BigTV English

Ashwin : ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌.. టాప్ లో అశ్విన్‌..

Ashwin : ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌.. టాప్ లో అశ్విన్‌..


Ashwin : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అశ్విన్‌ సత్తాచాటాడు. ప్రపంచ నంబర్‌వన్‌ బౌలర్‌ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో అశ్విన్ కు భారత్ తుది జట్టులో చోటు దక్కలేదు. ఆ మ్యాచ్ లో ఆడనప్పటికీ ఈ మేటి స్పిన్నర్ తన టాప్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు.

టెస్టు బౌలర్ల జాబితాలో కమిన్స్‌, రబాడ రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు. జడేజా తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు. పేసర్ బుమ్రా రెండు ర్యాంకులు కోల్పోయాడు. ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. బుమ్రా చివరగా 2022 జులైలో టెస్టు మ్యాచ్‌ ఆడాడు. గాయం కారణంగా ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు.


బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో తొలి 3 స్థానాల్లో ఆస్ట్రేలియా బ్యాటర్లే ఉన్నారు. మార్నస్ లబుషేన్‌ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో స్టివ్ స్మిత్‌, ట్రావిస్ హెడ్‌ ఉన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో అద్భుతంగా ఆడిన రహానె 37వ స్థానానికి చేరుకున్నాడు. భారత్ ఆడిన గత 5 టెస్టుల్లోనూ లేకపోయినా రిషబ్‌ పంత్‌ భారత్‌ తరఫున అత్యుత్తమ ర్యాంకు బ్యాటర్‌గా నిలిచాడు. పంత్ పదో ర్యాంకులో ఉన్నాడు. కెప్టెన్ రోహిత్‌ శర్మ 12వ స్థానం, విరాట్ కోహ్లి 13వ స్థానంలో ఉన్నారు. రవీంద్ర జడేజా కు నంబర్‌వన్‌ ఆల్‌రౌండర్‌ స్థానం దక్కింది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×