BCCI : బీసీసీఐ ప్రెసిడెంట్ పదవీ ఇప్పటికే ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. మరో వారం రోజుల్లోనే భారత క్రికెట్ బోర్డు ఏజీఎం జరుగనుంది. కొత్త అధ్యక్షుడిగా మన్హాస్ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. ముఖ్యంగా బీసీసీఐ ప్రెసిడెంట్ గా మిథున్ మన్హాస్, సెక్రెటరీగా దేవజిత్ సైకియా, వైస్ ప్రెసిడెంట్ గా రాజీవ్ శుక్లా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ దుమల్, ట్రెజరర్ -రఘురామ్ భట్, జాయింట్ సెక్రెటరీ ప్రభుతేజ్ భాటియా, అపెక్స్ కౌన్సిల్- జయదేవ్ షా, ఐపీఎల్ జీసీ- ఎం. మజుందార్ ల పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. బీసీసీఐ ప్రక్షాళన చేపట్టిన తరువాత వీరే పైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read : IND Vs PAK : టీమిండియాతో మ్యాచ్..సైకాలజిస్ట్ ను రంగంలోకి దించుతోన్న పాక్
ముఖ్యంగా కొత్త అధ్యక్షుడు ఎవ్వరూ వస్తారో అనేది త్వరలోనే తేలనుందిచ. అయితే బీసీసీఐ అధ్యక్షుడి రేసులో పలువురు క్రికెట్ దిగ్గజాల పేర్లు వినిపించాయి. వారిలో ముఖ్యంగా సచిన్ టెండూల్కర్, ఎం.ఎస్. దోనీ, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ ఇలా ప్రతీ మాజీ క్రికెటర్ పేరు కూడా వినిపించింది. తాజాగా ఈ జాబితాలో మరో క్రికెటర్ చేరాడు. అయితే అతను కేవలం దేశవాళీ క్రికెట్, ఐపీఎల్ లో మాత్రమే ఆడటం గమనార్హం. దేశవాళీ క్రికెట్ ఢిల్లీ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన మిథున్ మన్హాస్ పేరు తెరపైకి వచ్చేసింది. ఆయనతో పాటు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘురామ్ భట్ కూడా రేసులో ఉన్నారు. అయితే ఎక్కువగా ప్రస్తుతం మిథున్ మన్హాస్ పేరే వినిపించడం విశేషం. మరోవైపు ఇప్పటివరకు బీసీసీఐ అధ్యక్ష రేసులో ఉన్న మాజీ క్రికెటర్లుఅంతర్జాతీయ మ్యాచ్ లు ఆడినవారే కావడం గమనార్హం. కానీ మిథున్ మన్హాస్ మాత్రమే టీమిండియా తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఎక్కువగా అతను దేశవాళీ క్రికెట్ కే పరిమితమయ్యాడు 45 ఏళ్ల మిథున్.
మొత్తం 157 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 9714 పరుగులు చేసాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున కూడా ఆడాడు. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ కి డైరెక్టర్ గానూ బాధ్యతలు నిర్వర్తించాడు.మరోవైపు బీసీసీఐ అధ్యక్ష్య రేసులో ఉన్న వ్యక్తి రఘురామ్ భట్.. ఇతను సెప్టెంబర్ 30 వరకు కర్ణాటక బోర్డు అధ్యక్ష పదవీలో ఉంటారు. వచ్చే రాష్ట్ర బోర్డు ఎన్నికల్లో ఈసారి ఆయన పోటీ పడటం లేదని సమాచారం. బీసీసీఐ అధ్యక్షుడిగా అతనికీ ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. బీసీసీఐ సమావేశంలో ముఖ్యంగా రఘురామ్ భట్, మిథున్ మన్హాస్ గురించే ఎక్కువగా చర్చలు జరగడం విశేషం. సెప్టెంబర్ 28న బీసీసీఐ ఏజీఎం జరుగనుంది. అయితే ఏజీఎంలో క్యాబ్ తరపున హాజరయ్యే సౌరవ్ గంగూలీ, పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధిగా వచ్చే హర్భజన్ సింగ్ మాత్రం మీడియా కానట్టు సమాచారం. మరోవైపు బీసీసీఐలో మరింత మంది క్రీడాకారులకే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంగా కేంద్రప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం.
🚨 NEW BCCI OFFICIALS 🚨 [Express Sports]
President – Mithun Manhas
Secretary – Devajit Saikia
Vice President – Rajeev Shukla
IPL Chairman – Arun Dhumal
Treasurer – Raghuram Bhatt
Joint Secretary – Prabhtej Bhatia
Apex Council – Jaydev Shah
IPL GC – M Majumdar pic.twitter.com/CFtC6EDvER— Johns. (@CricCrazyJohns) September 21, 2025