Kasturi -Jemimah: అలనాటి హీరోయిన్ కస్తూరి శంకర్ గురించి పరిచయాలు అక్కర్లేదు. సినిమాలతో పాటు బుల్లితెర మీద కూడా తనదైన గుర్తింపు తెచ్చుకుంది కస్తూరి. మోడల్ గానే కాకుండా తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో పలు సినిమాలలో తనదైన నటనతో మంచి గుర్తింపు పొందింది. అలాగే పలు సీరియల్స్ లో ప్రధాన పాత్రలలో నటించి.. బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయింది కస్తూరి. ఈమె తన ముక్కుసూటి వైఖరితో తరచూ వివాదాల్లో నానుతూ ఉంటుంది.
Also Read: Team India: మోడీ సార్… గంభీర్, అగర్కార్ ను మీరైనా తీసేయండి.. టీమ్ ఇండియాను కాపాడండి!
ఆ మధ్య తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలనంగా మారింది. తమిళనాడులోని అంతఃపురంలో సేవలు చేసేందుకు తెలుగువారు వచ్చారని.. అందులో కొందరు ఇప్పుడు తమిళులుగా చెలామని అవుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ కారణంగా జైలుకు కూడా వెళ్ళి వచ్చింది. ఇక ఈ ఏడాది ఆగస్టులోనే ఈమె భారతీయ జనతా పార్టీ {బిజెపి} లో చేరింది.
భారత్ వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ లో భారత్ ని విజయపథంలో నడిపించిన జమీమా పై.. నటి, తమిళనాడు బీజేపీ నాయకురాలు కస్తూరి శంకర్ తీవ్ర విమర్శలు చేసింది. ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ ముగిసిన అనంతరం జెమిమా చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ.. “జమీమాని దేవుడు ఆశీర్వదించాలి. కానీ నాకు ఒక సందేహం. ఒకవేళ ఎవరైనా రాముడి పేరు మీద లేదా హరి హర మహాదేవ్, సత్ శ్రీ అకాల్ అని చెబితే ప్రజల ప్రతిస్పందన ఎలా ఉండేది..? ఎవరైనా అలా చేస్తారా”. అని ట్వీట్ చేశారు. అంటే.. క్రైస్తవ ఆటగాళ్లు.. “ఏసుకి ధన్యవాదాలు” అంటే అది సహజంగా తీసుకుంటారు. కానీ హిందూ లేదా సిక్కు ఆటగాళ్లు తమ మతపరమైన నినాదాలు చేస్తే ఊరుకుంటారా..? అని ఆమె ప్రశ్నించారు.
Also Read: Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ డిశ్చార్జ్.. ఆస్పత్రి బిల్లు కట్టిన బీసీసీఐ… ఎన్ని కోట్లంటే ?
ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ లో గెలిచిన అనంతరం జమీమా మాట్లాడుతూ.. ” నేను జీసస్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జీసస్ నన్ను ముందుకు నడిపించాడు. నేను సొంతంగా పోరాడలేకపోయాను.. ఆ జీసస్ నన్ను భరించాడు. గత 4 నెలలు నాకు చాలా కఠినంగా గడిచింది. ఇప్పుడు నాకు ఇదంతా ఓ కలలా అనిపిస్తుంది. నేను సెంచరీ గురించి ఆలోచించలేదు. జట్టును గెలిపించాలనే ఆలోచనే నా మైండ్ లో ఉంది. నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు” అని వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో జెమీమా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనియాంశంగా మారాయి. ఆ వ్యాఖ్యలపై పలు రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా, హిందూ సంఘాలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఆమెని టీం ఇండియా నుండి తొలగించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
God bless Jemimah.
But I cant stop wondering, what would have been the reaction if someone says Jai shri Raam or Har har Mahadev or Sat sri akal ?
Has anybody done it ? https://t.co/c2EySoGAyA— Kasturi (@KasthuriShankar) October 31, 2025