E-Paper
Advertisement

Andre Russell: SRHలోకి మ‌రో రాక్ష‌సుడు..ఇక 300 కాదురా, 400 లోడింగ్ ?

Andre Russell: SRHలోకి మ‌రో రాక్ష‌సుడు..ఇక 300 కాదురా, 400 లోడింగ్ ?
Advertisement

Andre Russell:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) నేపథ్యంలో ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన సంగతి అందరికీ తెలిసిందే. నవంబర్ 15వ తేదీన రెండు రోజుల కిందట రిటెన్షన్ లిస్టును అలాగే రిలీజ్ లిస్టును 10 జట్లు కూడా ప్రకటించడం జరిగింది. ఇందులో కీలక ప్లేయర్లను అంటిపెట్టుకొని ఉన్న జట్లు, అదే సమయంలో కొంతమంది డేంజర్ ప్లేయర్లను వదిలేశారు. ఈ లిస్టులో కేకేఆర్ డేంజర్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ ( Andre Russell ) కూడా ఉన్నాడు. దాదాపు 11 సంవత్సరాల పాటు కేకేఆర్ కు సేవలు అందించిన ఆండ్రీ రస్సెల్ ఇప్పుడు మినీ వేలంలోకి దిగబోతున్నాడు.

Also Read: WTC : మరుగుజ్జు అన్నారు..WTC పాయింట్ల పట్టికలో మనోళ్లను మట్టి కరిపించాడు.. నాలుగో స్థానానికి దిగజారిన టీమిండియా

SRH లోకి ఆండ్రీ రస్సెల్ ( Andre Russell )

Advertisement

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో డిసెంబర్ 16వ తేదీన మినీ వేలం జరగనుంది. ముంబైలో కాకుండా అబుదాబి వేదికగా ఈ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. మొత్తం 77 స్లాట్ ల కోసం ఈ మినీ వేలాన్ని నిర్వహిస్తున్నారు. 77 స్లాట్ ల కోసం వందల సంఖ్యలో ప్లేయర్లు పాల్గొంటారని సమాచారం. అదే సమయంలో మొన్న రిలీజ్ అయిన ప్లేయర్లు కూడా బరిలో ఉండే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో కేకేఆర్ డేంజర్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ ను ఎవరు కొనుగోలు చేస్తారనే టెన్షన్ అందరిలోనూ ఉంది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు (Sunrisers Hyderabad team ) కన్ను పడిందట.

ఎలాగైనా అతని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారట కావ్య పాప. ఆండ్రీ రస్సెల్ లాంటి ప్లేయర్ జట్టులోకి వస్తే, ఆల్రౌండర్ గా బాగా పనికి వస్తాడు. ఆడం జంపాను వదిలేసారు కాబట్టి , విదేశీ ప్లేయర్ కింద ఆండ్రీ రస్సెల్ ను కొనుగోలు చేసే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంటును ఆండ్రీ రస్సెల్ ఫాలో అయినట్లు తెలుస్తోంది. దీంతో వీళ్ళ ఇద్దరి మధ్య డీలింగ్ కుదిరినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీంతో తెలుగు అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. రాక్ష‌సుడు లాంటి ఆండ్రీ రస్సెల్ హైద‌రాబాద్ లోకి వ‌స్తే, ఇక చుక్క‌లే అంటున్నారు.

సన్రైజర్స్ హైదరాబాద్ రిటైన్‌ లిస్ట్ ఇదే

Advertisement

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం చాలా తెలివిగా ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే కీలక ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. ట్రావిస్‌ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, సమరన్‌, ఇశాన్ కిషన్, క్లాసెన్‌, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష దుబే, ప్యాట్ కమిన్స్ లాంటి ప్లేయర్లను మరోసారి జట్టులోకి తీసుకుంది. మహమ్మద్ షమీని ట్రేడ్ ప్రక్రియ ద్వారా లక్నో పంపించింది. ఇక ఇప్పుడు హైద‌రాబాద్ ప‌ర్స్ వ్యాల్యూ రూ.20 లక్ష‌లు మాత్ర‌మే ఉంది.

Also Read: WTC : మరుగుజ్జు అన్నారు..WTC పాయింట్ల పట్టికలో మనోళ్లను మట్టి కరిపించాడు.. నాలుగో స్థానానికి దిగజారిన టీమిండియా

 

 

 

 

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×