Hardik Pandya : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సీజన్ లో అద్భుతమైన ఫామ్ లో ఉన్న ముంబై జట్టు మొన్న గుజరాత్ టైటాన్స్ తో ఓడిపోవడంతో ముంబై జట్టు మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. హార్దిక్ పాండ్యా తన తోటి ఆటగాడు మిచెల్ శాంట్నర్ ప్రైవేట్ పార్ట్ పట్టుకున్నట్టు ఓ వీడియో వైరల్ అవుతోంది. వాస్తవానికి అది కావాలని పట్టుకున్నది కాదు.. అనుకోకుండా అక్కడ చేతులు తాకడంతో దానిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరోవైపు హార్దిక్ పాండ్యా కి ఇలాంటి అలవాటు ఉండటం వల్లనే తన భార్య నటాశా సాంకోవిక్ విడాకులు ఇచ్చిందా..? అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం విశేషం.
Also Read : IPL 2025 – BCCI: ఐపీఎల్ 2025 కొత్త షెడ్యూల్.. ప్రతిరోజు రెండు మ్యాచ్ లు, 8 రోజుల్లోనే ఫినిష్
హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్ జట్టు టైటిల్ విజయం సాధించింది. అలాగే ముంబై ఇండియన్స్ కి ప్రస్తుతం కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా ఎంపిక చేసుకుంది ముంబై జట్టు. గత సీజన్ లో ముంబై అంతగా ఏమి ఆడలేదు. ఈ సీజన్ లో మాత్రం అద్భుతంగా ఆడుతోంది. ఈ సీజన్ లో ముంబై జట్టు తొలుత పేలవ ప్రదర్శన కనబరిచి ఆ తరువాత అద్భుత ఫామ్ లోకి వచ్చింది. టాప్ 4 జట్లలో ముంబై గ్యారెంటీగా పోటీలో ఉంటే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్లే ఆప్స్ కి వెళ్లినట్టు తెలుస్తోంది. మరోవైపు ముంబై, పంజాబ్ మధ్య గట్టి పోటీ నెలకొంది. వీరికి తోడు లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా పోటీలో ఉన్నాయి. కానీ అవి కాస్త వెనుకంజలో ఉన్నాయి.
హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిక్ వీరిద్దరీ అంగీకారంతో విడిపోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఎందుకు విడిపోతున్నామనే విషయాన్ని మాత్రం ఇద్దరూ వెల్లడించలేదు. హార్దిక్ వ్యక్తిత్వంతో నటాషా విసిగిపోయిందని.. అందుకే వీరు విడాకులు తీసుకున్నట్టు సమాచారం. ముఖ్యంగా వీరిద్దరి వ్యక్తిత్వపరంగా చాలా తేడాలున్నట్టు గుర్తించింది నటాషా. హార్దిక్ వ్యక్తిత్వానికి తగ్గట్టుగా ఉండేందుకు ఆమె ప్రయత్నించింది. కానీ అది నటాషా కి అసౌకర్యంగా అనిపించింది. జీవితాంతం ఇలాగే అతడితో ఉండలేక ఒక అడుగు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకుందట. ఒక్క రోజులోనే లేదా వారం రోజుల్లోనే తీసుకున్న నిర్ణయం కాదని.. దీని గురించి ఆమె ఎంతగానో ఆలోచించి తీసుకున్న నిర్ణయం అని చెప్పింది. హార్దిక్ మారకపోవడంతో కఠిన నిర్ణయం తీసుకుంది.
ఈ గాయం ఆమెను బాధిస్తూనే ఉన్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2019 డిసెంబర్ 31న దుబాయ్ లో పాండ్యా.. సెర్బియా నటి నటాషా చేతికి ఉంగరం తొడిగి తన ప్రేమను వ్యక్తపరిచి ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. ఆ తరువాత కుటుంబ సభ్యుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. 2020 జులై నటాషా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తరువాత 2023 ఫిబ్రవరి 14న హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు. ఇక విడాకులు తీసుకున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. విడాకులు తీసుకున్న తరువాత నటాషా కుమారుడు అగస్త్య ని తీసుకొని సెర్బియా వెళ్లిపోవడం విశేషం.