Roshan: టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ ప్రముఖ నటులు శ్రీకాంత్, ఊహల కుమారుడు. తెలుగు సినిమా రంగంలో 2015లో బాల నటుడిగా తన కెరీర్ని ప్రారంభించిన రోషన్ నిర్మలా కాన్వెంట్ చిత్రంతో 2016లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో అతని నటనకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందD సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించారు. తాజాగా రోషన్ తదుపరిచిత్రంపై సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఆ వివరాలు చూస్తే..
పెద్ద డైరెక్టర్ తో మొదటి సినిమా..
రోషన్ 2021లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీలీల హీరోయిన్ గా పెళ్లి సందడి మూవీలో నటించారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ ని అందుకోలేదు. కానీ ఆయన నటనకు, డాన్స్ కు ప్రశంసలు అందుకున్నాడు. శ్రీలీల, రోషన్ కు మొదటి చిత్రంగా ప్రేక్షకుల ఆకట్టుకుంది. ఈ చిత్రంలో విశిష్ట పాత్రలో రోషన్ అలరించారు. రోషన్ తదుపరిచిత్రం మైత్రే మూవీ మేకర్స్ బ్యానర్ లో బడా దర్శకుడి తో రానున్నట్లు ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ లో రోషన్ కనిపించనున్నట్లు సమాచారం. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో స్వప్న సినిమా బ్యానర్ లో ఓ చిత్రం చేస్తున్నట్లు సమాచారం వచ్చింది అయితే ఆ ప్రాజెక్టు గురించి ఎక్కడ అధికారికంగా ప్రకటన రాలేదు. గతంలోనూ వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో ఓ మూవీ రోషంతో రానున్నట్లు అనుకున్నారు కానీ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. తాజాగా ఇప్పుడు మరో పెద్ద ప్రాజెక్టులో కనిపిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. మరి ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందా లేదో వేచి చూడాలి.పెద్ద డైరెక్టర్ తో మొదటి సినిమా ఫ్లాప్ అయింది మరి ఈసారైనా గట్టెక్కుతాడా అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఒకప్పుడు హీరో ..ఇప్పుడు విలన్ ..
రోషన్ తండ్రీ శ్రీకాంత్ పెళ్లి సందడి మూవీ తో 2021 లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ ని అందుకుంది. ఆ చిత్రం సీక్వెల్ గా తన కొడుకుతో రూపొందించారు. కానీ శ్రీకాంత్ సినిమా అంతా సక్సెస్ ఈ సినిమా అందుకోలేదు. శ్రీకాంత్ ప్రస్తుతం హీరోగా కన్నా విలన్ గా ఎక్కువ పాత్రలో నటిస్తున్నారు. ఒకప్పుడు శ్రీకాంత్ ఫ్యామిలీ హీరోగా పాపులర్ అయ్యారు. సంక్రాంతి నిన్నే ప్రేమిస్తా, రాధాగోపాలం, పెళ్ళాం ఊరెళితే, శుభలేఖ, కన్యాదానం, శంకర్ దాదా జిందాబాద్, ఆదిలక్ష్మి, నగరం, స్వరాభిషేకం శ్రీరామరాజ్యం, గోవిందుడు అందరివాడే, మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో, వేట, డి అంటే డి, మెంటల్ ,సరైనోడు, వంటి చిత్రాలలో నటించి ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.కొన్ని రోజులు బ్రేక్ తరువాత ఆయన విలన్ గా రి ఎంట్రీ ఇచ్చారు. శ్రీకాంత్ వరుసగా విలన్స్ క్యారెక్టర్ లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్కంద, కోటబొమ్మాలి,వంటి చిత్రాలతో అలరించారు. ఇటీవల గేమ్ చేంజర్ మూవీ తో మన ముందుకు వచ్చి సక్సెస్ ని అందుకున్నారు. ఈ చిత్రంలో ఆయన నటనకు ప్రశంసలు అందుకున్నారు.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది.
Allu Arjun: అల్లు అర్జున్-అట్లీ మూవీలో మళ్లీ మార్పులు… మొత్తం తగలెట్టేలా ఉన్నారే…