BigTV English

Mexico School: వామ్మో.. స్కూల్ లో సమాధులు, తవ్విచూస్తే అన్ని శవాలే!

Mexico School: వామ్మో.. స్కూల్ లో సమాధులు, తవ్విచూస్తే అన్ని శవాలే!

Viral News: తరచుగా తవ్వకాల్లో పురాతన వస్తువులు బయటపడటం చూస్తుంటాం. బంగారు, వెండి నాణేలు, శతాబ్దాల నాటి పనిముట్లు లేదంటే వంట పాత్రలు, సహా ఎన్నో రకాల వస్తువులు కనిపిస్తుంటాయి. కొంత మందికి లంకె బిందెలు కూడా దొరికిన సందర్భాలున్నాయి. అలాగే ఓ స్కూల్ పునర్నిర్మాణ పనుల్లోనూ ఓ షాకింగ్ విషయం బయటపడింది. ఆ స్కూల్ కింద ఏకంగా స్మశానవాటిక బయటపడటంతో అందరూ షాకయ్యారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..


స్మశానం పైనే స్కూల్!

మెక్సిలోని జకాటెకాస్‌ ప్రాంతంలో వాలెంటిన్ గోమెజ్ ఫారియాస్ ఎలిమెంటరీ స్కూల్ ఉంది. ఈ స్కూల్ ఎన్నో దశాబ్దాలుగా విద్యార్థులకు విద్యను అందిస్తోంది. ఈ పాఠశాల బిల్డింగ్స్ పూర్తిగా పాతవి కావడంతో వాటిని కొత్తగా మార్చాలని స్కూల్ యాజమాన్యం భావించింది. అనుకున్నట్లుగానే స్కూల్ రెన్నోవేషన్ పనులు మొదలు పెట్టారు. దాదాపు ఈ పనులు కూడా పూర్తి కావొచ్చాయి. ఒకే ఒక్క తరగతి గదిలోని మార్పుల్స్ మార్చాలి అనుకున్నారు. ముందుగా ఆ క్లాస్ లోని బండలను తొలగించారు. కొత్త బండలు వేయడానికి నేలను తవ్వాలి అనుకున్నారు. గడ్డపారలతో తవ్వుతుండగా తరగతి కింద ఏదో వింత శబ్దం వినిపించింది. తొలుత పట్టించుకోకపోయినా, ఆ తర్వాత ఏదో ఉందనే అనుమానం కలిగింది.


ఒక్కసారిగా అందరూ షాక్!

నిర్మాణ కార్మికులు తరగతి గదిలో కాస్త లోతుగా తవ్వారు. లోపలి దృశ్యాలను చూసి ఒక్కసారిగా షాకయ్యారు. లోపల శవపేటికలు కనిపించడంతో అందరూ భయపడ్డారు. అలాగే తవ్వగా అస్థి పంజరాలు బయటపడ్డాయి. ఓ శవ పేటికలో ఓ వ్యక్తితో పాటు ఏకంగా 8 మంది పిలలల అస్థి పంజరాలు కనిపించాయి. మరో శవపేటికలో చిన్నారి అస్థి పంజరం దొరికింది. ఆ శవపేటికకు వజ్రాలు చెక్కారు. అంతేకాదు, ఆ డెడ్ బాడీని గోధుమ రంగు వస్త్రంతో చుట్టి ఉంచారు.

చనిపోయిన వారంతా 19వ శతాబ్దం వాళ్లేనా?

పాఠశాల యాజమాన్యం వెంటనే ఈ విషయాన్ని ప్రభుత్వానికి చెప్పింది. విషయం తెలుసుకున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంత్రోపాలజీ అండ్ హిస్టరీ నిపుణులు స్పాట్ కు చేరుకున్నారు. మనుషులను ఖననం చేసిన ఆచారాలు చాలా వింతగా ఉండటం వారికి ఆశ్చర్యం కలిగించింది. ఈ అస్థి పంజరాలు ఏ కాలం నాటివి అనే విషయంలో ఇంకా ఓ క్లారిటీకి రాలేకపోయారు. అయితే, ఈ అస్థి పంజరాలతో 1862 నాటి ఓ కాయిన్ ను గుర్తించారు. ఈ నేపథ్యంలో చనిపోయిన వాళ్లు 19వ శతాబ్దానికి చెందిన వాళ్లు అయి ఉంటారని భావిస్తున్నారు. అక్కడ దొరికిన వస్తులను, వింత భాషలో రాసిన ఓ కాగితం ముక్కను స్వాధీనం చేసుకుని పరిశోధనలు మొదలు పెట్టారు.

17వ శతాబ్దంలో హాస్పిటల్?

ఈ స్కూల్ బిల్డింగ్ ఉన్న ప్రాంతంలో 17వ శతాబ్దంలో కాన్వెంట్, ఆసుపత్రిగా ఉపయోగించబడినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ అస్థి పంజరాల వయసు, మరణించి వ్యక్తుల వివరాలను కనుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.  ఇక ఈ స్కూల్ కు సంబంధించి పనులు సెప్టెంబర్ 2024లో ప్రారంభం కాగా, ఏప్రిల్ చివరి వారంలో ముగిసినట్లు యాజమాన్యం వెల్లడించింది. చివరి రోజు పనుల్లో భాగంగా విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలిపింది.

Read Also: బాంబులా పేలిన టాయిలెట్ సీట్.. యువకుడు స్పాట్ లోనే!

Related News

Mumbai Coastal Road: రూ. 12 వేల కోట్లతో మలుపుల రోడ్డు.. లైఫ్ లో ఒక్కసారైనా జర్నీ చేయండి!

Dirtiest railway stations: దేశంలోనే అత్యంత మురికిగా ఉన్న రైల్వే స్టేషన్లు ఇవేనట.. మీ స్టేషన్ కూడా ఉందా?

Railway history: ఈ రైలు వయస్సు 170 ఏళ్లు.. నేటికీ ట్రాక్ పై పరుగులు.. ఎక్కడో కాదు మన దేశంలోనే!

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Hill Stations: హిల్ స్టేషన్స్ కు ఎగేసుకు వెళ్తున్నారా? అయితే, మీ పని అయిపోయినట్లే!

Big Stories

×