BigTV English

Viral Videos : ఏం ధైర్యం సామీ.. పాముకు నోటితో ఊపిరి అందించాడు..!

Viral Videos : ఏం ధైర్యం సామీ.. పాముకు నోటితో ఊపిరి అందించాడు..!
CPR
Police Gives CPR to Revive Snake

Police Gives CPR to Revive Snake : సాధారణంగా ఒక మనిషి చావు బ్రతుకుల మధ్య ఉంటే అతన్ని బతికించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో ముఖ్యంగా సిపిఆర్ కూడా ఒకటి. సిపిఆర్ చేయడం వల్ల చాలా మంది బతకడం కూడా మనం చూశాము. అయితే ఇప్పటి వరకు సిపిఆర్ అనేది మనుషులకు మాత్రమే చేసేవారు.


కానీ ఇప్పుడు సిపిఆర్ పాములకు కూడా చేస్తున్నారు. దీనివల్ల పాములు కూడా బతుకుతాయని ఇప్పుడే తెలిసింది. ఇక ఈ న్యూస్ జనాలు ఆశ్యర్యపోతున్నారు. అసలు ఈ పాము ఏంటో, సిపిఆర్ చేయడం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Read More : ఒకటి కాదు ఏకంగా ౩ పెద్ద పాములు.. మూకుమ్మడిగా మీద పడితే.. ఒళ్లు జలదరించే సీన్


మధ్యప్రదేశ్‌కి చెందిన ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆయన వెళుతున్న దారిలో ఒక పాము అపస్మారక స్థితిలోకి వెళ్తున్న క్రమంలో ఆయన కంటపడింది. ఆ కానిస్టేబుల్ దాని దగ్గరకు వెళ్లి చూడగా.. క్రిమిసంహారక మందు కలిపిన నీటిని తాగి నట్లుగా గుర్తించాడు. ఈ క్రమంలో ఆ పాముకు పోలీస్ ఆఫీసర్ దానికి సిపిఆర్ చేశాడు.

సిపిఆర్ మనిషికి ఎలా చేస్తారో.. అలానే పాము నోట్లో నోరు పెట్టి దానికి శ్వాసను అందించాడు. అసలు సిపిఆర్ ఎందుకు చేస్తారంటే.. ఒక మనిషి కి ప్రమాదం జరిగినపుడు గుండె కొట్టుకోకుండా ఆగిపోయిన పరిస్థితిలో దానికి కృత్రిమంగా నోటి ద్వారా శ్వాసను అందించి చెస్ట్ పైన ప్రెస్ చేస్తూ ఉంటే ఆ గాలికి ఆగిపోయిన గుండె అనేది ఆక్టివేట్ అయి మళ్లీ యధావిధిగా పనిచేస్తుందని చేస్తారు.

ఇక ఇలాంటి క్రమంలో మనిషి మళ్లీ బ్రతకడం జరుగుతుంది. ఇలాంటి కేసులను మనం చాలా సార్లు చూసేఉన్నాము. ఇక్కడ కూడా అదేవిధంగా సిపిఆర్ చేసిన తర్వాత ఆ పాము అనేది స్పృహలోకి వచ్చింది. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ ఆ పామును పక్కనే వదిలేసి వచ్చాడు.

Read More : బుసలు కొడుతూ పైకి లేచిన కింగ్ కోబ్రా.. ఎలా పట్టుకున్నాడో చూడండి..!

ఈ సంఘటన మొత్తాన్ని పక్కనే ఉన్న ఒక వ్యక్తి తన మొబైల్‌లో షూట్ చేసి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్‌లో అప్లోడ్ చేశాడు. ఈ వీడియోని చూసిన చాలా మంది నెటిజన్లు ఒక పోలీస్ ఆఫీసర్ సిపిఆర్ చేసి పామును బతికించడం అనేది చాలా గ్రేట్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

మరికొంతమంది మాత్రం కొంచెం అజాగ్రత్తగా ఉంటే ఆ పాము మళ్లీ స్పృహలోకి వచ్చిన తర్వాత కాటేసే ప్రామాదం ఉందని కొన్ని జాగ్రత్తలను తెలియజేశారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆ వీడియోలో ఉన్న కానిస్టేబుల్ పేరు అతుల్ శర్మగా గుర్తించారు.

Tags

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×