Shahid Afridi On Rahul Gandhi: ఇండియా, పాకిస్తాన్ మధ్య నిత్యం ఉద్రిక్త పరిస్థితులు ఉంటూనే ఉంటాయి. ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కూడా ఉన్నాయి. పహల్గాం సంఘటన అనంతరం, ఇండియా అటు పాకిస్తాన్ మధ్య దూరం మరింత పెరిగింది. క్రికెటర్లు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోవడం లేదు. ముక్సి నక్వి ట్రోఫీ ఇస్తే కూడా తీసుకోవడం లేదు ఇండియన్స్. అయితే ఇలాంటి తరుణంలో భారత దేశ రాజకీయాలపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో హిందూ రాజ్యం నడుస్తోందని.. అక్కడి పరిస్థితులు ఏ మాత్రం బాగాలేవని బాంబు పేల్చారు. ప్రధాని నరేంద్ర మోడీ కంటే రాహుల్ గాంధీ బెటర్ అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. సమస్య వస్తే, రాహుల్ గాంధీ చాలా చక్కగా డీల్ చేస్తారని ప్రశంసించారు. దీంతో ఇండియన్ రాజకీయాలపై షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.
భారత రాజకీయాలపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. సంబంధించిన సమా టీవీ ఛానల్ లో పాల్గొన్న షాహిద్ అఫ్రిది… భారత రాజకీయాలలో వేలు పెట్టాడు. ప్రస్తుత బిజెపి ప్రభుత్వంలో… మతం, హిందుత్వం తప్ప డెవలప్మెంట్ లేదన్నారు. హిందూ-ముస్లిం కార్డు… వాడుకొని బిజెపి రాజకీయాలు చేస్తుందని ఆరోపణలు చేశారు. ఇలా బిజెపి వ్యవహరిస్తే… భారతదేశ విభజనకు దారితీస్తుందని హెచ్చరించారు.
అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రశంసించారు షాహిద్ అఫ్రిది. ఆయన చాలా పాజిటివ్ మైండ్ సెట్ అంటూ వెల్లడించారు. సమస్యల పరిష్కారానికి విభజన కంటే చర్చలు జరపడానికే రాహుల్ గాంధీ ప్రాధాన్యత ఇస్తారని వెల్లడించారు. అలాంటి నాయకుడు ఉండడం భారతదేశ అదృష్టమని పేర్కొన్నారు షాహిద్ అఫ్రిది.
షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలకు అధికార బిజెపి పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇండియాను వ్యతిరేకించే వారందరికీ రాహుల్ గాంధీ మిత్రుడిగా కనిపిస్తున్నారని… కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తోపాటు బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవ్య ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీని పాకిస్తాన్ తమ నాయకుడిగా చేసుకోవచ్చని ఘాటుగా విమర్శలు కూడా చేశారు. అయితే బిజెపి చేసిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ కూడా తమ స్టైల్ లో రియాక్ట్ అయింది. గతంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు షాహిద్ అఫ్రిదితో కలిసి ఉన్న పాత ఫోటోలను విడుదల చేస్తూ కౌంటర్ ఇచ్చింది.