Manoj Tiwary On Gambhir: టీమిండియా ఒకప్పటి స్టార్ క్రికెటర్ మనోజ్ తివారీ.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేంద్ర సింగ్ ధోని కంటే ముందుగానే.. టీమిండియాలోకి వచ్చిన మనోజ్ తివారీ, ఆ తర్వాత కనుమరుగైపోయాడు. బెంగాల్ రాజకీయాల్లో చాలా చురుకుగా పాల్గొంటున్న మనోజ్, నిత్యం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై విమర్శలు చేస్తూ ఉంటాడు. అయితే లేటెస్ట్ గా గౌతమ్ గంభీర్ పై షాకింగ్ ఆరోపణలు చేశారు. గౌతమ్ గంభీర్ ఓ వీధి రౌడీలా బిహేవ్ చేశాడని ఫైర్ అయ్యారు. తనను కూడా కొడతానని బెదిరించినట్లు గుర్తు చేశారు. మ్యాచ్ జరుగుతుండగా గౌతమ్ గంభీర్ కు బీపీ ఒక్కసారిగా పెరుగుతుందని మండిపడ్డారు. తోటి క్రికెటర్లను కూడా చీప్ గా చూస్తూ… గౌతమ్ గంభీర్ రెచ్చిపోతాడని మనోజ్ తివారీ సీరియస్ అయ్యారు. దీంతో గౌతమ్ గంభీర్ పైన మనోజ్ తివారీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
2017 రంజీ ట్రోఫీ టోర్నమెంట్ సందర్భంగా ఢిల్లీ వర్సెస్ బెంగాల్ మధ్య మ్యాచ్ జరిగింది. ఢిల్లీ కెప్టెన్ గా గౌతమ్ గంభీర్ ప్రాతినిధ్యం వహించగా… మనోజ్ తివారీ బెంగాల్ తరఫున కెప్టెన్ గా ఉన్నాడు. ఈ క్రమంలోనే బెంగాల్ ఇన్నింగ్స్ సమయంలో మనోజ్ తివారీ మొదట క్యాప్ పెట్టుకొని బ్యాటింగ్ చేయడానికి క్రీజులోకి వచ్చాడు. అయితే ఉన్నఫలంగా ఫాస్ట్ బౌలర్ ను గౌతమ్ గంభీర్ బరిలోకి దించాడు. అయితే ఇది గ్రహించిన మనోజ్ తివారీ వెంటనే… బౌలర్ ను ఆపేసి, హెల్మెట్ కోసం తన తోటి ఆటగాడిని పిలిచాడు. ఈ నేపథ్యంలో స్లిప్ లో ఉన్న కెప్టెన్ గౌతమ్ గంభీర్… తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. కావాలనే మనోజ్ తివారీ సమయం వృధా చేస్తున్నాడని సీరియస్ అయ్యాడు.
సమయం వృధా అవుతోందని గౌతమ్ గంభీర్ తనను బండ బూతులు తిట్టాడని తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న మనోజ్ తివారీ కామెంట్ చేశారు. తన తల్లిని అవమానిస్తూ… గంభీర్ రెచ్చిపోయాడని ఆగ్రహించారు. సాయంత్రం నన్ను బయట కలువు… నీ పళ్ళు రాలగొడతా అంటూ తన దగ్గరికి వచ్చి గౌతమ్ గంభీర్ బెదిరించడానికి కూడా మనోజ్ తివారీ వెల్లడించారు. అయితే గంభీర్ వార్నింగ్ కు తాను బెదరకుండా.. రివర్స్ అటాక్ చేశానని తెలిపారు. సాయంత్రం దాకా ఎందుకు.. ఇప్పుడే బయటకురా చూసుకుందాం అంటూ సవాల్ విసిరినట్లు మనోజ్ తివారీ గుర్తు చేశారు. అయితే ఆ సమయంలో అంపైర్ శ్రీనాథ్ ఇద్దరినీ అడ్డుకునే ప్రయత్నం చేశాడని మనోజ్ తెలిపారు. అయినా కూడా ఆగకుండా అంపైర్ ను కూడా తోసేసాడని గౌతమ్ గంభీర్ పై ఆరోపణలు చేశారు. ఇది ఇలా ఉండగా గతంలో కేకేఆర్ జట్టు తరఫున ఈ ఇద్దరు ఆడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డ్రెస్సింగ్ రూమ్ లోనే గౌతమ్ గంభీర్, మనోజ్ తివారీ గొడవ పడ్డారు. ఈ సంఘటన కూడా అప్పట్లో వైరల్ గా మారింది.