E-Paper
Advertisement

130 పక్షుల గొంతులు పలికించే 12 ఏళ్ల బాలుడు, ఏం టాలెంట్ రా బుడ్డోడా?

130 పక్షుల గొంతులు పలికించే 12 ఏళ్ల బాలుడు,  ఏం టాలెంట్ రా బుడ్డోడా?
Advertisement

Boy Can Mimic 130 Bird Sounds: సాధారణంగా పక్షుల కూతలను విని.. అవి ఏ పక్షులు అనేది గుర్తించేందుకు ప్రయత్నిస్తాం. కానీ, అమెరికాకు చెందిన 12 ఏళ్ల సామ్యుల్ హెండర్సన్ మాత్రం పక్షుల కూతలను వినడమే కాదు.. వాటిని అచ్చం అలాగే పలికించే టాలెంట్ ను కలిగి ఉన్నాయి. ఒకటి రెండు రకాల పక్షులు కాదు. ఏకంగా 130కి పైగా పక్షుల శబ్దాలను తన గొంతుతో పలికిస్తూ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అమెరికాలోని ఒక్లహోమా రాష్ట్రానికి చెందిన సామ్యుల్‌ కు చిన్న వయసు నుంచే పక్షులపై ఆసక్తి పెరిగింది. వాటి కూతలను జాగ్రత్తగా వింటూ, ఒక్కో శబ్దాన్ని అనుకరించే ప్రయత్నం చేశాడు. క్రమంగా అతనిలో స్పెషల్ టాలెంట్ గా మారింది.

గొంతుతోనే కాదు.. చేతులతోనూ..

సామ్యుల్ పక్షుల శబ్దాలను అనుకరించే విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. గొంతు, నాలుకతో పాటు చేతులను ఉపయోగిస్తూ శబ్దంలో మార్పులు తీసుకొస్తాడు. ఏ పక్షి కూతను అనుకరిస్తున్నాడో దానికి తగ్గట్టుగా శబ్దం తీవ్రత, వేగం, పిచ్‌ను మార్చేందుకు ప్రయత్నిస్తాడు. అతడు చేసే శబ్దాలు కేవలం వినడానికి దగ్గరగా ఉండటం మాత్రమే కాదు. కొన్ని సందర్భాల్లో చుట్టుపక్కల ఉన్న నిజమైన పక్షులు కూడా అతని కూతకు స్పందిస్తున్నాయి. సామ్యుల్ పిలుపు విని అవి తిరిగి శబ్దాలు చేయడంతో అతడి టాలెంట్ కు మరింత గుర్తింపు తీసుకొచ్చింది.

మోసపోయిన ఏఐ యాప్‌..

Advertisement

సామ్యుల్ ప్రతిభలో ఆసక్తికరమైన విషయం మరోటి ఉంది. పక్షులను గుర్తించే కొన్ని ఏఐ ఆధారిత మొబైల్ యాప్‌లను కూడా అతడి శబ్దాలు గందరగోళానికి గురిచేశాయి. సాధారణంగా ఇలాంటి యాప్‌లు పక్షుల శబ్దాలను విశ్లేషించి ఏ జాతికి చెందిన పక్షి కూతో చెప్పేందుకు ప్రయత్నిస్తాయి. అయితే, సామ్యుల్ నిజమైన పక్షిలా శబ్దం చేయడంతో.. కొన్ని సందర్భాల్లో యాప్‌లు కూడా దాన్ని పక్షి కూతగానే గుర్తించాయి. దీంతో అతడి వీడియోలు సోషల్ మీడియాలో మరింత ఆసక్తిని పెంచాయి.

చిన్న వయసులోనే మొదలైన ఆసక్తి!

పక్షుల శబ్దాలను అనుకరించడం సామ్యుల్‌కు ఒక్కరోజులో వచ్చిన నైపుణ్యం కాదు. చిన్నప్పటి నుంచే పక్షులను గమనించడం, వాటి కూతలను వినడం, ఆ శబ్దాలను తిరిగి చేయడం సాధన చేస్తూ వచ్చాడు. ఒకే శబ్దాన్ని పలుమార్లు ప్రయత్నిస్తూ దాని స్వరాన్ని తన గొంతులోకి తీసుకురావడం అలవాటు చేసుకున్నాడు. కాలక్రమంలో అతడి పరిధి కూడా పెరిగింది. ప్రస్తుతం 130కి పైగా పక్షుల కూతలను అనుకరిస్తున్నాడు. ఒక్కో పక్షికి ప్రత్యేకమైన శబ్దాన్ని గుర్తుపెట్టుకోవడం, అవసరమైనప్పుడు దాన్ని సరిగ్గా రిపీట్ చేయడం అతడి ప్రత్యేకత. సామ్యుల్‌కు ఉన్న ఈ సూపర్ టాలెంట్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పక్షుల శబ్దాలను ఇంత చిన్న వయసులో ఇంత కచ్చితంగా అనుకరించడం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Read Also: మట్టిలో 2000 అండర్‌వేర్లను పాతిపెట్టిన శాస్త్రవేత్తలు.. ఇదేం విచిత్ర ప్రయోగం!?

Tags

Related News

భూగర్భంలో మరో సముద్రం.. పసిఫిక్‌ను మించి ఉందంటున్న శాస్త్రవేత్తలు!

మట్టిలో 2000 అండర్‌వేర్లను పాతిపెట్టిన శాస్త్రవేత్తలు.. ఇదేం విచిత్ర ప్రయోగం!?

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవు.. దీని ప్రత్యేకత తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఒంటరితనానికి క్రేజీ సొల్యూషన్.. జస్ట్ రూ. 300కే రెంట్ కు గర్ల్ ఫ్రెండ్, ఈ కాన్సెప్ట్ భలే ఉందే!

రైలు ప్రయాణంలో ఫ్యామిలీకి వేర్వేరు సీట్లు వచ్చాయా? ఇదిగో ముందుగానే ఇలా మార్చుకోండి

వామ్మో.. ఏకంగా అగ్నిపర్వతంలోనే ఇళ్లు కట్టేసుకున్నారు, పేలితే?

రూమ్ ఫ్రెష్‌నర్స్ లేకున్నా.. హోటల్ బాత్‌రూమ్స్ చాలా ఫ్రెష్‌.. దీని వెనుక రహస్యం ఇదే!

Big Stories

Advertisement
×