CA on IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో… ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కొత్త కుట్రలకు తెరలేపింది. ఆస్ట్రేలియా ప్లేయర్లు ఇండియాకు… సరికొత్త వివాదానికి.. నాంది పలుకుతోంది క్రికెట్ ఆస్ట్రేలియా. వాస్తవానికి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో… ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నిరవధికంగా వాయిదా పడింది. దీంతో విదేశీ ప్లేయర్లు అందరూ ఇండియన్ వదిలి తమ తమ దేశాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయింది. యుద్ధం ఆగిపోయిన నేపథ్యంలో ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నిర్వహించేందుకు కసరత్తులు చేస్తోంది భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI ). ఇందులో భాగంగానే 10 ఫ్రాంచైజీలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. మంగళవారం రోజు లోపు విదేశీ ప్లేయర్లు ఇండియాకు చేరుకోవాలని… స్పష్టంగా పేర్కొంది. మే 16వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ పునః ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం అందుతోంది.
Also Read: Five Penalty Runs: ఒరేయ్ సచ్చినోడా కీపింగ్ అక్కడ చేస్తారా.. కొంపముంచిన హెల్మెట్.. 5 పరుగులు బొక్క
ఐపీఎల్ పై క్రికెట్ ఆస్ట్రేలియా కుట్రలు
విదేశీ ప్లేయర్లు ఇండియాకు రావాలన్న ఆదేశాల నేపథ్యంలో… క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త కుట్రలకు తెర లేపుతోంది. ఆస్ట్రేలియా ప్లేయర్లు.. ఇండియాకు రాబోరని చెప్పకనే చెబుతోంది క్రికెట్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ప్లేయర్లపై ఒత్తిడి తీసుకువచ్చి… ఇండియాకు రప్పించే ప్రయత్నం… అస్సలు చేయకూడదని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. ఒకవేళ అలా చేస్తే పరిణామాలు వేరే లాగా ఉంటాయని వార్నింగ్ కూడా ఇచ్చింది క్రికెట్ ఆస్ట్రేలియా. అటు ఆస్ట్రేలియా ప్లేయర్లకు కూడా.. గట్టిగానే వార్నింగ్ ఇచ్చిందట క్రికెట్ ఆస్ట్రేలియా.
ఐపీఎల్ టోర్నమెంట్ కు దూరం కాబోతున్న ఆస్ట్రేలియా ప్లేయర్లు
క్రికెట్ ఆస్ట్రేలియా ఆదేశాలు అలాగే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్లేయర్లు కూడా ఇండియాకు రావాలంటే భయపడిపోతున్నారట. అందుకే ఆస్ట్రేలియా ప్లేయర్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ , హెడ్, జోష్ హేజల్ వుడ్ లాంటి ప్లేయర్లు ఇండియాకు మళ్ళీ రావాలంటే వణికిపోతున్నారట. ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. క్రికెట్ కంటే తమకు ప్రాణాలు ముఖ్యమంటూ ఈ ప్లేయర్లు ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
Also Read: Hardik Pandya : తోటి ప్లేయర్ ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు.. అందుకే హార్దిక్ పాండ్యాకు విడాకులు !
ఐపిఎల్ పునః ప్రారంభం అప్పటి నుంచే ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ పునః ప్రారంభం తేదీలు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. మే 16వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో మే 25వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉండేది. ఐదు రోజులపాటు ఈ టోర్నమెంట్ ను పెంచారు. అంటే మే 30వ తేదీన… ఈ టోర్నమెంట్ ముగియనుంది. ఆ రోజున నరేంద్ర మోడీ స్టేడియం లో ఫైనల్ మ్యాచ్ ఉంటుందని చెబుతున్నారు.