BCCI New Guidelines: టీమిండియా ప్లేయర్లకు భార్యలకు షాక్ ఇచ్చింది బీసీసీఐ పాలక మండలి ( Board of Control for Cricket in India)…బీసీసీఐ కొత్త ఆంక్షలు పెట్టేందుకు రెడీ అయిందట. ఆస్ట్రేలియాలో ఇటీవల జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా విఫలమైంది. అంతేకాదు.. దాదాపు 10 ఏళ్ల తర్వాత… బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది టీమిండియా. దీంతో.. టీమిండియా ప్లేయర్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది బీసీసీఐ. కఠిన నిర్ణయాలకు తెర లేపింది.
Also Read: Virat Kohli Restaurant: విరాట్ కోహ్లీ రెస్టారెంట్ లో నిలువు దోపిడీ.. మరీ ఇంత దారుణమా..?
ఆస్ట్రేలియా పర్యటన తర్వాత భారత క్రికెట్ జట్టుపై అసంతృప్తితో ఉన్న భారత క్రికెట్ బోర్డు ( Board of Control for Cricket in India) కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతోంది. ఒకటిన్నర నెలల పాటు సాగే పర్యటనలో 2 వారాలకు మించి ఆటగాళ్లతో పాటు భార్యలు, పిల్లలు ఇతర కుటుంబ సభ్యులు ఉండకూడదని కండీషన్స్ పెట్టనుందట. భారత ఆటగాళ్లు.. ప్రాక్టీస్ కంటే.. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుతున్న నేపథ్యంలో… ఈ నిర్ణయం తీసుకుందట బీసీసీఐ పాలక మండలి ( Board of Control for Cricket in India).
బీసీసీఐ పాలక మండలి కొత్త రూల్స్ ప్రకారం…టీమిండియా క్రికెటర్ల భార్యలు మొత్తం టూర్‌లో ఇకపై ఉండకూడదన్న మాట. ఉదాహారణకు 45 రోజుల పర్యటనలో ఒక క్రికెటర్ కుటుంబం వారితో గరిష్టంగా 2 వారాలు ఉండవచ్చు. గరిష్టంగా 2 వారాలు దాటితే… అక్కడి నుంచి క్రికెటర్ల ఫ్యామిలీ వెళ్లిపోవాల్సిందే. లేకపోతే చర్యలు తప్పవు.
ప్రతి ప్లేయర్ కూడా టీమిండియా జట్టుకు చెందిన బస్సులో మాత్రమే ప్రయాణించాలి, ప్రత్యేక ప్రయాణం ఇకపై ఉండదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్లు.. టీమిండియా జట్టుకు చెందిన బస్సులో కాకుండా.. ప్రత్యేకంగా వెళుతూ ఉంటారు.
Also Read: Nitish Kumar Reddy: మోకాళ్ళపై మెట్లెక్కి తిరుమలకు నితీశ్ కుమార్ రెడ్డి !
ఇకపై విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్ల ఆటలు సాగవు అన్న మాట. టీమిండియా ప్లేయర్ల జీతాలు కూడా తగ్గించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఆటగాళ్ల లగేజీ 150 కిలోలు దాటితే, ఇకపై BCCI అదనపు ఛార్జీలను కవర్ చేయదు. ఆ అదనపు ఛార్జీలను ఆటగాళ్లు చెల్లించాలి. గౌతమ్ గంభీర్ వ్యక్తిగత మేనేజర్ వీఐపీ బాక్స్‌లో కూర్చోవడానికి వీలు లేదు. అలాగే టీమ్ బస్సులో ప్రయాణించడానికి అనుమతించబడదు. గౌతమ్ గంభీర్ r ( Gautam Gambhir ) వ్యక్తిగత మేనేజర్ ఇకపై వేరే హోటల్‌లో బస చేయాల్సి ఉంటుంది.
ఆ ఖర్చు మొత్తం గౌతమ్ గంభీర్ భరించాల్సిందే. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత ఇటీవలే రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్‌లతో బీసీసీఐ పాలక మండలి ( Board of Control for Cricket in India) సమీక్ష సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే టీమిండియా ప్లేయర్లకు భార్యల విషయంపై నిర్నయం తీసుకుందట బీసీసీఐ పాలక మండలి. మరో ఆరు వారాల వ్యవధిలో ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ముఖ్యమైన ODI టోర్నమెంట్ జరగనున్నందున..తక్షణమే ఈ రూల్స్ అమలు చేయనున్నారట.
🚨 NEW GUIDELINES FROM BCCI. 🚨
– Cricketers’ wives will not be able to stay for the entire tour.
– A cricketer’s family can stay for a maximum of 2 weeks during a 45 day tour.
– Every player needs to travel by team bus, separate travelling not allowed. (Abhishek Tripathi). pic.twitter.com/ysCyHRguCO— Mufaddal Vohra (@mufaddal_vohra) January 14, 2025