IND VS BAN : బంగ్లాదేశ్ జట్టుకు మరో ఊహించని షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఇప్పటికే ముస్తాఫిజుర్ రహమాన్ లాంటి బంగ్లాదేశ్ క్రికెటర్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు 2026లో ఆడకుండా భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో సంచలన నిర్ణయం భారత క్రికెట్ నియంత్రణ మండలి తీసుకున్నట్లు తెలుస్తోంది. 2026 సెప్టెంబర్ లో బంగ్లాదేశ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరగాల్సిన వన్డేలు అలాగే టీ20లు జరగడం కష్టమేనని తెలుస్తోంది. ఈ రెండు సిరీస్ లు రద్దు చేసుకునేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. దీనంతటికీ బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రహమాన్ కారణమని తెలుస్తోంది. అతని వల్లే బీసీసీఐ నిర్ణయం తీసుకుందట. 2025లోనే ఈ టోర్నమెంట్లు జరుగాల్సి ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్ కు వాయిదా పడింది. ఇక ఇప్పుడు ఈ ఏడాది కూడా ఈ టోర్నమెట్లు రద్దు ప్రమాదం పొంచి ఉంది.
Also Read: Sai Sudharsan Injury: విరిగిన పక్కటెముక.. పెను ప్రమాదంలో సాయి సుదర్శన్..ఐపీఎల్ 2026 నుంచి ఔట్ ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటు అతి త్వరలోనే ప్రారంభం కానుంది. మార్చి 26వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. అయితే ఈ టోర్నమెంట్ ప్రారంభం కాకముందే భారత క్రికెట్ నియంత్రణ మండలిపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ మొదలుపెట్టారు. బంగ్లాదేశ్ క్రికెటర్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ఆడకూడదని, ఫాన్స్ డిమాండ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో… అక్కడి నుంచి వచ్చిన ప్లేయర్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో ఛాన్స్ ఇవ్వడం దారుణం అంటూ ఫైర్ అవుతున్నారు. కేకేఆర్ జట్టుకు సంబంధించిన ముస్తాఫిజుర్ రహమాన్ ను అస్సలు ఆడించకూడదని ఫ్యాన్స్ నుంచి డిమాండ్ చేస్తున్నారు.
ఐపీఎల్ టోర్నమెంట్ కు సంబంధించిన అభిమానులు పదేపదే ముస్తాఫిజుర్ రహమాన్ పై ట్రోలింగ్ చేయడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2026 టోర్నమెంటులో బంగ్లాదేశ్ జట్టుకు సంబంధించిన ముస్తాఫిజుర్ రహమాన్ ఆడకూడదని ఆదేశాలు ఇచ్చింది బీసీసీఐ. అతను ఒక్కడే కాదు బంగ్లాదేశ్ కు చెందిన ఏ ఒక్క ప్లేయర్ ఐపీఎల్ 2026లో ఆడకుండా ఆదేశాలు ఇచ్చింది బీసీసీఐ. దీంతో టీమిండియా కు చెందిన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అటు హిందూ సంఘాలు కూడా బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పట్ల సంతృప్తి వ్యక్తం చేశాయి. ముస్తాఫిజుర్ రహమాన్ పై వేటు వేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి, ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ మాసంలో జరిగే వన్డేలు, టి20 పై కూడా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ లో టీమిండియా పర్యటించకుండా ఆదేశాలు ఇచ్చేలా కనిపిస్తోంది. బీసీసీఐ అనుకున్న ప్రకారం సెప్టెంబర్ లో 3 వన్డేల తో పాటు మూడు టీ20 లు బంగ్లాదేశ్ జట్టుతో టీమిండియా ఆడాల్సి ఉంది. అయితే బంగ్లాలో హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ రెండు టోర్నమెంట్లు రద్దు అయ్యే ప్రమాదం పొంచి ఉంది.
🚨 REPORTS 🚨
BCCI is set to put the Bangladesh tour, scheduled for the second half of 2026, on hold amid the Mustafizur Rahman controversy.
(Source: India Today)#Cricket #India #BANvIND pic.twitter.com/xvmrComxQu
— Sportskeeda (@Sportskeeda) January 3, 2026