E-Paper
Advertisement

Australia : యాషెస్ సిరీస్ .. తొలి టెస్ట్ లో ఇంగ్లాండ్ కు షాక్.. ఉత్కంఠ పోరులో ఆసీస్ విక్టరీ..

Australia : యాషెస్ సిరీస్ .. తొలి టెస్ట్ లో ఇంగ్లాండ్ కు షాక్.. ఉత్కంఠ పోరులో ఆసీస్ విక్టరీ..
Advertisement

Australia : యాషెస్ సిరీస్‌ తొలి టెస్టులో ఇంగ్లాండ్ కు ఆస్ట్రేలియా షాక్ ఇచ్చింది. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో 2 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. 281 పరుగుల టార్గెట్ ను ఛేదించింది. ఓవర్ నైట్ స్కోర్ 107 /3తో చివరి రోజు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించింది. ఆసీస్ విజయానికి 174 పరుగులు కావాలి. ఇంగ్లాండ్ గెలవాలంటే 7 వికెట్లు తీయాలి. అయితే వర్షం వల్ల లంచ్ వరకు మ్యాచ్ ప్రారంభం కాలేదు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందేమో అనిపించింది. అయితే మధ్యాహ్నం తర్వాత మ్యాచ్ ప్రారంభమైంది.

Advertisement

ఇంగ్లాండ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో 143 పరుగులకే ఆసీస్ 5 వికెట్లు కోల్పోయింది. అయితే ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (65) ఒంటరి పోరాటం చేశాడు. కామెరూన్ గ్రీన్ (28) తో కలిసి జట్టు స్కోర్ ను పెంచాడు. ఈ ఇద్దరు అవుటైన తర్వాత మరోసారి ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. కాసేపటికే క్యారీ కూడా పెవిలియన్ చేరాడు. దీంతో ఆసీస్ 227 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది.

ఈ సమయంలో ఆసీస్ విజయం సాధించాలంటే ఇంకా 54 పరుగులు చేయాలి. కీలక బ్యాటర్లంతా పెవిలియన్ చేరారు. ఇక ఇంగ్లాండ్ విజయం లాంఛనమే అనిపించింది. అయితే కెప్టెన్ కమిన్స్ (44 నాటౌట్), నాథన్ లయన్ (16 నాటౌట్ ) అద్భుతంగా పోరాటం చేశారు. 9వ వికెట్ కు అజేయంగా 55 పరుగులు జోడించి ఆసీస్ కు విజయాన్ని అందించారు. తొలి ఇన్నింగ్స్ ను తొలిరోజు డిక్లేర్ చేయడం ఇంగ్లాండ్ కొంపముంచింది. తొలి ఇన్నింగ్స్ లో అద్భుతంగా ఆడి సెంచరీ (141 ) చేసిన ఉస్మాన్ ఖవాజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Advertisement

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 273 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆసీస్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 386 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయంతో 5 టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ ఈ నెల 28న మొదలవతుంది.

స్కోర్లు..
ఇంగ్లాండ్- 393/8d & 273

ఆస్ట్రేలియా- 386 & 282/8

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×