Shoaib Akhtar On Team India: టీమిండియా (Team India) అలాగే భారత క్రికెట్ నియంత్రణ మండలి పై (BCCI ) నిత్యం పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విషం కక్కుతుంటారు అన్న సంగతి తెలిసిందే. టీమిండియా అద్భుతం చేసి మ్యాజిక్ గెలిచినా, ఒకవేళ దురదృష్టవశాత్తు టీమిండియా ఓడిపోయినా, ఇందులో ఏది జరిగిన పాకిస్తాన్ మాజీలు మాత్రం సోషల్ మీడియా ముందుకు వచ్చి రెచ్చిపోతూ మాట్లాడుతూ ఉంటారు. ఏదో ఒక ఆరోపణ చేస్తూ పబ్బం గడుపుకుంటారు. ఈ నేపథ్యంలోనే అందరూ మంచోడు అని భావించే పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ( shoaib akhtar) కూడా తాజాగా టీమిండియా, బీసీసీఐపై షాకింగ్ ఆరోపణలు చేశారు. భారత క్రికెట్ నియంత్రణ మండలికి డబ్బు పొగరెక్కిందని ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో చిన్న క్రికెట్ బోర్డులను బెదిరించి మరి… మ్యాచ్ గెలుస్తోందని షాకింగ్ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.
టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మూడు టీ20 ల సిరీస్ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డును కొనుగోలు చేసి ఈ సిరీస్ టీమ్ ఇండియా గెలిచిందని షాకింగ్ ఆరోపణలు చేశారు. కావాలనే ఢిల్లీ వేదికగా ఈ సిరీస్ నిర్వహించారని… ఆతిథ్య జట్టుగా ఆఫ్గనిస్తాన్ కు హోదా ఇచ్చి బీసీసీఐ డ్రామాలు ఆడిందని ఫైర్ అయ్యారు. వాస్తవంగా ఈ సిరీస్ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో జరగాల్సి ఉందని.. ప్రాణ భయంతో టీమిండియా ప్లేయర్లు అక్కడ పర్యటించలేదని సీరియస్ అయ్యారు. ఇందులో భాగంగానే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ముఖాన 50 కోట్లు కొట్టారని ఆరోపణలు చేశారు. ఇక ఆ డబ్బుతో తమ క్రికెట్ జట్టును అలాగే మైదానాలను బాగా చేసుకోవచ్చన్న భావనతో ఆఫ్గనిస్తాన్… ఇండియాకు వచ్చిందని తెలిపారు. ఇక బిసిసిఐ ప్లాన్ ప్రకారమే మూడింటిలో ఆఫ్ఘనిస్తాన్ కావాలనే ఓడిపోయిందని షాకింగ్ ఆరోపణలు చేశారు. అంతేకానీ ఇందులో టీమిండియా గొప్పతనం ఏమీ లేదని పరువు తీశారు.
2004 సమయంలోనే టీమిండియా బౌలర్లు కొంతమంది… ఇంజక్షన్లు తీసుకొని మ్యాచ్ లు ఆడేవారని షోయబ్ అక్తర్ ఆరోపణలు చేశారు. ఫాస్ట్ బౌలింగ్ వేయడంలో టీమిండియా బౌలర్లు ఎప్పుడు కూడా విఫలమయ్యేవారని…. నొప్పులతో బాధపడే వారిని తెలిపారు. ఈ క్రమంలో ఎవరికి తెలియకుండా బీసీసీఐ దగ్గరుండి చాలామంది.. బౌలర్లకు ఇంజక్షన్లు ఇప్పించిందని షోయబ్ అక్తర్ వెల్లడించారు.