BigTV English

Aus ex cricketer Joe Burns focus T20 WC: ఆసీస్ మాజీ ఆటగాడు జోబర్న్స్, నా టాలెంట్ చూపిస్తా..

Aus ex cricketer Joe Burns focus T20 WC: ఆసీస్ మాజీ ఆటగాడు జోబర్న్స్, నా టాలెంట్ చూపిస్తా..

Australia ex cricketer Joe Burns focus T20 WC: ఆసీస్ మాజీ ఆటగాడు జో బర్న్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియాను వీడాడు ఈ ఆటగాడు. ఇటలీ క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలని నిర్ణయం తీసుకోవడం, ప్రకటించడం జరిగింది. మరో రెండేళ్లలో టీ20 ప్రపంచకప్ జరగనుంది. అప్పటికి ఇటలీ జట్టు అర్హత సాధించేలా చేయడమే టార్గెట్‌గా పెట్టుకున్నాడు.


ఇటలీ ఇప్పటివరకు ఏ ఫార్మాట్‌లోనూ ప్రపంచకప్‌కు అర్హత సాధించలేదు. జూన్ 9 జరగనున్న వరల్డ్ కప్ రీజియన్ క్వాలిప్లయర్స్‌లో ఆ జట్టు తన అదృష్టాన్ని పరీక్షంచుకోనుంది. ఇందులో ఇటలీ, ఫ్రాన్స్, ఇసిల్ ఆఫ్ మ్యాన్, లక్సంబర్గ్, టర్కీ జట్లు పోటీ పడుతున్నాయి.

బర్న్స్ ఇటలీ పౌరసత్వం కలగడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఆయన తల్లికి అక్కడి పౌరసత్వం ఉండడంతో ఆ దేశానికి ప్రాతినిథ్యం వహించేందుకు అర్హత సాధించాడు. ఈ ఏడాది జో బర్న్స్ సోదరుడు డొమ్నిక్ చనిపోయాడు. సోదరుడు గౌరవార్థం తన జెర్సీపై 85 నెంబరు ధరించనున్నాడు. డొమ్నిక్ తన చివరి మ్యాచ్‌లో అదే నెంబర్ గల జెర్సీని ధరించినట్టు వెల్లడించాడు.


ALSO READ: అమెరికాలో తొలిసారి.. టీ 20 ప్రపంచకప్ క్రికెట్ పోటీలు

అన్ని‌వైపుల నుంచి క్లారిటీ రావడంతో ఇటలీ జట్టుపై ఫోకస్ పెట్టాడు జో బర్న్స్. 34 ఏళ్ల ఈ ఆటగాడు 2014-20 మధ్యలో ఆసీస్ తరపున 23 టెస్టులు, ఆరు వన్డేలు ఆడాడు. అందులో నాలుగు టెస్ట్ సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలున్నాయి.

 

Tags

Related News

Murli vijay : ఆస్ట్రేలియా క్రికెటర్ కూతురితో విజయ్ సీక్రెట్ రిలేషన్.. సముద్రాలు దాటి!

Rinku Singh: పాపం రింకూ… తన బ్యాట్ కు రాఖీ కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడుగా

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Big Stories

×