BigTV English

Karun Nair : కరుణ్ నాయర్ గొప్ప మనసు… అంపైర్ కంటే ముందే సిక్స్ ఇచ్చాడు

Karun Nair : కరుణ్ నాయర్ గొప్ప మనసు… అంపైర్ కంటే ముందే సిక్స్ ఇచ్చాడు

Karun Nair :  ఐపీఎల్ 2025వ  సీజన్ లో ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు ప్లే ఆప్స్ కి చేరుకున్నాయి. అయితే మిగతా జట్లు ప్లే ఆప్స్ కి చేరుకోనప్పటికీ.. ప్లే ఆప్స్ కి చేరుకున్న జట్ల స్థానాలను నిర్దేశిస్తున్నాయి. మొన్న గుజరాత్ టైటాన్స్ ని లక్నో సూపర్ జెయింట్స్ ఓడిస్తే.. నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓడించింది. ఇవాళ పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు 8 వికెట్లు కోల్పోయి నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగులు చేసింది.


Also Read :  Gill – Harmanpreet : సారాకు హ్యాండ్… ఆ మహిళ క్రికెటర్ తో.. గిల్!

అయితే ఇక్కడ ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకోవడం విశేషం. పంజాబ్ కింగ్స్ (pbks) బ్యాట్స్ మెన్ శ్రేయస్ అయ్యర్ సిక్స్ బాదాడు. అయితే సిక్స్ లైన్ వద్ద ఉన్న కరణ్ నాయర్ ఆ బంతిని గాలిలో క్యాచ్ అందుకున్నాడు. కానీ క్యాచ్ పట్టిన బంతి చేతిలోంచి జారింది. దీంతో అతను బ్యాలెన్స్ ఆపలేక సిక్స్ లైన్ అవతలకి వెళ్లాడు. ఈ బంతిని సిక్స్ అని సింబల్ చూపించాడు కరుణ్ నాయర్. కానీ వాస్తవానికి ఆ బాల్ సిక్స్ కాదు. రిప్లై లో సిక్స్ కాదని తేలింది. అది సిక్స్ కాకపోయినా అతను లైన్ అవతలికి పోవడంతో సిక్స్ అనుకొని సిక్స్ అని చెప్పాడు కరుణ్. దీంతో అతని పై ప్రశంసల వర్సం కురిపిస్తున్నారు. మరికొందరూ మాత్రం కొంచెం నెగిటివ్ కామెంట్స్ చేయడం విశేషం.


Also Read :  Mukesh Ambani: అంబానీ క్షుద్ర పూజలు.. మరోసారి ఛాంపియన్ గా ముంబై

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఆటగాళ్లు.. ప్రభ్ సిమ్రాన్ 28, ప్రియాంశ్ ఆర్య 06, ఇంగ్లీషు 32, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 53చ వధేరా 16, శశాంక్ సింగ్ 11, స్టోయినీస్ 44, అజ్మతుల్లా 01, హర్ప్రీత్ బ్రార్ 07 పరుగులు చేయడంతో పంజాబ్ కింగ్స్ జట్టు 206 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ముస్తఫిజర్ 3, విప్రజ్ నిగమ్ 2, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, ముఖేష్ కుమార్ 1 వికెట్ తీశారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. ఓపెనర్లు కే.ఎల్ రాహుల్ 35, డూప్లిసిస్ 33 పరుగులు చేశారు. కరుణ్ నాయర్ 44 పరుగులు, సిదిక్వుల్లా అటల్ 22 పరుగులు చేశారు. స్టబ్స్ 18, రిజ్వి 58 పరుగులు చేశారు.   ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించి.. పంజాబ్ కి షాక్ ఇచ్చింది. 6 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది.  అనుకున్నట్టుగానే ప్లే ఆప్స్ కి చేరని జట్లు చేరిన జట్లకి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాయి. మొన్న లక్నో.. నిన్న హైదరాబాద్.. నేడు ఢిల్లీ జట్లు ప్లే ఆప్స్ కి చేరిన జట్లను ఓడించడం విశేషం.

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×