్ లో ఏసీలకు ఉండే డిమాండ్ ను పక్కాగా అందిపుచ్చుకుంటోంది. గత కొద్దిరోజులగా వివిధ రకాల మోడళ్లతో అడ్వాన్స్డ్ ఫీచర్లు కలిగిన ఏసీలను లాంచ్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే షావోమీ (Xiaomi) తన ‘మిజియా’ (Mijia) బ్రాండ్ కింద ప్రెజెన్స్ సెన్సార్‌తో కూడిన సరికొత్త స్మార్ట్ ఎయిర్ కండిషనర్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. మిజియా సెంట్రల్ ఎయిర్ కండీషనర్ డక్ట్ టైప్ యూనిట్ (Mijia Central Air Conditioning Duct-type Unit -4 HP), మిజియా ఎయిర్ కండీషనర్ హ్యూమన్ సెన్సింగ్ విండ్ 1.5 హెచ్‌పీ (Mijia Air Conditioner Human-Sensing Wind 1.5HP) వేరింయట్లలో కొత్త ఏసీలను లాంచ్ చేసింది. ఈ సరికొత్త ఏసీల్లోని ప్రధాన ఫీచర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

హ్యూమన్ ప్రెజెన్స్ సెన్సార్

షావోమీ తన లేటెస్ట్ ఏసీల్లో సరికొత్త రాడార్ సెన్సార్లను అమర్చింది. ఇవి గదిలో మనుషులు ఎక్కడ ఉన్నారో నిరంతరం గుర్తిస్తూ ఉంటాయి. తద్వారా చల్లటి గాలి నేరుగా మనుషులపై పడకుండా (Airflow Avoidance) చూసుకుంటాయి. లేదంటే చల్లటి గాలి కేవలం వ్యక్తులపై మాత్రమే పడాలి అనుకుంటే.. తమ వైపునకు వచ్చేలా కూడా (Direct Cooling) సెట్టింగ్స్ మార్చుకోవచ్చు.

భారీగా విద్యుత్ ఆదా..

సాధారణంగా చాలా మంది ఏసీ ఆఫ్ చేయకుండానే గదిలో నుంచి బయటకు వెళ్లిపోతుంటారు. దాని వల్ల చల్లదనం అంతా వృథా అయి.. విద్యుత్ బిల్లు ఎక్కువగా వచ్చే అవకాశముంది. కానీ షావోమీ తన కొత్త ఏసీ మోడల్స్ ఈ సమస్యకు చెక్ పెట్టింది. గదిలో ఎవరూ లేరని రాడార్ సెన్సార్ గుర్తిస్తే.. ఏసీ ఆటోమేటిక్‌గా పవర్ సేవింగ్ మోడ్‌లోకి మారిపోతుంది. లేందంటే దానంతట అదే ఆఫ్ అయిపోతుంది. తద్వారా విద్యుత్ బిల్లును చాలా వరకూ ఈ ఏసీ ఆదా చేస్తుంది.

మెరుపులాంటి కూలింగ్..

ఈ ఏసీలో పవర్ ఫుల్ కూలింగ్ వ్యవస్థ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కేవలం 1-3 నిమిషాల్లోనే గదిని అత్యంత వేగంగా ఈ సరికొత్త షావోమీ ఏసీ చల్లబరుస్తుందని కంపెనీ వర్గాలు ప్రకటించాయి. అంతేకాకుండా చల్లి, వర్షాకాలాల్లో గదిని వేగంగా వేడి చేసే హీటింగ్ టెక్నాలజీ సైతం ఇందులో అమర్చినట్లు పేర్కొన్నాయి. మరోవైపు ఇది అతి తక్కువ శబ్దం (16 dB)తో పనిచేయడం వల్ల.. రాత్రివేళ్లలో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రశాంతంగా నిద్రపోవచ్చు.

స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు..

ఈ సరికొత్త మిజియా ఏసీలు.. షావోమీ HyperOS Connect తో అనుసంధానించబడి ఉంటాయి. కాబట్టి యూజర్లు ‘Mi Home’ యాప్ ద్వారా, వాయిస్ కమాండ్స్ (Xiao AI) ద్వారా దీనిని కంట్రోల్ చేయవచ్చు. గదిలో ఏ మూల నుంచైనా వీటిని ఏసీని యాక్సెస్ చేస్తూ.. తమకు నచ్చిన కూలింగ్ ను రిమోట్ సాయంలో పెట్టుకోవచ్చు.

Also Read: Table Fans 2026: వేసవిలో కూల్‌గా ఉంచే.. అత్యుత్తమ టేబుల్ ఫ్యాన్లు.. సుడిగాలి ఫీలింగ్ పక్కా!

ధర ఎంతంటే?

షావోమీ తన కొత్త ఏసీలను ప్రస్తుతానికి చైనా మార్కెట్ లో మాత్రమే విడుదల చేసింది. చైనాలో దీని ధరను 8,999 యువాన్లు (సెంట్రల్ ఏసీ)గా నిర్ణయించింది. అంటే భారత కరెన్సీలో దీని విలువ దాదాపు రూ. 1,05,000కి సమానం. 1.5HP వేరియంట్ ప్రారంభ ధరను 2,399 యువాన్లుగా షావోమీ పేర్కొంది. ఇది భారత కరెన్సీలో రూ. 28,000 కావడం గమనార్హం. పెద్ద హాళ్లు, కార్యాలాయలకు ఈ షావోమీ సెంట్రల్ ఏసీ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుందని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన నిహారిక రాకాస.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే?

Related News

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను హ్యాకర్లు ఎలా దొంగిలిస్తున్నారో తెలుసా?

ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్.. రూపాయి ఖర్చు లేకుండా ‘నెట్‌ఫ్లిక్స్’ ఉచితం!

50MP కెమెరా, 6,500mAh బ్యాటరీతో Motorola Edge 70 Pro+ లాంచ్.. ధర వింటే షాకే!

డిజైన్ అదిరింది.. 5x పెరిస్కోప్ కెమెరాతో Xiaomi 17T లాంచ్, సేల్స్ ఎప్పటి నుంచంటే?

Physical SIM vs eSIM: ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏ సిమ్ బెస్ట్? ఏది వాడితే ఎక్కువ లాభం?

గంటల తరబడి హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటున్నారా? ఈ 60/60 రూల్ తెలియకపోతే డేంజర్లో పడ్డట్టే!

అమెజాన్ బంపరాఫర్.. మోటో ఎడ్జ్ 50పై రూ.5 వేలకు పైగా తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలు ఇవే!

సరికొత్త లుమియో టీవీ.. డాల్బీ అట్మోస్, 4K డిస్‌ప్లే.. ఇక ఇంట్లోనే థియేటర్!

Big Stories

×