Viral Video: వాహనంలో బయట వెళ్లినవారు క్షేమంగా ఇంటికి వచ్చేవరకు చాలామంది భయపడతారు. రోడ్లపై మనం జాగ్రత్తగా వెళ్లినా, అటువైపు వచ్చేవారు జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఈ లోకాన్ని విడిచిపెట్టినట్టే. కానీ కొన్ని ప్రమాదాల్లో చాలామంది సేఫ్‌గా బయటపడతారు. వారికి భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయని చెబుతారు. అలాంటి ఘటన ఒకటి అమెరికాలో జరిగింది. దీనికి సంబంధించి వీడియో వైరల్ అయ్యింది.
అమెరికాలో రోడ్ల ప్రమాదాల గురించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే విశాలమైన రోడ్లు, అతివేగం వంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. అనుకోకుండా ఒకవేళ ప్రమాదాలు జరిగినా ఏ ఒక్కరూ బతకడం కష్టమనే చెప్పాలి. ఆ తరహా ఘటనలు చాలానే జరిగాయి. మన భారతీయులు చనిపోయిన సందర్భాలు కోకొల్లలు. తాజాగా శుక్రవారం సాయంత్రం అమెరికాలోని ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఆ విజువల్స్ చూసినవారు మాత్రం, ఆ వ్యక్తికి భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయని అంటున్నారు.
శుక్రవారం సాయంత్రం అమెరికాలోని నెబ్రాస్కా గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ కారు ప్రమాదానికి వేదికైంది. ఆ భయానక ప్రమాదంలో ఓ వ్యక్తి తృటిలో తప్పించుకున్నాడు. గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్‌లో దిగి తన ట్రక్కును క్లీనింగ్ చేసుకుంటున్నాడు ఆ వ్యక్తి. ఆ సమయంలో వేగంగా వస్తోంది ఓ కారు. అయితే కారు డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేయడంతో పల్టీలు కొడుతూ విద్యుత్ స్థంబాన్ని ఢీ కొట్టింది.
కారు వేగానికి ఆ స్థంబం మూడు ముక్కలైంది. ట్రక్కు దగ్గరున్న వ్యక్తి వైపు వేగంగా దూసుకొచ్చింది. రెప్పపాటులో స్పందించి అతడు పక్కకు తప్పుకోవడంతో ప్రాణాపాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. కారులో ఉన్న వ్యక్తి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది కారు డ్రైవర్‌ని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ALSO READ: దాహమేస్తే ఇంజిన్ ఆయిల్ తాగేస్తాడు.. రోజు ఏకంగా 8 లీటర్లు
లింకన్ కౌంటీ వ్యక్తుల సమాచారం మేరకు ఘటన సమయంలో కారు గంటకు 65 మైళ్ల వేగంతో ప్రయాణిస్తోందని తెలిపారు. ఆ ప్రాంతంలో కేవలం 40 మైళ్ల వేగంతో ప్రయాణించాల్సి వుంది. అతి వేగం వల్లే ఈ ఘటన జరిగిందని అంటున్నారు. ప్రమాదానికి గురైన కారు వద్దకు వెళ్లి లోపలున్న ఆ వ్యక్తిని రక్షించే ప్రయత్నం చేశాడు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడం ఒకటి. లైసెన్స్, బీమా లేకపోవడం, గడువు ముగిసిన రిజిస్ట్రేషన్ కలిగి ఉండటం వంటి నేరాలకు పాల్పడినట్లు స్థానిక అధికారులు నిర్ధారణకు వచ్చారు.
యాక్షన్ సినిమాని తలపించే యాక్సిడెంట్..! వెంట్రుకవాసిలో తప్పిన ప్రమాదం
అమెరికాలోని నెబ్రాస్కా గ్యాస్ స్టేషన్‌లో చోటు చేసుకుంది pic.twitter.com/aB8gYywwtC
— ChotaNews App (@ChotaNewsApp) September 21, 2025