E-Paper
Advertisement

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి
Advertisement

Ravi Shastri pick indian ODI Wc 2027 Squad:  2027 వన్డే వరల్డ్ కప్ కోసం (ODI Wc 2027 Squad ) ఇప్పటి నుంచి అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. అటు ఇప్పటికే 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ కు సంబంధించిన కొత్త ఫార్మాట్ కూడా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసింది. దీని ప్రకారం బలమైన జట్ల మధ్య ఎక్కువ మ్యాచ్ లు జరగనున్నాయి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య కూడా మొత్తం మూడు మ్యాచ్లు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ చాలా ఉత్కంఠ భరితంగా సాగనుందన్నమాట. ఈ క్రమంలో 2027 వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియాకు చెందిన‌ 15 మంది స‌భ్యుల‌ను ప్రకటించారు మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి. తానే కోచ్ గా ఉంటే… బలమైన జట్టును తయారు చేస్తానని.. మొత్తం 15 మంది ప్లేయర్లను ప్రకటించాడు.

Also Read: Ms Dhoni Ruling Team India: ధోని లేక సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

న‌లుగురు తోపు బౌల‌ర్ల‌కు ఛాన్స్‌

Advertisement

2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో తన డ్రీమ్ టీమిండియా జట్టును రవి శాస్త్రి ప్రకటించడం జరిగింది. ఆయన ప్రకటించిన జట్టులో నలుగురు డేంజర్ బౌలర్లు ఉన్నారు. మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా లాంటి భయంకరమైన నలుగురు బౌలర్లు ఈ జట్టులో ఉండడం గమనార్హం. ఈ నలుగురు బరిలోకి దిగితే మాత్రం టీమిండియాను తట్టుకోవడం కష్టమే. దక్షిణాఫ్రికా గడ్డపైన ఈ నలుగురు బౌలర్లు అత్యంత ప్రమాదకరంగా బౌలింగ్ చేసే ఛాన్సులు ఉంటాయి. బౌన్సర్లు వేయడంలో వీళ్లు దిట్ట. ఇలాంటి క్రమంలో నలుగురు పేర్లను రవి శాస్త్రి ఫైనల్ చేశాడు.. అయితే ఇందులో ముగ్గురిని గౌతమ్ గంభీర్ ఇప్పటికే పక్కకు పెట్టాడు. బుమ్రాను మాత్రమే గంభీర్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, గురునూర్ లాంటి బచ్చా క్రికెటర్లకు అవకాశం ఇచ్చేలా గంభీర్ ప్లాన్స్ కనిపిస్తున్నాయి.

రో-కోకు అవకాశం ఇచ్చిన రవి శాస్త్రి

వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ ( ODI World Cup 2027 ) నేపథ్యంలో రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ అవసరం టీమిండియాకు చాలా ఉందని రవిశాస్త్రి వెల్లడించారు. ఆ ఇద్దరి అనుభవం టీమిండియాకు వరల్డ్ కప్ లో ఉపయోగపడుతుందని తెలిపారు. అదే సమయంలో యశస్వి జైష్వాల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ లాంటి కీలక బ్యాటర్లకు కూడా అవకాశం ఇచ్చారు. ఇక ఆల్రౌండర్ల కింద హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలను పరిగణలోకి తీసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ ఒక్కడే స్పిన్నర్ గా ఉన్నాడు. అంటే కుల్దీప్ యాదవ్ తో పాటు అక్షర్ పటేల్ లేదా రవీంద్ర జ‌డేజా స్పిన్ విభాగంలో మెరువ‌నున్నారు.

Advertisement

Also Read: Hasan Ali in a pickpocketing case: పిక్ పాకెట్ కేసులో హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

 

Related News

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

Big Stories

Advertisement
×