E-Paper
Advertisement

Witness Cold Wave: రాష్ట్రంలో భీకరమైన చలిగాలులు.. ఈ సమయంలో అసలు బయటకు వెళ్లొద్దు.. జాగ్రత్త!

Witness Cold Wave: రాష్ట్రంలో భీకరమైన చలిగాలులు.. ఈ సమయంలో అసలు బయటకు వెళ్లొద్దు.. జాగ్రత్త!
Advertisement

Witness Cold Wave: తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం చలి తీవ్రత భారీగా పెరిగింది. అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. దీంతో ప్రజలు తీవ్రంగా వణికిపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా వాతావరణ శాఖ అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల నుంచి 9 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ చలిగాలుల ప్రభావం ముఖ్యంగా డిసెంబర్ 10 నుండి 13వ తేదీ మధ్య గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని ప్రభావంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు తీవ్రమైన చలి గాలులు వీచే అవకాశం ఉంది.

ఈ సీజన్‌లో రాష్ట్రంలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో ఈ రోజు కూడా ఇంటెన్స్ కోల్డ్‌వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. నిన్న నమోదైన అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు గమనిస్తే.. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు 6.6 డిగ్రీలుగా నమోదు అయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లాలో చలికి గజగజ వణికిపోతున్నారు.

Advertisement

సంగారెడ్డి: 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత

ఆదిలాబాద్: 6.7 డిగ్రీల ఉష్ణోగ్రత

Advertisement

వికారాబాద్: 7.5 డిగ్రీల ఉష్ణోగ్రత

రంగారెడ్డి: 7.6 డిగ్రీల ఉష్ణోగ్రత

కామారెడ్డి: 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత

మెదక్: 8.1 డిగ్రీల ఉష్ణోగ్రత

సిద్దిపేట: 8.4 డిగ్రీల ఉష్ణోగ్రత

నిర్మల్: 8.4 డిగ్రీల ఉష్ణోగ్రత

మహబూబ్ నగర్: 8.6 డిగ్రీలు

ఈ గణాంకాలు రాష్ట్రంలో చలి తీవ్రత ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తున్నాయి. ఇటు రాజధాని నగరం హైదరాబాద్‌లో కూడా చలి తీవ్రత పెరిగింది. నగరంలో డిసెంబర్ 16వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు 9 డిగ్రీల నుంచి 12 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. నగర వాసులు ఉదయం పూట, సాయంత్రం వేళల్లో చలిని తట్టుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే, పగటి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణంగా.. ఎండతో కూడిన వాతావరణం ఉండే అవకాశం ఉంది.

తీవ్రమైన చలిగాలుల నేపథ్యంలో.. వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో బయట తిరగడాన్ని తగ్గించుకోవాలని, చలి నుంచి రక్షణ కోసం వెచ్చని దుస్తులు ధరించాలని వారు కోరుతున్నారు. ఈ చలిగాలుల పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు.

ALSO READ: Adithya Parasri Swamy: ఈ మూడు పనులు చేస్తున్నప్పుడు బల్లి పలికితే అపశకునం జరుగుతుంది!

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×