Austraila – WC 2023 : క్రికెట్ లో బలమైన టీమ్ ఏదైనా ఉంది అంటే.. అది ఆస్ట్రేలియా జట్టు అనే చెప్పవచ్చు. తొలుత ఆస్ట్రేలియా జట్టు వన్డే వరల్డ్ కప్ 1987లో సాధించింది. ఇక ఆ తరువాత 1999లో, 2003లో, 2007లో హ్యాట్రిక్ వరల్డ్ కప్ సాధించి రికార్డు సృష్టించింది. అలాగే 2000లో ఛాంపియన్స్ ట్రోఫీ, 2006లో ఛాంపియన్ ట్రోఫి, 2009 ఛాంపియన్ ట్రోఫీ కూడా సాధించింది. 2015లో వన్డే వరల్డ్ కప్, 2021 టీ-20 వరల్డ్ కప్, 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లను గెలుచుకుంది. అలాగే 2023 వన్డే వరల్డ్ కప్ సాధించింది ఆస్ట్రేలియా జట్టు. ప్రపంచంలో ఏ జట్టు కూడా ఇన్ని సార్లు టైటిల్ సాధించలేదంటే ఆస్ట్రేలియా టీమ్ క్రికెట్ ఎలా ఆడుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కానీ వీళ్లు ఇలా టైటిల్స్ సాధించినప్పటికీ కొన్ని సందర్భాల్లో వీళ్లు ప్రవర్తించే తీరు చూస్తుంటే వీరికి ఎప్పటిలా మాత్రం ఇక నుంచి టైటిల్స్ అంత తేలికగా రావని స్పష్టంగా అర్థమవుతోంది.
Also Read : RCB – Shilpa Shetty : బాలీవుడ్ హీరోయిన్, ఓ క్రిమినల్ చేతిలోకి RCB… ఎన్ని కోట్లు అంటే ?
ఇది సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు. 2023 ఆస్ట్రేలియా వన్డే వరల్డ్ కప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ వన్డే వరల్డ్ కప్ గెలిచిన తరువాత ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ వరల్డ్ కప్ పై కాలు పెట్టాడు. అప్పటి నుంచి ఆస్ట్రేలియాకి మొదలైంది దరిద్రం. ఆస్ట్రేలియా పతనం 2023 వరల్డ్ కప్ సాధించినప్పటి నుంచే మొదలైంది. అప్పుడు బలుపు చూపించకపోతే బాగుండు అని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఆస్ట్రేలియా జట్టు అప్పుడు బలుపు చూపించడం వల్లనే 2024 టీ-20 వరల్డ్ కప్ 2024, ఛాంపియన్ ట్రోఫీ 2025, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025 ఓటమి పాలైంది ఆస్ట్రేలియా జట్టు. ఎవరైనా వరల్డ్ కప్ గెలిచారంటే చాలా సంతోషంగా సంబురాలు జరుపుకుంటారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు అలాగే జరుపుకున్నప్పటికీ.. చివరికీ వరల్డ్ కప్ పైనే కాళ్లు పెట్టి కూర్చొని మరీ మద్యం సేవించడం అప్పట్లో ఓ ఫోటో వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఆధ్వర్యంలోనే 2002 లో ఛాంపియన్స్ ట్రోఫీ, 2003లో వన్డే వరల్డ్ కప్, 2007లో వన్డే వరల్డ్ కప్ సాధించడం విశేషం. కేవలం ఒకే ఒక్క కెప్టెన్ వరుసగా రెండు వరల్డ్ కప్ లను సాధించిన ఘనత రికీ పాంటింగ్ కే సాధ్యం. ముఖ్యంగా మొన్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టైటిల్ ని మరోసారి గెలుచుకోవాలని భావించింది. కానీ ఫైనల్ లో ఆస్ట్రేలియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికాను తక్కువ స్కోర్ కే కట్టడి చేశారు. కానీ రెండో ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా నిర్దేశించిన 282 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ మార్కరమ్ సెంచరీ, కెప్టెన్ బవుమా హాఫ్ సెంచరీ సాధించి కీలక ఇన్నింగ్స్ ఆడటంతో సౌతాఫ్రికా WTC ఛాంపియన్ గెలిచింది.