Nitish Kumar Reddy: టీమిండియా యంగ్ ఆల్ రౌండర్ , తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 – 2025 టోర్నమెంట్లో… అద్భుతంగా రానించి సత్తా చాటాడు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy ). ఈ టోర్నమెంట్లో సెంచరీ చేసి రాణించాడు. దీంతో ఒక్కసారిగా… తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy ) పాపులర్ అయిన సంగతి తెలిసిందే.
Also Read: Hardik – Janhvi Kapoor: జాన్వీతో రిలేషన్..పాండ్యా రెండో పెళ్లికి ముహుర్తం ఫిక్స్ ?
అయితే అలాంటి టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy )… తాజాగా తిరుమలలో ప్రత్యక్షమయ్యాడు. ఆస్ట్రేలియా టూర్ నుంచి ఏపీకి వచ్చిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి… తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్ళాడు. అయితే ఈ సందర్భంగా… కాలినడకన తిరుమలకు చేరుకున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. అంతేకాదు అలిపిరి కాలినడక మార్గంలో తిరుమలకు చేరుకున్న నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy )… మోకాళ్ళపై కూడా నడిచాడు.
దీనికి సంబంధించిన… వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అలిపిరి కాలినడక మార్గంలో ప్రయాణించిన నితీష్ కుమార్ రెడ్డి… తన మొక్కు తీర్చుకునేందుకు మోకాలపై నడిచాడు. చాలామంది భక్తులు ఇలాగా చేస్తారు. ఇందులో భాగంగానే నీతీష్ కుమార్ రెడ్డి కూడా తన మొక్కు చెల్లించుకున్నాడు. సోమవారం సాయంత్రం పూట కాలినడకన తిరుమలకు చేరుకున్నాడు. ఇక తిరుమలకు ( Tirumala) చేరుకున్న నితీష్ కుమార్ రెడ్డికి ( Nitish Kumar Reddy )… టిటిడి పాలక బృందం ఘన స్వాగతం పలికింది.
Also Read: South Africa Squad: ఏం గుండెరా అది.. బావుమా కెప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫీ బరిలో సౌతాఫ్రికా !
దీంతో నితీష్ కుమార్ రెడ్డి ని ( Nitish Kumar Reddy ) చూసేందుకు తిరుమల లో ( Tirumala) ఉన్న శ్రీవారి భక్తులు ఎగబడ్డారు. ఆయనతో సెల్ఫీ కూడా దిగారు. అయితే తిరుమలకు మోకాళ్లపై ఎక్కిన వీడియోలు తన సోషల్ మీడియాలో కూడా నితీష్ కుమార్ రెడ్డి పెట్టుకున్నాడు. దీంతో ఆ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఇక సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్న నితీష్ కుమార్ రెడ్డి…. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇవాళ ఉదయం విఐపి బ్రేక్ లో తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి. ఈ మేరకు టీటీడీ అధికారులు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy ) విశాఖకు చెందిన వాడన్న సంగతి తెలిసిందే. కాగా ఆస్ట్రేలియాపై రాణించిన నేపథ్యంలో ఇంగ్లాండ్ తో జరిగే టీ20 సీరిస్ కు కూడా ఎంపిక అయ్యాడు టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy ).
మోకాళ్ళపై మెట్లెక్కి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి pic.twitter.com/eCOniYEwLi
— Telugu Scribe (@TeluguScribe) January 13, 2025