E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: మనసులోని కుట్రను బయటపెట్టిన శ్రీవల్లి.. నర్మదకు సపోర్ట్ గా వేదవతి..

Illu Illalu Pillalu Today Episode: మనసులోని కుట్రను బయటపెట్టిన శ్రీవల్లి.. నర్మదకు సపోర్ట్ గా వేదవతి..
Advertisement

Illu Illalu Pillalu Today Episode may 12th: నిన్నటి ఎపిసోడ్ లో.. చందు జీతం తెచ్చి రామరాజుకు డబ్బులు ఇస్తారు. ఇక ఆ డబ్బులను ఇవ్వడానికి మనసులోని కుళ్ళను బయట పెట్టేస్తుంది శ్రీవల్లి.. తన భర్త సంపాదన మీదే ఇంట్లో వాళ్ళందరూ బతుకుతున్నారని, భర్త జీతం తెస్తే భార్యకి ఇవ్వాలి కానీ ఇంట్లో వాళ్లకి ఇవ్వడమేంటి అంటూ తెగ కుళ్ళుకుంటుంది. ముందు ఒక లెక్క పెళ్లయిన తర్వాత మరో లెక్క ఇప్పుడు పెళ్ళాం చేతిలోనే జీతం పెట్టాలి కదా బావ ఎందుకు ఇలా చేస్తున్నాడంటూ ఆలోచిస్తుంది.. కచ్చితంగా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని బావ ఆ చేతిలోనే జీతం మొత్తం పెట్టేలా చేసుకోవాలని ఆలోచిస్తుంది. వేదవతి అందరికీ కాఫీ తెచ్చేస్తుంది. కోడల్ని చూస్తూ ఉంటే నా కళ్ళు చల్లబడి పోతున్నాయి. ఇలా ఏ ఇంట్లో ఉంటారు చెప్పండి ముగ్గురు కోడళ్ళు అన్యోన్యంగా ఉంటారని గొప్పగా పొగిడేస్తుంది. ఇంట్లోని వాళ్ళందరూ రామరాజుకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శ్రీవల్లి చెప్పగానే రామరాజు చూసావా 8 నుంచి 10,000 ఖర్చు అవుతుంది అంటే నువ్వు సంపాదించాల్సింది ఇంకా ఉంది అనేసి ఎద్దేవా చేసి మాట్లాడుతాడు. అది విన్న శ్రీవల్లి నవ్వుకుంటుంది. ఇంకా తర్వాత అయినా మావయ్య గారు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని అడుగుతుంది.. ఏంటమ్మా అది అంటే ఇంట్లో మా ఆయన ఒక్కడే జాబ్ చేస్తున్నాడు జీతం ఇస్తున్నారు. మిగతా ఇద్దరు కొడుకులు మీకు జీతం ఇయ్యట్లేదు అంటే మా ఆయన ఒక్కడే కదా ఇంటి మొత్తాన్ని పోషిస్తున్నాడని అడిగేస్తుంది. ధీరజ్ చదువుతున్నాడు. ఖర్చే తప్ప, ఏమి ఉపయోగం లేదు.

Advertisement

అలాగే సాగర్  మన రైస్ మిల్లులోనే పనిచేస్తున్నాడు.. ఒక్క రూపాయి డబ్బులు ఇవ్వలేదు. అని మొహాన్నే చెప్పేస్తుంది. అది విన్న నర్మదా సీరియస్ అవుతుంది. సాగర్ ను అనడంతో  నర్మదా శ్రీవల్లితో గొడవకు దిగుతుంది. అక్క మా ఆయన అంటే నేను అసలు ఊరుకోను. మా ఆయన మిల్లులో పనిచేస్తున్నాడు. మీ ఆయన ఎంత ఇచ్చాడు 50000 మా ఆయన చేస్తున్న దానికి 70 వేలకు పైగా మావయ్య గారు ఇవ్వాలి. మా ఆయన ఎక్కువ జీతం సంపాదిస్తున్నాడు అన్న విషయం నీకు అర్థం కావట్లేదు అని శ్రీవల్లి గాలి తీసేస్తుంది. ఇక రామరాజుకి అర్థమయ్యేలా నర్మదా చెప్తుంది. మొత్తానికి కొడుకులు మధ్య శ్రీవల్లి చిచ్చు పెట్టేస్తుంది.

