Indian Fans Bad Luck : ఇండియా-పాక్ ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ కొద్దిరోజుల పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ కి విరాట్ కోహ్లీ అభిమానులు వైట్ జెర్సీ ధరించి స్టేడియం వద్దకు చేరుకున్నారు. కానీ వరుణుడు మ్యాచ్ కి అంతరాయం కలిగించాడు. చాలా రోజుల గ్యాప్ తరువాత ఐపీఎల్ ప్రారంభమవుతుందని అభిమానుల సంతోషం పై వరుణుడు నీళ్లు చల్లాడు. బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో వర్షం కుండపోతగా కురుస్తుండటంతో RCB VS KKR మ్యాచ్ రద్దు అయింది. ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది.
ప్లే ఆప్స్ నుంచి నిష్క్రమించిన KKR
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కేకేఆర్ మధ్య చిన్న స్వామి స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ కి వర్షం అడ్డంకిగా మారింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. దీంతో 13 మ్యాచ్ లు ఆడిన కేకేఆర్.. 12 పాయింట్లు దక్కించుకోవడంతో ఈ సీజన్ లో కేకేఆర్ ప్లే ఆప్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 17 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. మరో రెండు మ్యాచ్ లు ఉన్న ఆర్సీబీ ప్లే ఆప్స్ కి చేరడం ఇక లాంఛనమే. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్నరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 1 పాయింట్ తో అగ్ర స్థానానికి చేరుకుంది. 16 పాయింట్లతో గుజరాత్ టైటాన్స్ రెండో స్థానానికి చేరుకుంది.
విరాట్ కోహ్లీ కి అవమానం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ ఇటీవలే టీమిండియా టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కోహ్లీ కి గ్రాండ్ గా పేర్వేల్ చేద్దామని భావించిన అభిమానులకు నిరాశ తప్పింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ అభిమానులు అందరూ 18 జెర్సీ ధరించి స్టేడియం వద్దకు చేరుకున్నారు. అయితే స్టేడియంలో మొత్తం విరాట్ అభిమానులు ఆకర్షించేలా కనిపించాలని భావించగా.. వరుణుడు వద్దన్న పని చేశాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ కి వర్షం దెబ్బ మీద దెబ్బ తీసింది. ఐపీఎల్ మ్యాచ్‌లో కోహ్లి టెస్ట్ ట్రి బ్యూట్ కోసం అంతా సిద్ధంగా ఉన్న సమయంలోనే వరుణుడు కరుణించలేదు. ఇక ఈ మ్యాచ్ మాత్రమే కాదు.. గతంలో కూడా రెండు మూడు సందర్భాల్లో విరాట్ కోహ్లీకి వర్షం అడ్డంకి మారింది. 2019 లో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్న సమయంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ లో వర్షం వల్ల మ్యాచ్ రద్దు అయింది. అలాగే విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్న సమయంలో 2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో న్యూజిలాండ్ తో జరగాల్సిన రోజు వర్షం కారణంగా తరువాత రోజుకి వాయిదా పడింది. దీంతో ఆ మ్యాచ్ లో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. తాజాగా కూడా మ్యాచ్ రద్దు కావడంతో విరాట్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కొనసాగుతోంది.
– 2019 SF lost bcz of Rain🥺
– WTC Final lost bcz of Rain– All set for the Kohli Test Tribute on IPL Match but again Rain..
Luck was never meant to be a part of your life 💔 @imVkohli #RCBvsKKR pic.twitter.com/KLjufPvx28
— S (@kingslanding_18) May 17, 2025