BigTV English

RCB – Shilpa Shetty : బాలీవుడ్ హీరోయిన్, ఓ క్రిమినల్ చేతిలోకి RCB… ఎన్ని కోట్లు అంటే ?

RCB – Shilpa Shetty : బాలీవుడ్ హీరోయిన్, ఓ క్రిమినల్   చేతిలోకి RCB… ఎన్ని కోట్లు అంటే ?

RCB – Shilpa Shetty :  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ 2025లో టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ జట్టు గతంలో మూడు సార్లు ఫైనల్ కి చేరుకుంది. కానీ ఫైనల్స్ లో మాత్రం చేతులెత్తేసింది. తొలుత 2009లో డెక్కన్ ఛార్జర్స్ చేతిలో ఓటమి పాలైంది. ఇక ఆ తరువాత 2012లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోతే.. 2016లో ఫైనల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోవడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పై ఘోరంగా ట్రోలింగ్స్ చేశారు. అప్పట్లో సౌతాఫ్రికా ఆటగాడు డివిలీయర్స్ కూడా ఆర్సీబీ జట్టులో ఉండటంతో ఆర్సీబీ సౌతాఫ్రికా మాదిరిగా ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేదు అని రకరకాలుగా కామెంట్స్ చేశారు.


Also Read : Shubman Gill : లేడీ గెటప్ లో టీమిండియా కెప్టెన్ గిల్?

2025 ఐపీఎల్ లో అందరి అంచనాలను పటా పంచాలు చేసి.. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింటిలో ఆర్సీబీ అదరగొట్టింది. ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ గెలుస్తుందనుకున్న సమయంలో ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి విజయతీరాలకు చేర్చారు. తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. ఆర్సీబీ జట్టు ని బాలీవుడ్ హీరోయిన్ శిల్ప శెట్టి.. క్రిమినల్ రాజ్ కుంద్రల కట్టు పడినట్టు తెలుస్తోంది. ఆర్సీబీ జట్టును దక్కించుకోవాలని భావిస్తున్నట్టు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. గతంలో కింగ్ ఫిషర్ ఓనర్ విజయ్ మాల్యా కూడా రాయల్ ఛాలెంజర్స్ జట్టుని దక్కించుకుంటారని వార్తలు వినిపించాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విలువ రూ.2బిలియన్ డాలర్లు ఉన్నట్టు సమాచారం. ఇక ఆర్సీబీ ఈ సీజన్ లో టైటిల్ గెలవడంతో ఈ జట్టు గురించి పలువురు బిజినెస్ మ్యాన్స్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. గతంలో అసలు ఆర్సీబీ ఒక్క టైటిల్ కూడా సాధించకపోవడంతో ఫ్యాన్స్ లో కూడా కాస్త బాధ ఉండేది. టైటిల్ సాధించిన తరువాత ఫ్యాన్స్ భారీగా బెంగళూరు చిన్న స్వామి స్టేడియానికి చేరుకోవడంతో తొక్కిసలాటలో 11 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా కలిచివేసింది.


 

విజయ్ మాల్యా  ఇటీవలే రాజ్ షమానీతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో విజయ్ మాల్యా కీలక వివరాలను వెల్లడించాడు. ముంబై ఇండియన్స్ జట్టుతో సహా మూడు ఫ్రాంచైజీలకు బిడ్ వేసినట్లు తెలిపాడు. అయితే ముకేశ్ అంబానీ అత్యధిక ధరను కోట్ చేయడంతో కొనలేకపోయినట్లు చెప్పుకొచ్చాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని అతి తక్కువ తేడాతో కోల్పోయిన తర్వాత విజయ్ మాల్యా చివరకు 112 మిలియన్ల యూఎస్ డాలర్లకు ఆ సమయంలో ఆర్సీబీని కొనుగోలు చేశాడు. ఆ సమయంలో 2008లో రూ. 112 మిలియన్ల అమెరికన్ డాలర్ల విలువ రూ.600-700 కోట్లు అని.. ఆర్సీబీని కొనుగోలు చేయడం వెనుక ఉన్న ఏకైక ఉద్దేశం తన విస్కీ బ్రాండ్ “రాయల్ ఛాలెంజ్” ని ప్రోత్సహించడమేనని విజయ్ మాల్యా చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ బాలీవుడ్ హీరోయిన్, ఓ క్రిమినల్ చేతికి ఆర్సీబీ వెళ్తుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపించడం విశేషం.

?igsh=dnlobzNuMzhrdWlv

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×