Keerthy Suresh: మహానటి కీర్తి సురేష్(Keerthy Suresh) ఇటీవల తెలుగు సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి. ఈమె చివరిగా దసరా సినిమా ద్వారా హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలు పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాల తర్వాత కీర్తి సురేష్ తెలుగులో ఇప్పటివరకు ఎలాంటి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాలేదు అయితే ఈ త్వరలోనే ఈమె ఉప్పుకప్పురంబు(Uppu kappurambu) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా నేరుగా అమెజాన్ ప్రైమ్(Amazon Prime) లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అమెజాన్ ప్రైమ్ …
కలర్ ఫోటో ఫేమ్ సుహాస్(Suhas) హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం చాలా సైలెంట్ గా షూటింగ్ పనులను పూర్తిచేసుకుంది. అయితే ఈ సినిమా మార్చిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిందిగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. జులై 4వ తేదీ ఈ సినిమా థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో సోషల్ మీడియాలో మంచి ఆదరణ సొంతం చేసుకుంటూ మంచి వ్యూస్ రాబడతోంది.
సెటైరికల్ కామెడీ జానర్..
ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం అనంతరం చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా కీర్తి సురేష్ సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాల గురించి మాట్లాడారు. నా పెళ్లి తర్వాత మొదటిసారి హైదరాబాద్ కి వస్తున్నానని అప్పటికి ఇప్పటికీ తన పట్ల చూపిస్తున్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని తెలిపారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఐవీ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా సెటైరికల్ కామెడీ జానర్లో తెరకెక్కింది. ఒక గ్రామంలో స్మశానవాటిక సమస్యను ఎలా పరిష్కరించారనేది కథాంశం. తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా అందుబాటులోకి రాబోతుందని తెలుస్తోంది.
వేమన పద్యం చెప్పిన కీర్తి సురేష్
పద్యంతో తనలోని మరో ట్యాలెంట్‌ను బయటపెట్టిన కీర్తి సురేష్#KeerthySuresh #Suhas #UppuKappuRambu pic.twitter.com/34u5fE1080
— TeluguOne (@Theteluguone) June 19, 2025
ఇక ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా కీర్తి సురేష్ వేమన శతకాలలో ఒకటైన”ఉప్పుకప్పురంబు నొక్క పోలికనుండు” అనే పద్యాన్ని తెలుగులో చాలా చక్కగా ఎలాంటి తప్పులు లేకుండా అవలీలగా చెప్పేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు కీర్తి సురేష్ తెలుగు చాలా చక్కగా మాట్లాడుతారని తెలుసు కానీ పద్యాలు కూడా ఇలా అలవోకగా చెప్పేస్తున్నారేంటీ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ పద్యం చెబుతూ తనలో దాగి ఉన్న మరో టాలెంట్ ను కూడా కీర్తి సురేష్ బయట పెట్టారు.
Also Read: Nagachaitanya: శేఖర్ కమ్ముల వల్ల లక్షలు ఆదా చేసిన చైతూ.. ఇన్నాళ్లకు బయటపెట్టాడుగా?