E-Paper
Advertisement

Virat Kohli : విరాట్ కోహ్లీకి న‌డుము నొప్పులు..ఇలా అయితే 2027 వ‌న్డే క‌ప్ ఆడ‌టం క‌ష్ట‌మే ?

Virat Kohli :  విరాట్ కోహ్లీకి న‌డుము నొప్పులు..ఇలా అయితే 2027 వ‌న్డే క‌ప్ ఆడ‌టం క‌ష్ట‌మే ?
Advertisement

Virat Kohli : టీమిండియా క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ గురించి దాదాపు అంద‌రికీ తెలిసిందే. ముఖ్యంగా టీమిండియా వ‌న్డే క్రికెట్ లో ప్ర‌స్తుతం కీల‌క ఆట‌గాడిగా కొన‌సాగుతున్నాడు. ఇప్ప‌టికే టెస్ట్ క్రికెట్, టీ-20 ఫార్మాట్ క్రికెట్ గుడ్ బై చెప్పాడు. ప్ర‌స్తుతం వ‌న్డే క్రికెట్ లో మాత్ర‌మే కొన‌సాగుతున్నాడు. నిన్న సౌతాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. ర‌న్ మెషిన్ విరాట్ కోహ్లీ మ‌రోసారి త‌న బ్యాటింగ్ ప‌వ‌ర్ ఏంటో సౌతాఫ్రికా బౌల‌ర్ల‌కు చూపించాడు. రాంచీ వేదిక‌గా జ‌రిగిన తొలి వ‌న్డే మ్యాచ్ లో సెంచ‌రీ చేశాడు. మైదానం న‌లువైపులా క్లాస్ షాట్ల‌తో అల‌రించాడు కోహ్లీ. 120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్ ల‌తో మొత్తం 135 ప‌రుగులు చేశాడు. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం విరాట్ కోహ్లీ గురించి సోష‌ల్ మీడియాలో ఓ వార్త వైర‌ల్ అవుతోంది.

Also Read : Palaash Muchhal: స్మృతితో పెళ్లి క్యాన్సిల్..తొలిసారి షాకింగ్ లుక్స్ లో క‌నిపించిన‌ ప‌లాష్ ముచ్చ‌ల్‌

విరాట్ కోహ్లీకి న‌డుము నొప్పి..!

Advertisement

అయితే సౌతాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ త‌న వ్య‌క్తిగ‌త స్కోర్ 93 ప‌రుగులు చేసిన స‌మ‌యంలో అప్పుడు అత‌నికి న‌డుము నొప్పి వ‌చ్చింది. ఫిజిషియ‌న్ వ‌చ్చి ప‌రీక్షించాడు. అయితే ఈ న‌డుము నొప్పి పై సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడే ఇత‌నికి న‌డుము నొప్పి వ‌స్తే.. 2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌టం క‌ష్ట‌మే అంటూ రూమ‌ర్స్ కూడా సృష్టిస్తున్నారు. కానీ కోహ్లీ మాత్రం కీల‌క ఇన్నింగ్స్ ఆడి టీమిండియా విజ‌యానికి బాట‌లు వేశాడు. ముఖ్యంగా వ‌య‌స్సు అనేది సంఖ్య‌నే కానీ.. ఆట‌కు అడ్డు కాద‌ని విరాట్ కోహ్లీ- రోహిత్ శ‌ర్మ జోడీ మ‌రోసారి నిరూపించింది. మొన్న‌టి ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో ఫామ్ క‌న‌బ‌రిచిన ఈ జంట‌.. సౌతాఫ్రికాతో తొలి వ‌న్డేలో కూడా అదే జోరుతో అదుర‌గొట్టాడు. మొత్తానికి రో-కో ద్వ‌యం ఫ్యాన్స్ ని ఉర్రూత‌లూగించిన పోరులో భార‌త్ గెలుపొందింది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో 1-0తో ముందంజ‌లో నిలిచింది. దక్షిణాఫ్రికాతో రెండు టెస్ట్‌ల్లో వైట్‌వాష్‌ అయిన భారత్‌ వన్డే సిరీస్ లో పుంజుకుంది. రోహిత్‌, కోహ్లీ జోడీ ధనాధన్‌ బ్యాటింగ్‌తో విజృంభించిన వేళ 17 పరుగుల తేడాతో సఫారీలను ఓడించింది.

వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌ర‌కు కోహ్లీ కొన‌సాగుతాడా..?

విరాట్ కోహ్లీ ప్ర‌స్తుతం అద్భుత‌మైన ఫామ్ కొన‌సాగిస్తున్నాడు. ఇదే ఫామ్ అలాగే కొన‌సాగితే వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌ర‌కు టీమిండియా కి తిరుగుండ‌దు అని.. అలాగే టీమిండియా మ‌రోసారి వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుచుకుంటుంద‌ని అభిమానులు కోరుతున్నారు. చివ‌రిసారిగా వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓట‌మి పాలైన విష‌యం తెలిసిందే. మ‌రోసారి ఎలాగైనా టీమిండియా క‌ప్ సాధించాల‌ని.. ఇటు విరాట్ కోహ్లీ, అటు రోహిత్ శ‌ర్మ భావిస్తున్నారు. వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ సాధించాల‌నే ల‌క్ష్యంతో వీరిద్ద‌రూ కేవ‌లం వ‌న్డే క్రికెట్ కి మాత్ర‌మే ప‌రిమితం అయ్యారు. కానీ విరాట్ కోహ్లీ న‌డుము నొప్పి వార్త ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది. అప్ప‌టి వ‌ర‌కు విరాట్ కోహ్లీ వ‌న్డే క్రికెట్ ఆడుతాడా..? లేక వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కి ముందే రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తాడా..? అనే అనుమానాలు వ్య‌క్తం కావ‌డం విశేషం.

Advertisement

Also Read : KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో 99% సక్సెస్ రేటు.. గిల్ దండగే, తొల‌గించాల‌ని డిమాండ్స్ !

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×