రామరాజు ఇదంతా ఎందుకు చేస్తున్నారు నటింట్లో ఏంటి గొడవ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక శ్రీవల్లి మాత్రం నేనేమైనా తప్పు చేశానా అని చందు అని అడుగుతుంది. చందు మాత్రం నువ్వే తప్పు చేయలేదని అనగానే అందరూ షాక్ అవుతారు. ఇక వేదవతి ధీరజ్ దగ్గరికి వెళ్లి నువ్వు చేసింది ఏమైన కరెక్టేనా..? నువ్వు మీ నాన్నకి డబ్బులు ఇస్తావా మీ నాన్న ఆత్మ అభిమానం ఎంత దెబ్బతింటుందో నువ్వు చూసావా ఎంత బాధ పడతాడో ఆలోచించవా? నేను ఆలోచించానమ్మ నాన్న మీ ఇద్దరు బాధ్యతలు నువ్వే చూసుకోవాలని అన్నారు.

Advertisement

ప్రేమను పెళ్లి చేసుకున్న తర్వాత తన బాధ్యత నాదే కదా.. తప్పు రైటు పెళ్లయితే అయిపోయింది తాను నా భార్య ఎవరి దగ్గర చేయి చాచి డబ్బులు అడగడం నాకు ఇష్టం లేదు. మిగిలిన ఇద్దరు కోడలు ముందర చేతులు చాచి డబ్బులు అడిగితే నాకు అవమానంగా ఉండదా అందుకే నేను సంపాదిస్తున్నాను. అమ్మ ఇది నా ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసేలా ఉండకుండా చూసుకుంటున్నాను అని వేదవతి తో అంటాడు. ప్రేమ సంతోషపడుతుంది.. ఇక వేదవతి బాధపడుతూ కూర్చోండడం చూసి నర్మదా ఎలాగైనా సరే అత్తయ్యని కాస్త నవ్వించాలి లేదంటే ఇలాగే బాధపడుతుందని అక్కడికి వస్తుంది.

ఎందుకు మీరు ఇంత బాధ పడుతున్నారు అని నర్మదా అడుగుతుంది. ఇంట్లో ఇలాంటి జరుగుతుంటే నేను ఎంత ఎలా సంతోషంగా ఉంటానని అనుకుంటున్నాను అని నర్మదను అంటుంది. మీరు ఎందుకింత బాధగా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. ధీరజ్ మాత్రం ఒక క్లారిటీతో ఉన్నాడు.. నా భార్యను ఎలా పోషించుకోవాలి తను జీవితంలో ఎలా పైకి రావాలని ఆలోచనతో ఉండడం మంచిదే కదా అని నర్మదా అంటుంది. అయితే అప్పుడే ప్రేమ అక్కడికి వస్తుంది. నీ గురించి మీ ఆయన గారు ఎంత గొప్పగా చెప్పారు ఇప్పుడే నాకు అత్తయ్య చెప్పింది మంచిదే కదా.. ఎప్పుడు లేనిది ఇంత సిగ్గు పడుతున్నావ్ అంటే ఏదో ఉంది అని నర్మదా అనగానే ప్రేమ మురిసిపోతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. బాలుకు నిజం తెలుస్తుందా..? ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : గ్రాండ్ గా బర్త్ డే వేడుక.. చక్రీ ప్లాన్ సక్సెస్.. చక్రీకి దిమ్మతిరిగే షాకిచ్చిన మహా..

Nindu Noorella Saavasam Serial Today Episode July 21st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు నిజం చెప్పిన ఎస్సై  

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. నర్మదకు భద్రపై అనుమానం.. వేదవతి ఫుల్ హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: పాపం మీనాక్షికి కన్నీళ్లు.. పల్లవి, కమల్ రొమాన్స్.. యోగా టీచర్ ఎంట్రీ అదుర్స్..

Brahmamudi Serial Today Episode July 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజు   

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Big Stories

Advertisement
×