E-Paper
Advertisement

టీమిండియా ప్లేయర్లకు అవమానం…ఓయో రూముల్లోనే బస?

టీమిండియా ప్లేయర్లకు అవమానం…ఓయో రూముల్లోనే బస?
Advertisement

BCCI books separate accommodation for men’s cricket team at Asian Games : జపాన్ లోని ఐచి నగోయాలో నేటి నుంచి ఆసియా క్రీడలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ తరుణంలోనే టీమిండియాకు ఘోర అవమానం జరిగినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. టీమిండియా పురుషుల జట్టు కోసం బీసీసీఐ.. స్పెషల్ గా మళ్లీ ఓయ లాంటి హోటల్ బుక్ చేసిందని సమాచారం అందుతోంది. టీమిండియా ప్లేయర్ల కోసం మాత్రమే, ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా వసతి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. అంటే 15 మంది క్రికెట్ సభ్యులు ఉండేలా వసతి ఏర్పాట్లు జరిగాయన్న మాట. కానీ జపాన్ కు టీమిండియా క్రికెటర్లతో పాటు సిబ్బంది కూడా వెళ్లింది. టీమిండియా సిబ్బంది కూడా దాదాపు 10 మందికి పైగా ఉంటారు. ఈ క్రమంలో టీమిండియా కోసం ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా ఏర్పాటు చేసిన వసతి గదులు సరిపోలేదని సమాచారం. ఈ క్రమంలోనే ప్రైవేట్ హోటల్ కు టీమిండియా బృందాన్ని తరలించినట్లు చెబుతున్నారు.

టీమిండియా ప్లేయర్లకు అవమానం…ఓయో రూముల్లోనే బస?

 

Advertisement

ఆసియా క్రీడల నేపథ్యంలో ఓయో తరహా హోటల్ కు టీమిండియా ప్లేయర్లను తరలించినట్లు బీసీసీఐ అధికారి సైకియా కూడా అధికారిక ప్రకటన చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. టీమిండియాకు సంబంధించిన 15 మంది సభ్యులకు మాత్రమే ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా వసతి ఏర్పాట్లు చేసిన, తరుణంలో… ప్రత్యేక ఏర్పాటు చేశారట సైకియా. టీమిండియా ప్లేయర్లతో పాటు సిబ్బంది ఉండేలా ఒకే హోటల్ లో ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఆసియా క్రీడలు ప్రారంభం అయిన తరుణంలో ఐచి నగోయాలో అన్ని హోటల్స్ బుక్ అయినట్లు చెబుతున్నారు. ఇక చేసేది ఏమీ లేక… ఓయో లాంటి హోటల్ బుక్ చేసిందట బీసీసీఐ. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

మహిళలకు మెరుగైన ఏర్పాట్లు

ఆసియా క్రీడాలు ఆడేందుకు జపాన్ వెళ్లిన ఉమెన్స్ టీమిండియాకు మాత్రం మెరుగైన సౌకర్యాలు కల్పించారు. ఒలింపిక్స్ నిర్వాహణ సంస్థ ఏర్పాట్లపై టీమిండియా ఉమెన్స్ టీమ్.. సంతృప్తి వ్యక్తం చేసింది. వాళ్లు కేటాయించిన వసతుల్లోనే టీమిండియా సభ్యులు బస చేస్తున్నారు. ఇక ఆసియా క్రీడాల్లో భాగంగా నిన్న జపాన్ తో టీమిండియా ఉమెన్స్ టీమ్ తలపడింది. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా, 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో జపాన్ 57 పరుగులకే ప్యాకప్ కాగా, ఈ టార్గెట్ ను కేవలం 5 ఓవర్లలోనే ఫినిష్ చేసింది టీమిండియా. ఇక ఈ ఆదివారం సెమీస్ లో బంగ్లాదేశ్ తో టీమిండియా (team india) తలపడనుంది. అదే రోజున పాకిస్తాన్, శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా, పురుషుల టీమిండియా మ్యాచ్ లు సెప్టెంబర్ 24వ తేదీ నుంచి షురూ కానున్నాయి. సెప్టెంబర్ 28వ తేదీన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. శ్రేయస్ అయ్యర్ (shreyas Iyer) కెప్టెన్సీలోని టీమిండియా, ఈ క్రీడాల్లో పాల్గొంటుంది.

Related News

బీసీసీఐకి డ‌బ్బుల పొగ‌రెక్కువ‌…ఎవ‌రినైనా కొనేసి, టీమిండియా గెలిచేలా చేస్తుంది!

గౌతమ్ గంభీర్ దుర్మార్గుడు, వీధి రౌడీలా బిహేవ్ చేస్తాడు

ఇండియాలో హిందూ రాజ్యం న‌డుస్తోంది…షాహిద్ అఫ్రిది సంచ‌ల‌నం !

విడాకులు ఇవ్వ‌డం, కొత్త అమ్మాయిల‌తో తిర‌గ‌డం త‌ప్ప పాండ్యాకు ఏదీ చేత‌కాదు

భార‌త్ కు ఎదురుదెబ్బ‌…ఆసియా క్రీడల్లోనూ మెడ‌ల్స్ ఇవ్వ‌నున్న మొహ్సిన్ నఖ్వీ ?

వివాదంలో శ్రేయస్ అయ్యర్.. అసభ్య సైగలు చేస్తూ దొరికిపోయిన కెప్టెన్

ష‌మీ, భువ‌నేశ్వ‌ర్ కుమార్ ప‌ని అయిపోయింది..ఇక రిటైర్మెంట్ ఇచ్చేయండి

Big Stories

Advertisement
×