Lawrence: రీల్ హీరోలను చూస్తూనే ఉంటాం.. కానీ రీల్ హీరోయలు రియల్ లైఫ్ లో కూడా అలానే ఉండేవాళ్ళని అతి కొద్ది మందిని చూస్తుంటాం… అంటువంటి రీల్ హీరో వర్సెస్ రియల్ హీరో వరుసలో ముందుండేది రాఘవ లారెన్స్… ఈయన మరోసారి తన దయార్థా హృదయాన్ని చాటుకున్నారు.. స్క్రీన్ మీదే కాదు నిజజీవితంలో కూడా ఆయన హీరో అని ఈ వీడియో చూసాకా మీకే అర్థం అవుతుంది..
గొప్ప మనసు చాటుకున్న లారెన్స్..
నటుడిగా, డాన్సర్ గా కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా, సింగర్ గా మనందరికీ సుపరిచితమే.. కొరియోగ్రాఫర్ గా తన కెరియర్ ని మొదలుపెట్టి, ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరోగా, దర్శకుడిగా పేరు పొందాడు. లారెన్స్ ఎప్పుడు ప్రజలకు సేవ చేస్తూ ఎంతోమంది అనాధలను చేర తీశాడు. పేదలకు సహాయం చేయడంలో అందరికన్నా ముందుంటాడు రాఘవ లారెన్స్. తాజాగా ఓ పేద కుటుంబం డబ్బు సహాయం చేసి ఆపదలో వారిని ఆదుకున్నాడు.. ఆ విషయాన్ని తన ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
లారెన్స్ సోషల్ మీడియా వేదికగా తను ఒక కుటుంబానికి చేసిన సహాయాన్ని అభిమానులతో పంచుకున్నారు. శివగంగై జిల్లా లో కుమార్ అనే వ్యక్తి, అతని భార్య కూలీలుగా పనిచేస్తున్నారు. వారికి ముగ్గురు పిల్లలు కూలికి వెళ్లి సంపాదించిన డబ్బు అంతా, ఓ గిన్నెలో వేసి దాచి పెట్టారు. అన్ని 500 రూపాయల నోట్లు, ఇంట్లో అవసరాల కోసం ముందుగానే దాచి పెట్టారు. ఓ కార్యక్రమం కోసం వాటిని వాడడానికి తీయగా అవన్నీ చెదలు పట్టి ఉన్నాయి. అది చూసి ఆ కుటుంబం ఎంతో బాధపడింది. ఎంతో కష్టపడితే వచ్చిన సొమ్ము ఇలా చదలు పాలవడంతో కన్నీరు మున్నిరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న లారెన్స్ ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. వారిని పిలిచి పోగొట్టుకున్న డబ్బుకు తన వంతు సహాయంగా లక్ష రూపాయలను అందజేశారు. ఆ కుటుంబం ఎంతో సంతోషించింది. లారెన్స్ కు వారు కృతజ్ఞత తెలిపారు. లారెన్స్ రాఘవేంద్ర స్వామి దయతో అంతా మంచే జరుగుతుంది అని చెప్పారు. ఈ వీడియో చూసిన వారంతా లారెన్స్ మరోసారి తన పెద్ద మనసుని చాటుకున్నారు అని కామెంట్ చేస్తున్నారు.
సమాజ సేవలో ముందుంటారు ..
ప్రస్తుతం లారెన్స్ బెంజ్ అనే మూవీలో నటిస్తున్నారు. వీటితోపాటు మరికొన్ని సినిమాలు నటించనున్నారు. లారెన్స్ ఇప్పటికే తన సొంత ట్రస్ట్ ద్వారా చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయిస్తున్నారు. పేద కుటుంబానికి చెందిన పిల్లలకు గుండెకి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారు లారెన్స్ ట్రస్ట్ ద్వారా ఫ్రీగా ఆపరేషన్ చేయించుకునే అవకాశాన్ని కల్పించారు. అంతేకాక ఎంతోమంది పేద విద్యార్థులను విద్యకు సహాయం చేస్తున్నారు. ఆయన సామాజిక సేవ ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలుస్తుంది.
Hi Everyone, I came across the news that a coolie family lost 1lakh of their many years of savings due to termites. My heart sank thinking about what they must’ve gone through. So, I’m happy to contribute the lost money for them. Thanks to the media and people involved in… pic.twitter.com/Rmhv3VNBNV
— Raghava Lawrence (@offl_Lawrence) May 8, 2025