Virat Kohli Restaurant: రన్ మిషన్ విరాట్ కోహ్లీకి కోట్లలో అభిమానులు ఉన్నారన్న విషయం తెలిసిందే. కోహ్లీ తన ఆట తీరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అతడు గ్రౌండ్ లోకి దిగితే ప్రత్యర్థి ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తూ పరుగుల వరద పారిస్తాడు. ఇక సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీకి ఫాలోవర్లు కూడా ఎక్కువే. అతడు సోషల్ మీడియాలో కేవలం ఒక్క పోస్ట్ చేస్తే కోట్లలో సంపాదన వచ్చిపడుతుంది.
Also Read: Nitish Kumar Reddy: మోకాళ్ళపై మెట్లెక్కి తిరుమలకు నితీశ్ కుమార్ రెడ్డి !
ఇతడు అత్యంత విలువైన ఆటగాళ్లలో ఒకరు. ఇక విరాట్ కోహ్లీకి పలు రెస్టారెంట్లు ఉన్న సంగతి కూడా తెలిసిందే. కేవలం క్రికెట్ లోనే కాకుండా కోహ్లీ పలు రంగాలలో తనదైన శైలిలో చెరగని ముద్ర వేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఓ పక్క బ్రాండెడ్ క్లాత్ బిజినెస్ తో పాటు మరోపక్క రెస్టారెంట్ల బిజినెస్ కూడా నిర్వహిస్తున్నాడు. కొన్నేళ్లుగా కోహ్లీ వన్ 8 కమ్యూన్ పేరుతో రెస్టారెంట్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కోహ్లీకి “వన్ 8 కమ్యూన్” పేరుతో ఇప్పటికే ముంబై, బెంగళూరు, పూణే, కోల్కత్తా వంటి నగరాలలో రెస్టారెంట్ లు ఉన్నాయి.
అయితే 2024 మే నెలలో హైదరాబాద్ లో కూడా వన్ 8 కమ్యూన్ బ్రాంచ్ ని ఓపెన్ చేశారు. హైటెక్ సిటీ లోని హార్డ్ రాక్ కేఫ్ కి సమీపంలో ఉన్న నాలెడ్జ్ సిటీలోని ఆర్ఎంజెడ్ థి లాస్ట్ లో ఈ రెస్టారెంట్ ని ప్రారంభించారు. ఈ వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్ లో గ్లోబల్ మెనూతో పాటు 20 రకాల లోకల్ రుచులను అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే హైదరాబాద్ లో ఉన్న కోహ్లీ కి చెందిన ఈ రెస్టారెంట్ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది.
హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కి చెందిన ఓ విద్యార్థిని సోమవారం రోజు విరాట్ కోహ్లీకి చెందిన వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్ కి వెళ్ళింది. ఈ సందర్భంగా ఆమె ఆ రెస్టారెంట్ లో ఓ ప్లేట్ బాయిల్డ్ కార్న్ తీసుకుంది. అది తిన్న తర్వాత ఆ రెస్టారెంట్ వేసిన బిల్లును చూసి ఆ విద్యార్థిని ఒక్కసారిగా షాక్ కి గురయ్యింది. ఒక ప్లేట్ బాయిల్డ్ కార్న్ కి ఆ రెస్టారెంట్ ఏకంగా 525 రూపాయల బిల్ వేసింది.
Also Read: Hardik – Janhvi Kapoor: జాన్వీతో రిలేషన్..పాండ్యా రెండో పెళ్లికి ముహుర్తం ఫిక్స్ ?
ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ.. ” హైదరాబాద్ లో కోహ్లీ కి చెందిన రెస్టారెంట్ లో ఉడకబెట్టిన ప్లేటు మొక్కజొన్న కంకులకు 525 రూపాయలు చెల్లించాను” అంటూ స్నేహ అనే విద్యార్థిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. కోహ్లీకి చెందిన చైన్ వన్ 8 కమ్యూన్ లోని ధరలపై ఇప్పుడు చర్చ మొదలైంది. ఆమె చేసిన ఈ పోస్ట్ పై కొందరు మద్దతు తెలుపుతుంటే.. మరికొందరు తప్పుబడుతున్నారు. బ్రాండ్ హోటల్స్ లో ఉండే ఎంబియన్స్ కి ఆ మాత్రం ధర ఉంటుందని కొందరు చెబుతుంటే.. కోహ్లీకి చెందిన రెస్టారెంట్ లో నిలువు దోపిడీ చేస్తున్నారు.. మరీ ఇంత దారుణమా..? అంటూ ఇంకొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
paid rs.525 for this today at one8 commune 😭 pic.twitter.com/EpDaVEIzln
— Sneha (@itspsneha) January 11, 2025