IPL 2025 To SA: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటు ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో…. పాకిస్తాన్ తో యుద్ధం ఇప్పుడు అందరినీ టెన్షన్ పడుతోంది. పాకిస్తాన్ దొంగ దెబ్బ తీస్తూ ఇండియాపై అటాక్ చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ జమ్మూ కాశ్మీర్ లో… డ్రోన్లను ప్రయోగించింది పాకిస్తాన్ ఆర్మీ. అయితే వాటిని ఇండియన్ ఆర్మీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. లాహోర్ పై కూడా ఇండియా దాడి చేసింది. ఇలాంటి నేపథ్యంలో ఐపీఎల్ 2025 టోర్నమెంటుకు సంబంధించిన మ్యాచ్ అర్ధాంతరంగా రద్దయిపోయింది.
Also Read: Sakshi Singh Dhoni: KKR లేడీతో ధోని రొమాన్స్… సాక్షి స్ట్రాంగ్ వార్నింగ్
ఢిల్లీ వర్సెస్ పంజాబ్ మధ్య మ్యాచ్ రద్దు
ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా ఢిల్లీ వర్సెస్ పంజాబ్ ( Punjab Kings vs Delhi Capitals, 58th Match ) మధ్య హిమాచల్ లోని ధర్మశాల ( Himachal Pradesh Dharamshala ) వేదికగా ఇవాళ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. వర్షం కారణంగా కాస్త ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్… ప్రారంభమైన కాసేపటికి రద్దయింది. ఆ సమయంలో జమ్మూలో పాకిస్తాన్ తెగించి దాడులు చేసింది. దీంతో జమ్మూ కాశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి నేపథ్యంలో స్టేడియంలో మ్యాచ్ నిర్వహించడం.. ప్రమాదకరమని భావించిన మోడీ ప్రభుత్వం వెంటనే… ఆ మ్యాచ్ రద్దు చేసేసింది. వాస్తవానికి ఈ విషయం బయటకు చెప్పకపోయినా… మోడీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు చెబుతున్నారు. పంజాబ్ కింగ్స్… బ్యాటింగ్ చేస్తుండగానే స్టేడియానికి సంబంధించిన లైట్లు అన్ని ఆపేశారు. స్టేడియం కి వచ్చిన ప్రేక్షకులందరిని ఇంటికి పంపిస్తున్నారు అధికారులు. సాంకేతిక సమస్యల కారణంగా మ్యాచ్ రద్దయిందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ యాజమాన్యం. దీంతో ప్రేక్షకులు… స్టేడియాన్ని ఖాళీ చేసి ఇంటికి వెళ్తున్నారు.
దక్షిణాఫ్రికాలో ఐపీఎల్ 2025?
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య దాదాపు యుద్ధం ప్రారంభమైందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఐపిఎల్ 2025 టోర్నమెంట్ రద్దవుతుందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయితే ఇలాంటి పెద్ద టోర్నమెంట్ రద్దయే ఛాన్సులు లేవని మరికొంతమంది చెబుతున్నారు. ఒకవేళ మోడీ ప్రభుత్వం రద్దు చేయమని.. చెబితే, వేరే దేశానికి వెళ్తామని ఐపీఎల్ యాజమాన్యం సమాధానం ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి. దానికి మోడీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. గతంలో కూడా దక్షిణాఫ్రికాలో ఐపిఎల్ టోర్నమెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ టోర్నమెంట్ను దక్షిణాఫ్రికాకు తరలించే ఛాన్సులు ఉన్నాయి. మరో 15 రోజులు గడిస్తే టోర్నమెంట్ మొత్తం పూర్తవుతుంది. కాబట్టి అర్ధాంతరంగా రద్దు చేసే కంటే దక్షిణాఫ్రికాలో ఈ టోర్నమెంట్ నిర్వహించే ఛాన్స్ ఉంది. అన్ని జట్ల ప్లేయర్లను నేరుగా అక్కడికి తీసుకు వెళ్లే ఛాన్స్ కూడా ఉంటుంది.
Also Read: Sakshi Singh Dhoni: KKR లేడీతో ధోని రొమాన్స్… సాక్షి స్ట్రాంగ్ వార్నింగ్
IPL chairman Arun Dhumal requesting fans to leave the stadium as soon as possible at Dharamshala. pic.twitter.com/1Pj0H7I5cc
— Tanuj (@ImTanujSingh) May 8, 2025