MS Dhoni: టీమిడియాస్ స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ పై ( MOHAMMAD SIRAJ ) మహేంద్ర సింగ్ ధోని ( MS Dhoni ) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒకసారి టీమిండియా జట్టులో విఫలమైతే అత్యంత దారుణంగా నిన్ను ట్రీట్ చేస్తారని మహమ్మద్ సిరాజుకు గతంలో మహేంద్ర సింగ్ ధోని వార్నింగ్ ఇచ్చాడట. జట్టులో విఫలం అయితే నీ తండ్రి లాగా హైదరాబాద్ వెళ్లి, ఆటో నడుపుకో అని కూడా కామెంట్స్ చేస్తారని ధోని చేసిన వ్యాఖ్యలను తాజాగా మహమ్మద్ సిరాజు గుర్తు చేశారు. టీమిండియాలో స్థానం దక్కడం అంటే గొప్ప అవకాశం అని, అలాంటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడాలని ధోని సూచించినట్లు సిరాజ్ తాజాగా వెల్లడించారు. దీంతో సిరాజ్ పై ధోని చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
ఆస్ట్రేలియా తో జరిగే టీమిండియా సిరీస్ కు సెలెక్ట్ అయిన మహమ్మద్ సిరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్ లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారని చెప్పారు. అయితే తన కెరీర్ టీమ్ ఇండియాలో ప్రారంభమైనప్పుడు మహేంద్రసింగ్ ధోని ఇచ్చిన సలహాలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని కూడా క్లారిటీ ఇచ్చారు మహమ్మద్ సిరాజ్. ఇతరులు చెప్పేది అస్సలు పట్టించుకోకూడదు అని, కేవలం ఆటపైన దృష్టి పెట్టాలని ధోని సూచించాడట. జట్టులో బాగా రాణిస్తేనే ప్రపంచం మిమ్మల్ని పొగుడుతుందని తెలిపాడట. అదే సమయంలో మీరు సరిగ్గా ఆట తీరును కనబరచకపోతే, పొగిడిన వాళ్లే రాళ్లు వేస్తారని వార్నింగ్ ఇచ్చాడట మహేందర్ సింగ్ ధోని. ట్రోలింగ్ కూడా చేస్తారని, ఇంటికి వెళ్లి ఆటో నడుపుకో అని కూడా పోస్టులు పెడతారని చురకలం అంటించాడట. అలా మహేంద్రసింగ్ ధోని చెప్పిన మాటలను తరచు గుర్తు చేసుకుంటూ తన ఆట తీరును మెరుగుపరుచుకున్నట్లు తాజాగా సిరాజ్ వెల్లడించారు.
MOHAMMAD SIRAJ ON MS DHONI & HIS VALUABLE ADVICE:
– "I remember when I joined the India team, MS Dhoni had told me 'Don’t pay attention to what others say, When you are performing well, the entire world will be with you, and when you aren’t, they will abuse you', the trolling… pic.twitter.com/7YK7xVMMsu
— Tanuj (@ImTanujSingh) October 6, 2025