Big Stories

Babar Azam: జిమ్‌’బాబర్’ అంటూ ఫ్యాన్స్ హంగామా.. బాటిల్ విసరబోయిన పాక్ మాజీ కెప్టెన్.. వీడియో వైరల్..

Babar Azam
Babar Azam

Babar Azam Lost Control: పాకిస్థాన్ సూపర్ లీగ్ గేమ్‌లో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్‌ను అభిమానుల బృందం ట్రోల్ చేసింది. టెక్నికల్ స్టాఫ్‌తో కూర్చున్న అజామ్‌పై ఫ్యాన్స్ ‘జిమ్‌బాబర్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన బాబర్ విసుగు చెంది వారిపై వాటర్ బాటిల్ విసిరేస్తానని బెదిరించాడు. కాగా బాటిల్ విసరకుండా ఆగిపోయాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో తన దేశస్థులు చేసిన ట్రోలింగ్‌తో మాజీ పాకిస్థాన్ కెప్టెన్ ఆందోళన చెందుతున్నట్లు కనిపించాడు.

- Advertisement -

ఇప్పుడీ వీడియో ట్విట్టర్‌లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ స్పందిస్తూ నిజంగా బాబర్ జిమ్‌బాబరే అని ట్రోల్ చేస్తున్నారు. ఇంకొంతమంది బాబర్ సపోర్టర్స్ ‘అవును నిజమే.. బాబర్ ప్రతి జట్టును జింబాబ్వే అనుకుంటాడు, అందుకే రెచ్చిపోతాడు’ అని సపోర్ట్ చేస్తున్నారు.

- Advertisement -

జిమ్‌బాబార్ ఎందుకు?
బాబర్ అజామ్ 2015లో అరంగేట్రం చేసినప్పటి నుంచి పాకిస్తాన్‌కు వెన్నుముకలా నిలిచాడు. ఒకప్పుడు ప్రపంచ వేదికపై విరాట్ కోహ్లి వారసుడిగా కనిపించాడు. ఆటలోని అన్ని ఫార్మాట్‌లలో పాకిస్తాన్ బ్యాటర్ గురించి చాలా అంచనాలే ఉన్నాయి. అయితే, గత 2-3 సంవత్సరాలలో, బాబర్ పాకిస్తాన్ కోసం కీలక మ్యాచ్‌లలో విఫలమై, సులభమైన లేదా ఎటువంటి ఫలితం లేని గేమ్‌లలో అద్భుత ప్రదర్శన చేయడం ద్వారా దుష్ట ఖ్యాతిని పొందాడు.

Read More: ముగిసిన రెండో రోజు ఆట.. టీమిండియా 219/7..

బాబర్ ఆటలోని అన్ని ఫార్మాట్లలో జింబాబ్వేతో 18 మ్యాచ్‌లు ఆడాడు. 57.75 సగటుతో 693 పరుగులు చేశాడు. జిమ్‌బాబార్ అనే పదం బాబర్ పేలవమైన ఫామ్ నుంచి బయటపడటానికి.. కొన్ని పరుగులు చేయడానికి జింబాబ్వేతో సిరీస్ అవసరమనే నమ్మకం నుంచి ఉద్భవించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News