PSL Scared : ఇండియా-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అటు పాకిస్తాన్ సూపర్ లీగ్.. ఇటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఐపీఎల్ పున: ప్రారంభమైంది. అయితే వర్షం కారణంగా ఇప్పటివరకు ఇంకా టాస్ పడలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం విరాట్ కోహ్లీ అభిమానులు అంతా వైట్ జెర్సీ ధరించి స్టేడియానికి వచ్చారు. కానీ వర్షం కారణంగా స్టేడియం అంతా తడిసి ముద్దయింది. బెంగళూరులోని క్రికెట్ స్టేడియం వద్ద ఎంత వర్షం వచ్చినా అరగంటలోపు క్లియర్ చేసి మ్యాచ్ ప్రారంభించే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఉంది. దీంతో టాస్ ఆలస్యం పడే అవకాశం ఉందని పేర్కొనడం విశేషం.
Also Read : Virat Kohli: చిన్న స్వామిలో తెల్ల పావురాలు…కోహ్లీ కోసం భారీ ప్లాన్.. గూస్ బంప్స్ రావాల్సిందే
పీఎస్ఎల్ కి ఎదురు దెబ్బ
ఇండియా-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పై ఇండియా ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ తరుణంలోనే పాకిస్తాన్ లోని రావల్పిండి క్రికెట్ స్టేడియం పై ఇండియా క్షిపణులు తిరిగాయని దీంతో పీఎస్ఎస్ వాయిదా వేశారు. ఐపీఎల్ వాయిదా వేయగానే పీఎస్ఎల్ మ్యాచ్ లు దుబాయ్ లో జరుగుతాయని ప్రకటించారు. దుబాయ్ పాకిస్తాన్ కి పర్మిషన్ ఇవ్వకపోవడంతో పీఎస్ఎల్ ని కూడా వాయిదా వేశారు. ఐపీఎల్ మే 17 నుంచి ప్రారంభం కావడంతో.. పీఎస్ఎల్ కూడా కావాలనే నేటి నుంచి ప్రారంభించారు. అయితే భారత్ ఎక్కడ దాడి చేస్తుందోననే భయంతో పీఎస్ఎల్ మ్యాచ్ లు చూసేందుకు క్రికెట్ అభిమానులు ఎవ్వరూ కూడా స్టేడియం వైపు రావడం లేదు. దీంతో పాకిస్తాన్ కి తీవ్ర నష్టం కలిగినట్టు సమచారం. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన క్రికెట్ అంటే ఐపీఎల్ అనే చెప్పవచ్చు. ఐపీఎల్ కి పీఎస్ఎల్ పోటీగా వస్తే.. ఎక్కడ తట్టుకుంటుందని.. అందుకే పాక్ కి దెబ్బ మీద దెబ్బ తగులుతుందని పలువురు భారతీయ క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు.
ఐపీఎల్ కి ఫుల్ క్రేజీ..
ఇక ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు జంకుతున్నారని.. ఇండియా దెబ్బ అంటే అలా ఉంటుందని కొందరూ పేర్కొంటున్నారు. ఇక పాకిస్తాన్ లో పీఎస్ఎల్ చూసేందుకు ప్రేక్షకులు రాకపోయినా.. ఇండియాలో మాత్రం ఐపీఎల్ కి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుండటంతో విరాట్ కోహ్లీ అభిమానులు వర్షాన్ని సైతం లెక్క చేయచేయకుండా వైట్ జెర్సీతో స్టేడియంలోకి వచ్చారు. కానీ వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యం అవుతోంది. 10.56 లోపు వర్షం లేకుంటే చివరికీ 5 ఓవర్ల మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. 11 తరువాత అలాగే వర్షం వస్తే.. మాత్రం చెరో పాయింట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ కి దెబ్బ పడే ఛాన్స్ ఉంది.
Craze of PSL 2025 after India's 🇮🇳 Operation Sindoor 😅
~ Everyone in Pakistan 🇵🇰 is scared, so they preferred to watch matches from home 😶🌫️ pic.twitter.com/ZvTbYz5PdU
— Richard Kettleborough (@RichKettle07) May 17, 2025