IND VS AUS: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia vs India, 1st ODI ) మధ్య ఇవాళ ప్రారంభమైన వన్డే సిరీస్ కు వరుణుడు గండంగా మారాడు. పెర్త్ వేదికగా ఇవాళ మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి వర్షం పడుతూనే ఉంది. రెండుసార్లు వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయి ప్రారంభమైంది. ఇక చివరికి వర్షం తగ్గడంతో ఓవర్లను కుదించేశారు. 50 ఓవర్ల మ్యాచ్ ను కాస్త 35 ఓవర్లకు అంపైర్లు ఫైనల్ చేశారు. దీంతో టీమిండియా మళ్లీ బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. బ్యాటింగ్ ప్రారంభించిన వెంటనే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వికెట్ కోల్పోయింది టీమిండియా. ప్రస్తుతం 46 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది టీమిండియా.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య వేదికగా జరుగుతున్న వన్డే మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించడంతో ఓవర్లను కుదించారు. ఈ మ్యాచ్ ను 35 ఓవర్లకు కుదించారు. అంటే ప్రతి బౌలర్ గరిష్టంగా ఏడు ఓవర్లు మాత్రమే వేయాలి. ఇప్పటికే టీమిండియా 11 ఓవర్లు ఆడేసింది. మరో 24 ఓవర్లు వాడితే టీమిండియా ఇన్నింగ్స్ ఫినిష్ అవుతుంది.
టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia vs India, 1st ODI ) మధ్య జరుగుతున్న వన్డే నేపథ్యంలో వరుణుడు పదేపదే అడ్డు తగిలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్లేయర్లు అందరూ డ్రెస్సింగ్ రూమ్ లో రిలాక్స్ అవుతున్నారు. అటు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అలాగే ప్రస్తుత సారధి గిల్ ఇద్దరు పాప్ కార్న్ తింటూ కాస్త రిలాక్స్ అయ్యారు. పాప్ కార్న్ కు సంబంధించిన పెద్ద బ్యాగు గిల్ తీసుకువస్తే… అందులో నుంచి రోహిత్ శర్మ కూడా తీసుకొని తినేసాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మొన్ననే పది కిలోలు తగ్గావు, మళ్లీ పాప్కార్న్ ఎందుకు నీకు ? మానేసేయ్ అంటూ రోహిత్ శర్మ పై ( Rohit Sharma) సెటైర్లు పేల్చుతున్నారు.
ఇక టీమిండియా ( Team India ) బ్యాటింగ్ లైనప్ విషయానికి వస్తే, మనోళ్లు చాలా తడబడ్డారు. ఇప్పటి వరకు 46 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది టీమిండియా. రోహిత్ శర్మ 14 బంతులు ఆడి 8 పరుగులు మాత్రమే చేశాడు. టీమిండియా కెప్టెన్ గిల్ 10 పరుగులకు అవుట్ అయ్యాడు. అటు విరాట్ కోహ్లీ ( Virat Kohli ) 8 బంతులు ఆడి డక్ అవుట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ రాణిస్తాడు అనుకుంటే వర్షం తర్వాత 11 పరుగులకు అవుట్ అయ్యాడు. ప్రస్తుతం అక్షర్ పటేల్ అలాగే కేఎల్ రాహుల్ ఇద్దరు బ్యాటింగ్ చేస్తున్నారు.
— Serah (@QueSerahSerah_) October 19, 2025