BigTV English

Bhuvneshwar Kumar : భువీకి ‘రికార్డ్’ ఛాన్స్ వస్తుందా?

Bhuvneshwar Kumar : భువీకి ‘రికార్డ్’ ఛాన్స్ వస్తుందా?

Bhuvneshwar Kumar : టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డుకి చేరువగా ఉన్నాడు. కివీస్‌తో జరగబోయే రెండు T20 మ్యాచ్ ల్లోనూ స్థానం దొరికి… నాలుగు వికెట్లు పడగొట్టగలిగితే… మరో రికార్డు అతని ఖాతాలో పడుతుంది. కానీ… భువీకి కుర్ర బౌలర్ల నుంచి గట్టి పోటీ ఉంది. దాంతో.. వాళ్లను కాదని కెప్టెన్ పాండ్యా భువీని తుది జట్టులోకి తీసుకుంటాడా? అని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


T20 మ్యాచుల్లో ఈ ఏడాది 36 వికెట్లు తీశాడు… భువనేశ్వర్ కుమార్. ఇంకో నాలుగు వికెట్లు తీస్తే… 40 వికెట్లతో ఒక క్యాలెండర్ ఇయర్లో అతి ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టిస్తాడు. ఈ ఏడాది T20 మ్యాచుల్లో 39 వికెట్లు తీసిన ఐర్లాండ్ బౌలర్ లిటిల్… అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా తొలి స్థానంలో ఉన్నాడు. అతణ్ని అధిగమించాలంటే… న్యూజిలాండ్ తో జరగబోయే రెండు T20 మ్యాచుల్లోనూ భువనేశ్వర్ కుమార్ ఆడి… నాలుగు వికెట్లు తీయాల్సి ఉంటుంది. అది జరగాలంటే… ముందు అతనికి తుది జట్టులో చోటు దక్కాలి.

ఇటీవల ముగిసిన T20 ప్రపంచకప్‌లోనూ, అంతకుముందు జరిగిన ఆసియా కప్ లోనూ భువీ ఏ మాత్రం రాణించలేదు. లేకపోతే ఇప్పటికే అత్యధిక వికెట్ల రికార్డు భువీ ఖాతాలో పడి ఉండేది. ఇన్నింగ్స్ ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న భువనేశ్వర్… చివరి ఓవర్లలో మాత్రం భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఆసియా కప్ నుంచి వరల్డ్ కప్ దాకా… డెత్ ఓవర్లలో అతని బౌలింగ్ చూసి వాళ్లందరికీ ఈ విషయం అర్ధమైపోయింది. దాంతో… అతనికి మరో రెండు మ్యాచుల్లో ఛాన్స్ ఇచ్చి… ఇన్నింగ్స్ ఆరంభంలోనే పూర్తి కోటా ఓవర్లు వేయించాలని మాజీ క్రికెటర్లు, అభిమానులు సూచిస్తున్నారు. రెండో T20 జరిగే మౌంట్‌ మాంగనుయ్‌ స్టేడియం పిచ్ సీమర్లకు అనుకూలిస్తుంది కాబట్టి… భువీ తన స్వింగ్‌ బౌలింగ్ తో రాణించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడిక భువీ రికార్డు… కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేతుల్లో ఉంది.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×