Akash – Shreyas Iyer: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో సోమవారం రోజున కీలక మ్యాచ్ జరిగింది. ప్లే ఆఫ్ దశలో రెండో స్థానం కోసం ముంబై ఇండియన్స్… మొదటి స్థానం కోసం పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా వ్యవహరించిన పంజాబ్ కింగ్స్ అద్భుతంగా రానించి విజయం సాధించింది. ఈ విజయంతో 19. సాధించిన పంజాబ్ కింగ్స్… పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే పంజాబ్ కింగ్స్ సరికొత్త రికార్డు సృష్టించింది.
Also Read : Kohli – Anushka Sharma : కోహ్లీకి అవమానం.. అనుష్క శర్మ ప్రైవేట్ పార్ట్స్ పై ట్రోలింగ్ !
పంజాబ్ కింగ్స్ పై అంబానీ కొడుకు ఆకాష్ కుట్రలు
ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ కుట్రలు చేసే ప్రయత్నం చేశాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తో…. మ్యాచ్ ఫిక్స్ చేసే ప్రయత్నం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నిన్నటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే భారీ స్కోర్ చేస్తుందనుకుంటే.. తక్కువ స్కోరే నమోదు చేసింది ముంబై ఇండియన్స్. అయితే ఆ సమయంలో ముంబై ఇండియన్స్ 17 ఓవర్లు ఆడి 153 పరుగులు చేసిన సమయంలో…. శ్రేయస్ అయ్యర్ తో ముఖేష్ అంబానీ కొడుకు ఆకాష్ అంబానీ చర్చలు చేశారు.
బౌండరీ గేటు దగ్గర శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో… అక్కడే కూర్చున్న ఆకాష్ అంబానీ.. అతనితో మాట్లాడే ప్రయత్నం చేశాడు. దాదాపు రెండు నిమిషాల పాటు వీరిద్దరూ మాట్లాడుకుంటున్నట్లు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. స్టేడియంలోనే ఇలా ముకేశ్ అంబానీ కొడుకు ఆకాష్ అంబానీ చేయడం ఇప్పుడు వివాదంగా మారింది. ఈ ఫోటోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది.
అంబానీ ఫ్యామిలీ పై ట్రోలింగ్
మ్యాచ్ గెలిచేందుకు ముంబై ఇండియన్స్ ఓనర్ ముఖేష్ అంబానీ కుటుంబం దేనికైనా తెగిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. మొన్నటి వరకు అంపైర్ లను కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్… ఇక ఇప్పుడు ప్లేయర్లనే కొనుగోలు చేసేందుకు ఫోటోలు చేసిందని ఫైర్ అవుతున్నారు అభిమానులు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తో డీలింగ్ చేసేందుకు… ముఖేష్ అంబానీ కొడుకు ఆకాష్ అంబానీ కుట్రలు చేయడం… దారుణం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ముంబై ఇండియన్స్ జట్టు పైన బ్యాన్ విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏడు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం
మ్యాచ్ మధ్యలో ఆకాష్ అంబానీ.. కుట్రలు చేసినప్పటికీ… శ్రేయస్ అయ్యర్ మాత్రం తగ్గలేదు. మ్యాచ్ ను గెలిపించాడు. ఈ దెబ్బకు ముంబై ఇండియన్స్ జట్టును ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేశాడు. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 184 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని 18.3 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ చేదించింది.
ALSO READ: Karun Nair : కరుణ్ నాయర్ గొప్ప మనసు… అంపైర్ కంటే ముందే సిక్స్ ఇచ్చాడు
It seems Shreyas Iyer wasn't convinced with the deal Ambani offered…! pic.twitter.com/4JW2OA9pBZ
— Dinda Academy (@academy_dinda) May 26, 2025